గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జులై 2017, ఆదివారం

నూతన ఛందములలో గర్భ కవిత 91. . . . రచన . . . శ్రీ వల్లభ

 జైశ్రీరామ్.
రక్షిత .దివసనాధ .మృదుపద. తాపశమన. చిన్నారీ. నయకర. పసిత. బలిద. ప్రేమక. మావల్లభా. నరోద్యత.జీవిక. త్వరగతి. బసవరాజి. చిదానంద. గర్భ. అవలోకనా వృత్తము.  
రచన .వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి  జుత్తాడ. 
అవలోకనా వృత్తము.  
చిన్నారి. పొన్నా రి చిరుత ప్రాయంబున చెలిమి బలము నంద  చిందించు ప్రేమ 
మన్నించి లాలించు మరిమరీ మెచ్చుచు మలిన రహితంబు వీడి మందంబు వీడి 
వన్నెల్ల వెన్నెల్ల వరదమౌ నీతుల బలమును మది గూర్చు బంధంబు పెంచి 
చెన్నొందు మార్గాన స్థిరత జేకూర్చుమ జిలుగు మెరుగులొప్ప చెందింకీ ర్తి. 
గర్భ గత వృత్తములు .
1.చిన్నారి పొన్నారి ..
మన్నించి లాలించు 
వన్నెల్ల వెన్నెల్ల
చెన్నొందు మర్గాన .
2.
చిరుత ప్రాయంబున 
మరిమరీ మెచ్చుచు .
వరదమౌ నీతుల
స్థిరత జే కూర్చుమ .
3.చెలిమి బలము నందు
మలిన.రహిత మంది
బలమును మదగూర్చు. 
జిలుగు మెరుగు లొప్ప .
4చిందించు ప్రేమ
మందంబు వీడి.
బంధంబు పెంచి.
చెందించు ముక్తి .
5. చిన్నారి పొన్నారి చిరుత ప్రాయంబున
మన్నించి లాలించు మరిమరీ మెచ్చుచు. 
వన్నెల్ల.వెన్నెల్ల వరదమౌ నీతుల .
చెన్నొందు మార్గాన స్థిరత జేకూర్చుమ .
6.చిన్నారి పొన్నారి చిరుత ప్రాయంబున చెలిమిబలము నందు. 
మన్నించి లాలించు మరిమరీ మెచ్చుచు మలిన రహిత మంది .
వన్నెల్ల వెన్నెల్ల వరదమౌ నీతుల బలమును మదిగూర్చు .
చెన్నొందు మార్గాన స్థిరత జేకూర్చుమ జిలుగు మెరుగు లొప్ప. 
7.చిరుత ప్రాయంబున చెలిమి బలము నందు 
మరిమరీ మెచ్చుచు మలిన రహితమంది .
వరదమౌ నీతుల బలమును మది గూర్చు 
స్థిరత జే కూర్చుమ జిలుగుమెరుగు లొప్ప .
8.చిరుత ప్రాయంబున చెలిమిబలము నందు చిందించు ప్రేమ 
మరిమరీ మెచ్చుచు మలిన రహితమంది  మందంబు వీడి .
వరదమౌ నీతుల .బలమును మది గూర్చు బంధంబు పెంచి .
స్థిరత జేకూర్చుమజిలుగుమ మెరుగు లొప్ప చెందించు ముక్తి .
9.చిరుత           ప్రాయంబున చెలిమి బలమునందు చిందంచు ప్రేమ చినన్నారి పొన్నారి. 

