జైశ్రీరామ్.
గతికా,భాసిజ,సమాశ్రీ, భావస్ఫురణ,సఖియా,నెడద నిడు,కల్మినెంచు,బడుగు జీవ,మాతౄణ,గర్భ -"జీవధాత్రి"-వృత్తము .
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
-"జీవధాత్రి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.భ.స.జ.ర.జ.గ ల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కడుపుజూచు కన్నతల్లి!కల్మి,సుఖము కోరు భార్య!కన్నవారు!సంపదెంత్రు?
బడుగు జీవియైన గాని!బల్మి తనదు స్వేచ్ఛ నెంచు?బన్నమెంచరెంతకైన?
గడప దాటనీని!గుట్టు!కల్మషమును దొల్గజేయు?కన్న తల్లిదండ్రు లైన?
చెడునుజీల్చు!జీవధాత్రి!చెల్మి సఖియ! తోడునీడ!చిన్నచూపు!దోషమోపు!
1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం. 344.ప్రాసగలదు.
కడుపుజూచు!కన్న తల్లి!
బడుగు జీవి యైనగాని!
గడప దాటనీని గుట్టు!
చెడునుజీల్చు!జీవధాత్రి?
2.గర్భగత"-భాసిజ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.జ.గణములు.వృ.సం. 351.ప్రాసగలదు.
కల్మి,సుఖము కోరు భార్య!
బల్మి తనదు స్వేచ్ఛ నెంచు!
కల్మషమును!దొల్గజేయు!
చెల్మి సఖియ!తోడునీడ!
3.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ .సం.171.ప్రాసగలదు.
కన్నవారు!సంపదెంత్రు?
బన్న మెంచ రెంతకైన?
కన్నతల్లిదండ్రులైన?
చిన్నచూపు!దోషమోపు!
4.గర్భగత"-సుఖాశ్రి"-వృత్తము.
ధృతి ఛందము.న.ర.జ.భ.స.జ.గణములు.యతి.1 0.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కడుపు జూచు!కన్నతల్లి!కల్మి,సుఖము!కోరు !భార్య!
బడుగు జీవియైనగాని?బల్మి తనదు స్వేచ్ఛ నెంచు!
గడప దాటనీని గుట్టు?కల్మషమును దొల్గజేయు!
చెడును జీల్చు!జీవధాత్రి?చెల్మి సఖియ తోడునీడ!
.5.గర్భగత"-భావస్ఫురణ"-వృఛందము
అత్యష్టీఛందము.భ.స.జ.ర జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కల్మి,సుఖము కోరు భార్య!కన్నవారు సంపదెంత్రు?
బల్మి తనదు స్వేచ్ఛనెంచు!బన్న మెంచ రెంతకైన?
కల్మషమును దొల్గజేయు!కన్న తల్లిదండ్రులైన?
చెల్మి సఖియ తోడునీడ!చిన్నచూపు దోషమోపు?
6.గర్భగత"-సఖియా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.ర.జ.భ.స.జ.గ ల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కలిమి, సుఖము కోరుభార్య!కన్నవారు!సంపదెంత్రు? కడుపుజూచు!కన్నతల్లి!
బల్మి!తనదు!స్వేచ్ఛ!నెంచు!బన్ నమెంచ!రెంతకైన?బడుగు!జీవియైన గాని?
కల్మషమును!దొల్గజేయు!కన్న తల్లిదండ్రు లైన?గడప దాటనీని గుట్టు?
చెల్మి సఖియ!తోడునీడ!చిన్న చూపు!దోషమోపు?చెడును!జీల్చు!జీ వధాత్రి?
7.గర్భగత"-నెడదనిడు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కన్నవారు!సంపదెంత్రు?కడుపు జూచు కన్నతల్లి!
బన్నమెంచ రెంతకైన?బడుగు జీవి యైనగాని?
కన్నతల్లిదండ్రులైన?గడప దాట నీని గుట్టు?
చిన్న చూపు!దోషమోపు?చెడును జీల్చు జీవ ధాత్రి?
8.గర్భగత"-కల్మినెంచు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.ర.న.జ. గల.గణములు.యతులు.9,18
ప్రాసనీమముగలదు.
కన్నవారు!సంపదెంత్రు?కడుపుజూచు! కన్నతల్లి!కల్మి,సుఖము!కోరు!భా ర్య!
బన్నమెంచ! రెంతకైన?బడుగు!జీవి !యైనగాని?బల్మి తనదు! స్వేచ్ఛనెంచు!
కన్నతల్లిదండ్రులైన?గడప దాటనీని గుట్టు? కల్మషమును!దొల్గ జేయు!చిన్నచూపు!దోషమోపు?చెడును జీల్చు!జీవధాత్రి?చెల్మిసఖియ!తో డునీడ!
9.గర్భగత"బడుగుజజీవ"-వృత్తము.
ధృతిఛందము.భ.స.జ.న.ర.జ.గణములు. యతి.10.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
కల్మి ,సుఖముగోరు భార్య!కడుపు జూచు!కన్నతల్లి?
బల్మి తనదు!స్వేచ్ఛనెంచు?బడుగుజీవియై నగాని?
కల్మషమును!దొల్గజేయు! గడప దాటనీని గుట్టు?
చెల్మి సఖియ!తోడునీడ!చెడును జీల్చు!జీవధాత్రి?
10.గర్భగత"-మాతౄణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.న.ర.జ.ర.జ. గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కల్మి,సుఖము!కోరుభార్య!కడుపుజూ చు!కన్నతల్లి!కన్నవారు!సంపదెంత్ రు?
బల్మి!తనదు!స్వేచ్ఛ నెంచు?బడుగుజీవియైనగాని?బన్నమెం చరెంతకైన?
కల్మషమును!దొల్గజేయు!గడప దాటనీని గుట్టు?కన్నతల్లిదండ్రులైన?
చెల్మి సఖియ!తోడునీడ!చెడును !జీల్చు జీవధాత్రి?చిన్నచూపు!దోషమోపు?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అన్ని వృత్తములూ అలతి అలతి పదాలతో సులభ గ్రాహ్యముగానున్న్వి ధన్య వాదములు . సోదరులు శ్రీ శ్రీ చింతావారికి కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.