గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జులై 2017, మంగళవారం

నూతన ఛందములలో గర్భ కవిత 86. . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్.
రస ద్వయ. నవనీతసమ. .ధృతిరసయ. రసయా.సామ్యవాద. రసరాజి.మౌనగీతి. గర్భ.యశోరసయా వృత్తమ
                రచన. వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి . . . జుత్తాడ. 
యశోరసయా వృత్తము
మంచినెంచని సామ్య వాదం మబ్బు వీడిన యెండ తోయం మందు కందని రోగమే.
పొంచిదోషము మంచి నెంచం పుబ్బ రేగిన బూతు.సామ్యం పొందుకోరని రాగమే.
కంచి చేరునె పాపభూతం కబ్బమంటిన.దీన గీతం. కందునే భువి నెంచుమా.
సందు గొందుల.చిందులేయం జబ్బు లేకను నిబ్బరించెం సందరింపగ శఖ్యమా.
1. మంచి నెంచని సామ్య వాదం                    మబ్బు వీడని యెండ తోయం
పొంచిదోషషము మంచి  నెంచం                పుబ్బ రేగిన బూతు సామ్యం
కంచి చేరునె పాప భూతం                       కబ్బమంటిన దీన గీతం
సందు గొందుల చిందు లేయం               జబ్బు లేకను నిబ్బరించెం.
2. మందు కందని రోగమే
పొందు కోరని రాగమే
కందునే భువి నెంచుమా.
సందరించగ శక్యమా.
3మంచించని సామ్యవాదం మబ్బు వీడిన యెండ తోయం.
పొంచిదోషము మంచి నెంచం పుబ్బ రేగిన బూతు సామ్యం
కంచి చేరునె పాప భూతం కబ్బమంటిన.దీన గీతం.
సందు గొందుల చిందు లేయం జబ్బు లేకనునిబ్బరిఅంచెం.
4.మబ్బువీడిన యెండ తోయం మందు కందని రోగమే
పుబ్బరరేగిన బూతు సామ్యం పొందు కోరని రాగమే
కబ్బ మంటిన దీన గీతం కందునేభువవి నెంచుమా..
జబ్బు లేకను నిబ్బరించెం సందరించగ శక్యమా.
5.మబ్బు వీడిన యెండ తోయం మందుకందని రోగమే మంచి నెంచని సామ్యవాదం
పుబ్బ రేగిన బూతు సామ్యంపొందుకోరని రాగమేపొంచిదోషము మంచి నెంచం.
కబ్బమంటిన దీన గీతం కందునే భువి నెంచుమా కంచిచచేరునె పాప భూతం.
జబ్బు లేకను నిబ్బరించెం సందరించగ శక్యమా సందు గొందుల చిందులేయం.
6.మందు కందని రోగమేమంచి నెంచని సామ్య వాదం 
పొందు  కోరని రాగమే పొంచి దోషము మంచినెంచం
కందునే భువి నెంచుమా కంచి చేరునె పాప భూతం.
సందరించగ శక్యమా సందు గొందుల చిందు లేయం.
7.మందు కందని రోగమే మంచి నెంచని సామ్య వాదం మబ్బు వీడిన యెండ తోయం.
పొందు కోరని రాగమే పొంచి దోషము మంచినెంచం పుబ్బ రేగిన .బూతు సామ్యం
కందునే భువి నెంచుమా కంచి చేరునె పాప భూతం కబ్బ మంటిన దీన గీతం
సందరించగ శక్యమాసందు గొందుల చిందులేయం జబ్బు లేకను నిబ్బరరించెం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒక్క పద్యము నుండి ఇన్నిన్ని పద్యములను వ్రాయగల ప్రతిభ అనిర్వచ నీయం. చాలా బాగున్నాయి ఆవాగ్దేవి దయ . అద్రృష్ట వంతులు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.