జైశ్రీరామ్
భారణా,ఉత్సుక,పరనిందా
" ఉత్పలోన్నత"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.న.త. లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
లౌకికవాద సంకలన!లక్షణ లక్ష్యము చేరుచో?లలితమౌ!భూతలినిన్?
శ్రీకర శోభకాకరత!శిక్షణ పాత్రము నందగా!చెలువమై!మేలొనరున్!
ప్రాకట లీల!నేర్పుగన! భక్షణగల్గు!ప్రపూర్ణతం!బలమదే!జా తికి నౌ?
వే కదలం వలెం?ప్రభల! భిక్షుక!తీరుకు దూరమై?విలువదే?భారతికిన్!
1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం. 471.ప్రాసగలదు.
లౌకికవాద సంకలన
శ్రీకర శోభకాకరత!
ప్రాకటలీల!నేర్పుగన!
వే కదలంవలె! ప్రభల!
2.గర్భగత"-ఉత్సుక"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం. 183.ప్రాసగలదు.
లక్ణణ!లక్ష్యము చేరుచో?
శిక్షణ పాత్రము నందగా!
భక్షణగల్గు?ప్రపూర్ణతన్!
భిక్షుక!తీరుకు?దూరమై!
3.గర్భగత"-పరనిందా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.త.లగ.గణములువృ .సం.104.ప్రాసగలదు.
లలితమౌ!భూతలినిన్!
చెలువమై!మేలొనరున్?
బలమదే!జాతికి నౌ!
విలువదే?భారతికిన్!
4.గర్భగత"-పూర్ణోత్పల"-వృత్తము
ధృతిఛందము.భ.ర.న.భ.భ.ర.గణములు. యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
లౌకిక వాద సంకలన!లక్షణ లక్ష్యము చేరుచో?
శ్రీకర శోభకాకరత!శిక్షణ పాత్రము నందుగా?
ప్రాకటలీల!నేర్పుగన!భక్షణ గల్గు ప్రపూర్ణతన్?
వే కదలంవలెం?ప్రభల!భిక్షుక తీరుకు దూరమై?
5.గర్భగత"-లక్షణా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.న.త.లగ. గణములు.యతి.10.వయక్షరము
ప్రాసనీమముగలదు.
లక్షణ లక్ష్యము చేరుచో?లలితమౌ?భూతలినిన్?
శిక్షణ పాత్రము నందునుగా?చెలువమై!మేలొనరున్!
భక్షణ గల్గు!ప్రపూర్ణతన్?బలమదే?జాతికి నౌ!
భిక్షుక తీరుకు దూరమై?విలువదే? భారతికిన్!
6.గర్భగత"-భిక్షుకతీరు"-వృత్తము .
ఉత్కృతిఛందము.భ.భ.ర.న.త.య.స.జ. లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
లక్షణ లక్ష్యము చేరుచో?లలితమౌ?భూతలినిం?లౌకిక వాదసంకలన!
శిక్షణ పాత్రము నందునుగా?చెలువమై మేలొనరుం?శ్రీకర!శోభకాకరత?
భక్షణ గల్గు ప్రపూర్ణతం?బలమదే?జాతికి నౌ?ప్రాకటలీల నేర్పుగన?
భిక్షుక తీరుకు? దూరమై? విలువదే?భారతికిం?వే కదలం వలెంప్రభల?
7.గర్భగత"-నేర్పులీలా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.త.య.స.జ.లల. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
లలితమౌ? భూతలినిం లౌకిక వాద సంకలన!
చెలువమై?మేలొనరుం?శ్రీకర శోభకా కరత!
బలమదే?జాతికి నౌ? ప్రాకట లీల నేర్పుగన?
విలువదే?భారతికిం? వే కదలం వలెంప్రభల?
8.గర్భగత"-లౌకిక వాద"- వృత్తము.
ఉత్కృతిఛందము.న.త.య.స.జ.స.స.స. లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
లలితమౌ?భూతలినిం?లౌకికవాద సంకన!లక్షణ లక్ష్యము చేరుచో?
చెలువమై?మేలొనరుం?శ్రీకరశోభకా! కరత!శిక్షణ పాత్రము!నందుగా?
బల మదే?జాతికి నౌ?ప్రాకట లీల నేర్పుగన?భక్షణగల్గు?ప్రపూర్ ణతన్?
విలువదే?భారతికిం? వే! కదలం వలెంప్రభల? భిక్షుక తీరుకు! దూరమై?
9.గర్భగత"-రంబకా"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.ర.న.గణములు. యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
లక్షణ లక్ష్యము చేరుచో?లౌకిక వాద! సంకలన!
శిక్షణ పాత్రము నందుగా?శ్రీకర శోభకాకరత?
భక్షణ గల్గు?ప్రపూర్ణతం?ప్రాకట లీల నేర్పు గన?
భిక్షుక తీరుకు దూరమై?వే కదలం వలెం!ప్రభల?
10.గర్భగత"-శోభాకర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.ర.న.న.త. లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
లక్షణ లక్ష్యము చేరుచో?లౌకిక వాద సంకలన!లలితమౌ?భూతలినిన్?
శిక్షణ పాత్రము నందుగా?శ్రీకర శోభాకరత?చెలువమై!మేలొనరున్?
భక్షణ గల్గు?ప్ర పూర్ణతం?ప్రాకట లీల నేర్పుగన?బలమదే!జాతికి నౌ?
భిక్షుక తీరుకు దూరమై?వే కదలం వలెం?ప్రభల?విలువదే?భారతికిన్?
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
వృత్తము పేరు చదవ డానికి ఉక్కిరి బిక్కిరి ఐంది.హమ్మయ ఈ పాండితీ స్రష్టకి ఎన్ని కృతజ్ఞతలు జెప్పినా సరిపోదు కదా !సరస్వతీ పుత్రులకే సాధ్య మవగలదు. శిరసాభి వందనములు . శ్రీ చింతా వారు ధన్యులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.