గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఏప్రిల్ 2018, సోమవారం

అఖిలం మథురమ్. శ్రీవల్లభ మధురోక్తులపై శ్రీ మేడూరి సూర్య సత్య నారాయణ అబ్ర్తిభిప్రాయము..

జైశ్రీరామ్.
అఖిలం మథురమ్.
మేడూరి సూర్య సత్య నారాయణ మూర్తి.
విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు
ఎం.ఏ,తెలుగు,ఎంఏ,సంస్కృతము.
శ్రీకాకుళము.
తొలిపలుకు
=======

"మధురం మథు పీయూషం తస్మాత్తస్మాత్కవేర్వచః".
      ఇది అదేదో అలంకారానికి లక్ష్యంగా చెప్పబడిన,సరస్వతీదేవికి
మహోత్తమాంకారమై విలసిల్లిన గొప్పమాట.
     తేనె! తియ్యన ! మరి అమృతమో! అది తియ్య తేనెకన్నా!ఇంకా
తియ్యన!మరైతే!కవివాక్కో!అది ఆతీపితేనెకన్నా! దాని తలదన్నే
మధురాతిమథధురమైన ఆ అమృతంకన్నా ఇంకా ఇంకా మరెంతో
ఎంతో తి..........య్యన!ఇది మీదిసంస్కృత  ఆలంకారిక వాక్యానికి
భావం
      సత్కవివల్లభుడడూ,పండిత సింహమూ,పరమ చ్ఛాందసుడూ,
అయిన శ్రీ వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి గారిది. ఇప్పుడు
వచోమకరందమో,వాగమృతమో,ఆరెండిటి కన్నా యింకా అతీత
మైనదో! ఆసూక్తిని  నేనైతే స్పష్ఠంగా నిర్వచించ లేను.
       "ఏకః  స్వాదు న భుంజీథ" తియ్యని తినుబండారాన్ని, ఒకడే
తినేయడం తగదు-కనుక తనహృదయంలో ఉదయించిన మధురాతి
మధుర భావాన్ని పంచియిచ్చారు శ్రీ మూర్తి గారు.ఆశ్వాదించి తరించ
మన్నారు.తాము రచించి స్వయంగా తరించారు."స్వయం తీర్థ్యా
ఫలాన్ తారయేత్" అని కధాభిజ్జ్ఞుల మాట.
      ఈ మధురోక్తుల మంచి మహాన్వితమైన కృతిలో కొన్ని చేదునిజాల్ని
కూడా చక్కెర పూతతో అమృత గుళికలుగా మార్చి పద్యాలుగా మలిచి
మంచి భేషజం ఉపయోగించారుకవివర్యువలు.ఒజ్జలుగడుగ్గాయి పిల్లలకు
ఆమోదకరంగా చేసి,మంచి మంచి అంశాలు వాళ్ళబుర్రలకు గడుసుగా
ఎక్కిస్తారు కదా! వల్లభ వఝల వచో విలసజ్ఝరి మరి అలాంటిదే కదా!
        ప్రతీ ఉదాహృతీ హృదికి ఆవర్జకమైనదే! వల్లభ వఝల మధురోక్తి
వజ్రమేనంటే  ఇది సత్యోక్తి! 
36.వ పద్యంలో నేటి ఓటింగు వ్యవస్థను  ఖంగుమంటున్న తమ వచో
ధాటితో కవి వరేణ్యులు దుయ్య బట్టిన వైనం తిలకించండి
            కం.  కాటికి చను శవమైనను
                   నోటును చూపించ లేచు!నూటికి బంటై
                   కోటికి పడగల నెత్తెడి
                   కోటీశ్వరులెల్ల "ఓట్లు"-కోరుట తప్పా!           .--36.వ.పద్యం.
సుతి మెత్తగా మతులు పోనాడుతారు  స్తుత్య వచో వైభవంతో  సుకవి
సత్తములు.
         38.కం. కాకియు కోకిల రూపున్
                    ఏకీభవమందుగాని!ఎవ్విధి నైనన్
                    కాకియు గోకిల కూతల
