జైశ్రీరామ్.
గతికాద్వయ,అనఘా,నశోచయ ,స్వభావద్వయ,భగవదాంశ, ప్రభుత,భూతలీ,గర్భ-"జ గదభీష్ట"-వృత్తము.రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
"-జగదభీష్ట"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ.స.జ.గ ల.వృత్తము.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
భగవదాంశ యున్నవాడె?ప్రభుత నందు!భూతలిం!ప్రగతిగోరు,వాడనంగ?
వగవనీక లోకమేలు! ప్రభల వెల్గు నీతినిం?.స్వగుణమైన! స్వార్ధి గాక!
జగదభీష్ట సిద్ధి కోరు?స్వబల,మర్ధ, దూరతం?జగడగామి గాక యొప్పు?
స్వగతమందునెంచుమంచి!సబలమైన!న్యా యముం?జగతికీర్తి!పెంపుజేయు!
1.గర్భగత"-గతికా"-ద్వయ వృత్తములు.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం. 344.ప్రాసగలదు.
1.భగవదాంశ యున్నవాడె? 2.ప్రగతి కోరు వాడనంగ?
వగవనీక లోకమేలు! స్వగుణమైన! స్వార్ధి గాక!
జగదభీష్ట సిద్ధి కోరు? జగడగామమి!గాక యొప్పు?
స్వగతమందు!నెంచు మంచి! జగతి కీర్తి! పెంపు జేయు!
2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ .సం.88.ప్రాసగలదు.
ప్రభుత నందు!భూతలిన్!
ప్రభల వెల్గు! నీతినిన్?
స్వ బల,మర్ధ,దదూరతన్?
స బలమైన!న్యాయమున్?
3.గర్భగత"-నశోచయ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.ర.లగ.గణము లు.యతి10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భగవదాంశ!యున్నవాడె?ప్రభుత నందు!భూతలిన్?
వగవనీక?లోక మేలు! ప్రభల! వెల్గు! నీతినిన్?
జగదభీష్ట! సిద్ధి కోరు? స్వ బల మర్ధ దూరతన్?
స్వగతమందు!నెంచుమంచి! స బలమైన!న్యాయమున్?
4.గర్భగత"-స్వభావద్వయ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.జ.గల.గణము లు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు
ప్రభుత నందు భూతలిం?ప్రగతి గోరు వాడనంగ?
ప్రభల వెల్గు నీతినిం?స్వ గుణమైన స్వార్ధి గాక?
స్వ బల,మర్ధ,దూరతం?జగడ గామి గాక యొప్పు?
స బలమైన న్యాయముం?జగతి కీర్తి పెంపు జేయు!
2.ప్రభుత నందు భూతలిం?భగవదాంశ యున్నవాడె?
ప్రభల వెల్గు నీతినిం?వగవనీక లోక మేలు!
స్వ బల,మర్ధ,దూరతం?జగదభీష్ట సిద్ధి గోరు?
స బలమైన న్యాయముం?స్వగతమందు నెంచు మంచి?
5.గర్భగత"-భగవదాంశ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.జ.భ.స.జ. గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ప్రభుత నందు భూతలిం?ప్రగతిగోరు వాడనంగ?భగవదాంశ యున్నవాడె?
ప్రభల వెల్గు నీతినిం?స్వగుణమైన స్వార్ధి గాక?వగవనీక?లోకమేలు?
స్వ బల,మర్ధ,దూరతం?జగడ గామి గాక యొప్పు?జగదభీష్టసిద్ధిగోరు?
స బలమైనన్యాయముం!జగతి కీర్తి పెంపు జేయు?స్వగతమందు నెంచుమంచి?
6.గర్భగత"-నరజయుగళీ"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.న.ర.జ.గణములు. యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ప్రగతి గోరు వాడనంగ?భగవదంశ యున్నవాడె?
స్వ గుణమైన స్వార్ధి గాక?వగవనీక?లోకమేలు!
జగడ గామి గాక?యొప్పు!జగదభీష్ట సిద్ధి గోరు?
జగతి కీర్తి పెంపు జేయు?స్వగతమందు నెంచు మంచి?
7.గర్భగత"-ప్రభుత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ న.ర.లగ.గణములు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.
ప్రగతి గోరు వాడనంగ?భగవదాంశ యున్నవాడె?ప్రభుత నందు భూతలిన్?
స్వగుణమైన స్వార్ధి గాక,?వగవనీక లోక మేలు?ప్రభల వెల్గు?నీతినిన్?జగడగామిగాక?యొ ప్పు!జగదభీష్ట సిద్ధి గోరు?స్వ,బల,మర్ధ,దూరతన్?
జగతి కీర్తి పెంపుజేయు?స్వగతమందు!నెంచు మంచి?స బలమైన
న్యాయమున్?
8.గర్భగత"-భూతలీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.జ.భ.స.జ. గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ప్రభుతనందు భూతలిం?భగవదాంశ యున్న వాడె?ప్రగతిగోరు వాడనంగ?
ప్రభలవెల్గు నీతినిం?వగవనీక?లోకమేలు!స్వగు ణమైన స్వార్ధిగాక?
స్వ బల,మర్ధ,దూరతం?జగదభీష్ట సిద్ధి గోరు?జగడగామిగాక?యొప్పు?
స బలమైన న్యాయముం?స్వగతమందు నెంచుమంచి?జగతి కీర్తిపెంపు
జేయు?
ఇట్లు.
తమవిశ్వసనీయుడు.
మూర్తి.జుత్తాడ.ఐ
1 comments:
ప్రణామములు
కవిబ్రమ్మకు శిరసాభి వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.