గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జులై 2017, బుధవారం

నూతన ఛందములలో గర్భ కవిత 100. . . . రచన . . . శ్రీ వల్లభ

 జైశ్రీరామ్
దిద్దు .కందద్వయ గర్భ తెలుగు వెల్గు వృత్తము   రచన .వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తిజుత్తాడ.
తెలుగు వెల్గు వృత్తము
తెలుగింటి యాడ పడుచా తెలివే కొదువేమి నీకు తిలకము దిద్దన్ బుద్దిన్. 
వెలవోని కీర్తి వరదా విలువేగలదెంతొ తల్లి వెలుగవె ఖ్యాతిన్ భూమిన్. 
బలమంది బుద్ధి పెరుగన్ పలు భాషల పట్టు పెంచి వలనగురీతిన్ నీతిన్. 
కులగౌరవంపు సిరివై కులవిద్యలు వీడకమ్మ కొలువల మేటై నిల్వన్. 
1. తెలుగింటి యాడపడుచా 
వెలవోని కీర్తి వరదా 
బలమంది బుద్ధి పెరుగన్
కులగౌరవంపు సిరివై. 
2 తెలివే కొదువేమి నీకు 
విలువేగలదెంతొ తల్లి 
పలు భాషల పట్టు పెంచి 
కుల విద్యలు వీడకమ్మ.
3. తిలకము దిద్దన్ బుద్ధిన్ 
వెలుగవె ఖ్యాతిన్ భూమిన్. 
వలనగురీతన్ నీతిన్. 
కొలువల మేటై నిల్వన్
4. తెలుగింటి యాడపడుచా తెలివే కొదువేమి నీకు .
వెలవోని కీర్తి వరదా విలువే గలదెంతొ తల్లి .
బలమంది బుద్ధి పెరుగన్ పలు భాషల పట్టు పెంచి 
కుల గౌరవంపు సిరివై కుల విద్యలు వీడకమ్మ.
5.తెలివే కొదు వేమి నీకు తిలకము దిద్దన్ బుద్ధిన్. 
విలువే గలదెంతొ తల్లి వెలుగవె ఖ్యాతిన్ భూమిన్. 
పలుభాషల పట్టు పెంచి వలనగు రీతిన్ నీతిన్ 
కులవిద్యలు వీడ కమ్మ కొలువుల మేటై నిల్వన్
6.తెలివే కొదువేమి నీకు తిలకము దిద్దన్ బుద్ధిన్.తెలుగింటి యాడ పడుచా .
విలువే గలదెంతొ తల్లి వెలుగవె ఖ్యాతిన్ భూమిన్ వెలవోని కీర్తి వరదా 
పలుభాషల పట్టు పెంచి వలనగు రీతిన్ నీతిన్ బలమంది బుద్ధి పెరుగన్ .
కులవిద్యలు వీడ కమ్మ కొలువుల మేటై నిల్వన్ కులగౌరవంపు సిల్వన్
7.తిలకముదదిద్దన్ బుద్ధిన్ తెలుగింటి యాడపడుచా 
వెలుగవె ఖ్యాతిన్ భూమిన్ వెలవోని కీర్తి వరదా 
వలనగు రీతిన్ నీతిన్ బలమంది బుద్ధి పెరుగన్ 
కొలువుల మేటై నిల్వన్ కుల గౌరవంపు సిరి వై. 
8 తిలకము దిద్దన్ బుద్ధిన్ తెలుగింటి యాడపడుచా తెలివే కొదువేమి నీకు 
వెలుగవె ఖ్యాతిన్ భూమిన్ వెలవోని కీర్తి వరదా విలువే గలదెంతొ తల్లి .
వలనగు రీతిన్ నీతిన్ బలమంది బుద్ధి పెరుగన్ పలుభాషల పట్టు పెంచి 
కొలువల మేటై నిల్వన్ కులగౌరవంపు సిరివై కులవిద్యలు వీడ కమ్మ
9.  1.కం. తెలుగింటి యాడ పడుచా 
తెలివే కొదువేమి నీకు  తిలకము దిద్దన్ 
వెలవోని కీర్తి వరదా 
విలువే గలదెంతొ తల్లి వెలుగవె ఖ్యాతిన్.
    2 కం బలమంది బుద్ధి పెరుగన్.
పలు భాషల పట్టు పెంచి వలనగు రీతిన్.
కుల గౌరంపు సిరివై 
కుల విద్యలు వీడ కమ్మ కొలువుల మేటై. 
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.