గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2018, మంగళవారం

యతిర్నవసుగంధి, భజనా, గర్భ కల్పద్రుమద్వయ, వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
యతిర్నవసుగంధి, భజనా, గర్భ కల్పద్రుమద్వయ, వృత్తము.
రచన:- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

కల్పద్రుమా"-ద్వయ,వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.

1.చూడవేమినీతిమార్గముం?శోభకంపు!కీర్తినందగాశూలిమెప్పులందుకొమ్మ!
వీడవేమి!స్వార్ధబుద్ధినిం?వేభజింపు!దేవతాళినిం!పేలవంపు!మాటలేల?
పాడుజన్మ!నీటిబుగ్గరా!ప్రాభవంబు!నిల్వదెన్నడుం?పాలిపోవు!రేపొ!మాపొ?
వాడిరాలెడెండు టాకురా!వైభవాలు!వెంట రావురా!బాలగాకు!బేల వౌచు?

2.శోభకంపు!కీర్తినందగా!చూడవేమి!నీతిమార్గముంశూలిమెప్పులందుకొమ్
వేభజింపు!దేవతాళినిం!వీడవేమి!స్వార్ధబుద్ధినిం?పేలవంపు!మాటలేల?
ప్రాభవంబు!నిల్వదెన్నడుం?పాడుజన్మ నీటిబుగ్గరా!పాలిపోవు!రేపొ!మాపొ!
వైభవాలు వెంటరావురా!వాడిరాలెడెండుటాకురా!బాలగాకు!బేలవౌచు?

1.గర్భగత"-మత్తరజినీద్వయ వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1.చూడవేమి?నీతిమార్గమున్!      2.శోభకంపు!కీర్తినందగా!
  వీడవేమి?స్వార్ధ బుద్ధినిన్?             వేభజింపు!దేవతాళినిన్!
పాడుజన్మనీటి!బుగ్గరా!                  ప్రాభవంబు!నిల్వదెన్నడున్?
వాడిరాలెడెండుటాకురా!                వైభవాలు!వెంట రావురా!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు..వృ.సం.171.ప్రాసగలదు.
శూలిమెప్పులందు కొమ్మ!
పేలవంపు!మాటలేల?
పాలిపోవు!రేపొ!మాపొ?
బాల!గాకు?బేలవౌచు!

3.గర్భగత"-రజినీకరప్రియద్వయ వృత్తములు.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములుయతి.10,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
1.చూడవేమి?నీతిమార్గముం?శోభకంపు!కీర్తినందగా!
 వీడవేమి?స్వార్ధ బుద్ధినిం?వేభజింపు!దేవ తాళినిన్!
పాడుజన్మ!నీటిబుగ్గరా?ప్రాభవంబు!నిల్వదెన్నడున్?
వాడిరాలెడెండుటాకురా!వైభవాలు!వెంటరావురా!

2.శోభకంపు!కీర్తినందగా!చూడవేమినీతతిమార్గమున్!
   వేభజింపు!దేవతాళినిం?వీడవేమి?స్వార్ధబుద్ధినిన్?
    ప్రాభవంబు!నిల్వదెన్నడుం?పాడుజపానీటిబుగ్గరా!
    వైభవాలు!వెంటరావురా!వాడి రాలెడెండుటాకురా!

4.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్ష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శోభకంపు!కీర్తినందగా!శూలిమెప్పులందుకొమ్మ?
వేభజింపు!దేవతాళినిం?పేలవంపు!మాటలేల?
ప్రాభవంబు!నిల్వదెన్నడుం?పాలిపోవు!రేపొ!మాపొ?
వైభవాలు!వెంట రావురా?బాలగాకు!బేలవౌచు?

5.గర్భఖత"-గిరివరదమ"-వృత్తము
ఉత్త్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములుయతులు.10,18.
ప్రాసనీమముగలదు.
శోభకంపుకీర్తినందదగా!శూలిమెప్పులందుకొమ్మ!చూడవేమి!నీతిమార్గమున్!
వేభజింపుదేవతాళినిం!పేలవంపు!మాటలేల?వీడవేమి?స్వార్ధబుద్ధినిన్?
ప్రాభవంబు!నిల్వదెన్నడుం?పాలిపోవు!రేపొ!మాపొ?పాడుజన్మ!నీటిబుగ్గరా?
వైభవాలు!వెంటరావురా?బాలగాకు?బేలవౌచు!వాడిరాలెడెండుటాకురా?

6.గర్భగత"-యతిర్నవ సుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శూలిమెప్పులందుకొమ్మ?చూడవేమి?నీతిమార్గమున్!
పేలవంపు!మాటలేల?వీడవేమి?స్వార్ధబుద్ధినిన్?
పాలిపోవురేపొ?మాపొ!పాడుజన్మ!నీటి బుగ్గరా!
బాలగాకు?బేలవౌచు!వాడి!రాలెడెండుటాకురా?

7.గర్భగత"-భజనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.భ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
శూలిమెప్పులందుకొమ్మ!చూడవేమి?నీతిమార్గముం?శోభకంపు!కీర్తినందగా?
పేలవంపు!మాటలేలవీడవేమమి!స్వార్ధబుద్ధినిం?వేభజింపు!దేవతాళినిన్?
పాలిపోవు!రేపొ!మాపొ?పాడుజన్మనీటిబుగ్గరా?ప్రాభవంబు!నిల్వదెన్నడున్?బాలగాకకు!బేలవౌచు?వాడిరాలెడెండుటాకురా?వైభవాలు!వెంటరావురా!
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
పండితుల వారికి శిరసాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.