జైశ్రీరామ్.
భత్రసా,ఉత్సుక,మార్గగా మినీ,గురుప్రోక్త,ఉత్త మా,సద్వర,సభాయనమః,జగన్మే లు,చిదంబర,సచ్ఛిత్,గర్భ -"శోభాయమాన"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
"-శోభాయమాన"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.స.భ.భ.ర.న.మ.ల గ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
సద్వర చిత్సంభరితమౌ?సద్గురు ప్రోక్తము నుత్తమై!జగతికిన్మేల్మేలగున్?
సద్వశ బోధామృత మిలన్?సద్గుణ గణ్యమగున్గదే?స్వగమ తీరున్మార్చుగా!
విద్వర కీర్తిం!శుభగమై!విద్గుణ లోకముతీరునున్వెగటగుం?దుశ్చింతలు న్?
ఉద్వహ!శోభాయత గనుం?ఉద్గుణ మేర్చును!సర్వమున్నోగిర!పూర్ణంబౌ ?
రసన్?
భావము:-శ్రేష్టతావాచియు,పరబ్రహ్ మ! స్వరూపమగు సత్యముతో నిండిన
చిత్తము గల, సద్గురు ప్రోక్తము ఉత్తమమై జగతికి మేలుజేకూర్చును."సత్"
తోకూడిన బోధామృతము!ధాత్రినిగుణవంతమైన లెక్కగానడుపును.మానవ
నైజిక దుశ్చింతలు తొలగించును.అవినీతిచైదములతీరు మార్చి,శోభాయ మానమగుచు"ధనంమూలమిదంజగత్తనే!దుశ్ చింతాయుత తీరునకు వెగటు
గల్గించును.శోభాయుతమై!కల్యాణ ప్రదమై!మహత్తర!శుభ గుణము,సమస్త
జీవజాలమునకు భుక్త ప్రపూర్ణత! జేకూర్చును.
1.గర్భగత"-భత్రసా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.స.గణములు.వృ.సం. 231.ప్రాసగలదు.
సద్వర చిత్సంభరితమౌ
సద్వశ బోధామృతమిన్?
విద్వర కీర్తిం!శుభగమై!
ఉద్వహ శోభాయత!గనున్!
2.గర్భగత"-ఉత్సుక"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం. 183.ప్రాసగలదు.
సద్గురు ప్రోక్తము నుత్తమై!
సద్గుణగణ్య మగున్గదే?
విద్గుణ లోకము తీరునున్?
ఉద్గుణ మేర్చును సర్వమున్!
3.గర్భగత"-మార్గగామినీ"-వృత్తము .
అనుష్టుప్ఛందము.న.మ.లగ.గణములు.వృ .సం.72.ప్రాసగలదు.
జగతికిన్మేల్మేలగున్?
స్వగమ తీరున్మార్చుగా?
వెగటగున్దుశ్చింతలున్?
ఓగిర పూర్ణంబౌ?రసన్!
4.గర్భగత"-గురు ప్రోక్త"-వృత్తము.
ధృతిఛందము.భ.త.స.భ.భ.ర.గణములు.య తి.10.వ.యక్షరము.
ప్రాస నీమముగలదు
సద్వర చిత్సంభరితమౌ?జగతికిన్మేల్మేలగు న్?
సద్వశ బోధామృతమిలం?సద్గుణ గణ్య మగుం కదే?
విద్వర కీర్తిం!శుభగమై?విద్గుణ లోకము తీరునున్?
ఉద్వహ శోభాయత!గనుం?ఉద్గుణ మేర్చుం?సర్వమున్?
5.గర్భగత"-ఉత్తమా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.న.మ.లగ. గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
సద్గురు ప్రోక్తము నుత్తమై?జగతికిన్మేల్మేలగున్?
సద్గుణ గణ్యమగున్గదే?స్వగమ తీరున్మార్చుగా?
విద్గుణ లోకము తీరునుంవెగటగున్దుశ్చింతలున్?
ఉద్గుణ మేర్చును!సర్వమున్నోగిర పూర్ణంబౌరసన్?
6.గర్భగత"-సద్వర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.న.మ.య.స.భ. లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
సద్గురు ప్రోక్తము నుత్తమై!జగతికిన్మేల్మేలగున్? సద్వర చిత్సంభరితమౌ?
సద్గుణగణ్య మగున్గదే!స్వగమ తీరున్మార్చుగా?సద్వశ బోధామృతమిలన్?
విద్గుణలోకముతీరునున్వెగటగుం?దు శ్చింతలున్విద్వర!కీర్తిం!శు భగమై?
ఉద్గుణ మేర్చును!సర్వమున్నోగిర!పుర్ణం బౌ?రసన్నుద్వహ!శోభాయత!గనునన్?
7.గర్భగత"-సభాయనమః"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.య.స.భ.లగ. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగతికిం!మేల్మేలగుం? సద్వర! చిత్సంభరితమౌ?
స్వగమ తీరున్మార్చుగా?సద్వశబోధధామృత! మిలన్?
వెగటగున్?దుశ్చింతలున్?విద్వర కీర్తిం?శుభగమై!
ఓగిర పూర్ణంబౌ? రసం! ఉద్వహ ! శోభయత?గనున్!
8.గర్భగత"-జగన్మేలు-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.య.స.భ.య.స.స. లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జగతికిం!మేల్మేలగుం?సద్వర చిత్సంభరితమౌ?సద్గురు!ప్రోక్తము !నుత్తమై?
స్వగమ!తీరుంమార్చుగా!సద్వశ !బోధామృత మిలం?సద్గుణగణ్యమగుంగదే!
వెగటగుం?దుశ్చింతలుం?విద్వర!కీ ర్తిం!శుభగమై!విద్గుణ!లోకము తీరునున్?
ఓగిర!పూంబౌ?రసం!ఉద్వహ శోభాయత?గనుం?ఉద్గుణమేర్చును!సర్ వమున్?
9,గర్భగత"-చిదంబర"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.త.స.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
.సద్గురు ప్రోక్తము!నుత్తమై?సద్వర!చిత్సం భరితమౌ?
సద్గుణ గణ్య మగుంగదే?సద్వశ!బోధామృతమిలన్?
విద్గుణ లోకము తీరునుం?విద్వర కీర్తిం?శుభగమై!.
ఉద్గుణ మేర్చును!సర్వముం?ఉద్వహ!శోభాయత! గనున్?
10.గర్భగత"-సచ్ఛిత్"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.త.స.న.మ. లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
సద్గుణ ప్రోక్తము!నుత్తమై?సద్వర!చిత్సం భరితమౌ?జగతికింమేల్మేలగున్?
సద్గుణ గణ్యమగుంగదే?సద్వశ!బోధామృతమిలం? స్వగమ!తీరున్మార్చుగా?
విద్గుణ లోకము తీరునుం?విద్వర కీర్తిం!శుభగమైవెగటగుం!దుశ్చిం తలున్?
ఉద్గుణమేర్చును!సర్వముం?ఉద్వహ! శోభాయత!గనుం?ఓగిర!పూర్ణంబౌ?
రసన్!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
1 comments:
good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.