గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఏప్రిల్ 2018, శనివారం

అష్టలక్ష్మీ వైభవము. రచన. బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్య శాస్త్రి గారు.

 జైశ్రీరామ్.
ఆర్యులారా!
బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్య శాస్త్రి మహనీయులు భక్తి భావమునను, పాండిత్యమునను, ఔదార్యమునను నివురుకప్పిన నిప్పు వంటి వారు. మనము మనకు మనగా వారితో సంభాషించినప్పటికీ వారిలోని మహనీయతను ఏమాత్రము ఊహింపనైననూ లేము. ఏమాత్రము గర్వమనునది వారిలో ఏకోశానా కనఁబడదు.
వీరు సంగీత విద్వాంసులు. సాహిత్యపరముగ చూచితిమేని మనకంతుపట్టదు వీరిలో ఉన్న అగాధమైయున్న జ్ఞానములోతు.
వీరు ఒకప్రక్క బ్యాంకు ఉద్యోగిగా మంచి సేవలందించుచునే వేరొక ప్రక్క అపురూపమైన గ్రంథరాజమును ఆకళింపు చేసుకొనుచు ప్రతీ అంశమును నిశితమైన పరిశీలనాత్మక దృక్కోణములో సమాజమునకు చూపుట వీరి ప్రత్యేకత.
అంతటి మహనీయులు కావుననే వీరి వ్యాసములనేకములు ఋషి పీఠము వంటి సుప్రసిద్ధ ఆధ్యాత్మిక పత్రికలలో ప్రచురితమైనవి.
అట్టి ఈ మహనీయుని రచన ఈ అష్ట లక్ష్మీ వైభవము. నృత్య రూపకము కనులారా చూచుచు వీనులారా వినుచు ఆనందామృఅతమును గ్రోలుచు ఆ అష్టలక్ష్మీ కటాకషమును పొందుదురు గాక.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నృత్య రూపకం చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.