గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

బాలార్కః ప్రేత ధూమశ్చ . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. బాలార్కః ప్రేత ధూమశ్చ, వృద్ధా స్త్రీ, పల్వలోదకమ్,
రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయు క్షీణమ్ దినే దినే.
ఆ. బాల సూర్య రశ్మి, వరహీన రతి కేళి,
ప్రేత ధూమము, కడు ప్రాత నీరు,
రాత్రులఁ బెరుగన్న మాత్రతన్ దినుచుంట
ఆయువంత తరుగునార్యులార!
భావము. ఉదయించే సూర్య రశ్మి, శవము కాలుచున్నప్పుడు వచ్చే పొగ, తనకంటే పెద్దదైన స్త్రీసంగమము, నిలువయున్న నీరు, రాత్రి సమయమున పెరుగన్నము తినుట ఇవి క్రమముగా ఆయువును హరించును.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆయువును హరించు లక్షణములను చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.