మరమరీ మెచ్చుచు మలిన  రహిత మంది మందంబు వీడి మన్నించి లాలించు 
వరదమౌ నీతుల బలమును మదిగూర్చు బంధంబు పెంచి వన్నెల్ల వెన్నెల్ల 
స్థిరతజేకకూర్చుమ జిలుగు మెరుగు లొప్ప చెందించు ముక్తి చెన్నొందు మార్గాన. 
10.చెలిమి బలమునందు చిందించు ప్రేమ 
మలిన రహితమంది మందంబు వీడి 
బలమును మది గూర్చు బంధంబుపపెంచి 
జిలుగు మెరుగు లొప్ప చెందించుముక్తి. 
11. చెలిమి బలము నందు చిందించు ప్రేమ చిన్నారి పొన్నారి 
మలిన రహిత మంది మందంబువీడి మన్నించి లాలించు 
బలమునుమదదిగూర్చు బంధంబు పెంచి వన్నెల్ల వెన్నెల్ల .
జిలుగు మెరుగు లొప్ప చెందించు ముక్తి చెన్నొందు మార్గాన .
12.  
చెలిమి బలము నందు చిందించు ప్రేమచిన్నారరి పొన్నారి చిరుత ప్రాయంబున. 
మలిన రహిత మంది మందంబు వీడి మన్నించి లాలించు మరిమరీ మెచ్చుచు .
బలమునుమది గూర్చు బంధంబుపెంచి వన్నెల్ల వెన్నెల్ల వరదమౌ నీతుల . 
జిలుగు మెరుగు లొప్ప చెందించు ముక్తి చెన్నొంమార్గా న్న స్థిరతజేకకూర్చుమ .
13.చిందించై ప్రేమ చిన్నారి పొన్నారి 
మందంబు వీడి మన్నించి లాలించు 
బంధంబు పెంచి వన్నెల్ల వెన్నెల్ల 
చెందించు ముక్తి చెన్నొందు మార్గాన.
14చిందించు ప్రేమ చిన్నారి పొన్నారి చిరుత ప్రాయంబున
మందంబు వీడిమనన్నించి లాలించు మరిమరీమెచ్చుచు .
బంధంబు పెంచి వన్నెల్ల వెన్నెల్ల వరదమౌ నీతుల.
చెందంచు ముక్తి చెన్నొందు మార్గాన స్థిరత జేకూర్చుమ 
15.
 చిందించు ప్రేమ చిన్నారి పొన్నారి. చిరుత ప్రాయంబునచచెలిమి బలమునందు 
మందంబు వీడి మన్నించి లాలించు మరిమరీ మెచ్చుచు మలిన రహిత మంది .
బంధంబు పెంచి వన్నెల్ల వెన్నెల్ల వరదమౌ నీతుల బలమును మది గూర్చు 
చెందించు ముక్తి చెన్నొందు మార్గాన స్థిరత జేకూర్చుమ జిలుగు మెరుగు లొ ప్ప 



అవలోకనావృత్తము ఉత్కృతి త.త.న.త.న.న.జ.త.గల. యతులు 7.14.22.

గర్భగతవృత్తములు 
1.రక్షిత గాయిత్రి  త.త. వృసం.37.
2.దివసనాధ ఉష్ణిక్. న.త.ల.వృ.సం.104.
3.మృదుపద.అనుష్టుప్ న.న.గల. వృ.సం192.
4.తాపశమన .సుప్రతిష్ట .త.గల.వృ.సం.21.
5.చిన్నారి. జగతి .త.త.న.త.ల. యతి. 7.
6.నయకర .ప్రకృతి .త.త.న.త.న.న.జ.యతి14.
7పసిత .అతిశక్వరి. న.త.న.న జ. యతి 8.
8.బలిద. కృతి .న.త.న.న .జ.త.గల.యతి8.
9.ప్రేమక. ఉత్కృతి న.త.న.న.జ.త.ర.ర.గల.యతులు. 8.16.21.
10మావల్లభా .జగతి .న.న.ర.ల యతి 9.
11.నరోద్యత .అతిధృతి .న.న.ర.ర.త.త.ల.యతులు .9.14..
12.జివిక. ఉత్కృతి  న.న.ర.ర.త.త.న.య.లల. యతులు. 9.14.20.
13.త్వరగతి. త్రిష్టుప్ .త.త.ర.గల. యతి 6.
14.బసవరాజి ధృతి .త.ర.ర.భ.స.భ.యతి 12.
15.చిదానంద .ఉత్కృతి .త.ర.ర.భ.స.భ.న.న.గల.యతులు. 6.12.19. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మృదు మధురమైన " అవలోకనా వృత్తములు అలరించు చున్నవి శ్రీ వల్లభవఝులవారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.