                    ఏకీభవమొనరునె?భువి!యెంచవలెనన్!
ఈపద్యం
శ్లో: కాకః కృష్ణః , పికః కృష్ణః,కో భేదః పిక కాకయోః
     వసంతకాలే సంప్రాప్తే!కాకః కాకః పికః పికః!!
అనే శ్లోక భావాన్ని అందంగా ఆవిష్కరించిందికదా!ఇది నేటి సమాజానికి
ఓ పదునైన చురక.
           46. కం: చదివిన వినయము కలుగును
                        పదిలపు పాత్రతను-వినయభావమ్ము నిడున్
                       మృదుపాత్రత!ధనమొసగును
                      అదియే!పరమార్ధమంచు-నరయగ వలెన్!
ఈచక్కటి పద్యం
శ్లో:-విద్యా దదాతివిననయం,వినయాద్యాతి పాత్రతాం,
      పాత్రాత్వాద్ధనమాప్నోతి',ధనాద్ధర్మం,తయః సుఖం!
అనే!శ్లోకానికి!వెలుగు నిచ్చే సొగసైనతెలుగు.నేటి విద్యార్ధి లోకానికి మంచి
కనువిప్పు.బాలబాలికల నడవడికి మేటిమె్పు
                  58.కం:-తినతిండి కొదువ యయ్యును
                               తనయుల నెందరినొ కనుట! తగునే? ధాత్రిన్.
                               మునుపటి దినములు కావివి?
                               కనుగొని జీకలికాలమునన్-కలికాలమునన్!
చిన్నకుటుంబం చింతలేని కుటుంబం అని కుటుంబ నియంత్రణ సూత్రాన్ని
సరళ సుందరంగా తెలియజెప్పే!సొంపైనపద్యం ఇది.కవిగారి సామాజిక స్పృహ,సంస్కరణ శీలత,అనేవాటికి,ఈపద్యం అద్దం పడుతుంది.
                 64..కం.నేడో రేపో పోయెడి
                             పోడిమి చెడు దేహభ్రమ-పూజ్యంబౌనే?
                            మూడగు రోజుల ముచ్చట!
                           వేడుకగా!నెంచకుమయ! విశ్వ విధేయా!
"శ్రీద్యతే ఇతి శరీరమ్"-శిధిలమయ్యేది!అని శరీరపదానికి వ్యుత్పత్తి.దేహంపై
మోహం తగదని,ఈ కాయాశాశ్వతంగా!కాయడం  సాధ్యంకాదనిమూనాళ్ళ
ముచ్చటకు భ్రమసిపోవద్దనిభర్తృహరిలా,ఓధూర్జటిలా,పరమవైరాగ్యభావాన్ని
చాటిచెప్పిన!కవిగారు గొప్ప తత్త వేత్త.విలువలుశిలువకెక్కకుండా!పట్టు
వలువలు కట్టి పదిలంగా కాపాడి,నేటి సమాజానికి , నేటి బాలలకు!అందించే
ప్రయత్నం అడుగడుగునా!ఇందులో కానవస్తుంది.ఓ సుమతీ శతకంలా,బాగా
వినియోగ పడాలని,కవిగారి పరిశ్రమ,సార్ధకం కావాలని,మనసారా!
కోరుకొంటున్నాను.ఇది ఒక వల్లభాష్టకంబు, అంతా మధురంగా తత్త
                                 ఇట్లు
                      సుకవి విధేయ
          మేడూరి సూర్య సత్య నారాయణ మూర్తి.
                        శ్రీకాకుళం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ మేడూరి సూర్య సత్య నారాయణ మూర్తిగారు అద్భుతమైన విశ్లేషణను ఇచ్చి నందులకు కృతజ్ఞతలు . మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.