జైశ్రీరామ్
కార్య సిద్ధి హనుమాన్ మంత్రమ్.
శ్లో. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్! యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరోభవ.(సుం.కాండ 39వ సర్గ)
క. ఈ పని నీకే సాధ్యము.
ఏ పనిచే నాదు దుఃఖ మిల క్షయమగునో
ఆపని చేయుము హనుమా!
ప్రాపగు శ్రీరామచంద్ర భక్తుఁడవు కదా!
భావము. ఓ హరిసత్తమా! ఈ కార్యమును నిర్వహించుటలో నీవే సమర్దుడవు. వానర శ్రేష్ఠుడగు ఓ హనుమంతుడా! ఏమి చేసిన ఈ దుఃఖము పోవునో నీవు అట్లే అలోచించి చేయవలెను. అని సీతాదేవి హనుమంతునితో చెప్పిన మాటలు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.