గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జులై 2017, మంగళవారం

నూతన ఛందములలో గర్భ కవిత 99. . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్.
శ్రీవశీ. ముక్తిదా. సద్వర. దేవాశ్రి. సమజా. పరమగు కపిలా. ప్రమోదినీ. నేవనావరి. 
ముదల. తొలినుత. మతవర్తి .శుభంకరీ. శ్రీకర్తృ. సిరివరు. స్మరామి. క్షేమనా.
అగజానన. క్షేమజ. సేవిత. గర్భ నుతివల్లభ వృత్తము రచన వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
నుతివల్లభ వృత్తము. 
శ్రీమంతుండగజాసుతు క్షేమంబేర్పంగనెంచి శివసూనునిలం సేవింతుందొలిన్ 
నీమంబారగబుద్ధిని నేవంబుంగూర్చు కావ్యనివహంబుధరనం కావింతుం శివా. 
రామంబేర్పడజేయగ రామా శ్రీరామ నీమ రవళింపసిరుల్ రావింతుంబుధా. 
క్షేమంబౌకృతి క్ష్మాతలికామారరింకీర్తిసేతు శివమేర్చవలెం జీవంబౌ కతన్. 
1.శ్రీమంతుండగజా సుతు
నీమంబారగ బుద్ధిని.
రామంబేర్పడ జేయగ 
క్షేమంబౌ కృతి క్ష్మాతలి. 
2.క్షేమంబేర్పంగ నెంచి 
నేవంబుంగూర్చు కావ్య.
రామా శ్రీరామ నీమ. 
కామారిం కీర్తి సేతు .
3.శివసూను నిలం
నివహంబు ధరన్.
రవళింప సిరుల్ 
శివమేర్చ వలెన్ .
4.సేవింతుందొలిన్
కావింతుం శివా .
రావింతుం బుధా. 
జీవంబౌకతన్. 
5. శ్రీమంతుండగజాసుతు క్షేమంబేర్పంగ నెంచి .
నీమంబారగ బుద్ధిని నేవంబుంగూర్చు కావ్య. 
రామంబేర్పడ జేయగ రామా శ్రీరామ నీమ .
క్షేమంబౌకృతిక్ష్మాతలి కామారింకీర్తి సేతు. 
6.శ్రీమంతుండగజాసుతు క్షేమంబేర్పంగనెంచి శివ సూనునిలన్.
నీమంబారగ బుద్ధినినేమంబుం గూర్చు కావ్య నివహంబుధరన్ .
రామంబేర్పడజేయగరామాశ్రీరామ నీమ రవళింప సిరుల్. 
క్షేమంబౌకృతి క్ష్మాతలి కామారిం కీర్తి సేతు శివమేర్చ వలెన్ .
7.క్షేమంబేర్పంగ నెంచి శివ సూను నిలం 
నేవంబుం గూర్చు కావ్య నివహంబు ధరన్.
రామా శ్రీరామనీమ రవళింప సిరుల్ .
కామారిం కీర్తి సేతు శివ మేర్చవలెన్. 
8. క్షేమంబేర్పంగ నెంచి శివససూను నిలన్ సేవింతు దొలిన్ 
నేవంబుంగూర్చు కావ్య నివహంబు ధరన్ కావింతుం శివా
రామాశ్రీరామ నీమ రవళింప సిరుల్ రావింతున్ బుధా 
కామారిం కీర్తి సేతు శివమేర్చ వలెన్ జీవంబౌ కతన్ .
9.క్షేమంబేర్పంగనెంచిశివసూనునిలన్ సేవింతున్ దొలిన్  శ్రీమంతుండగజాసుతు 
నేవంబుం గూర్చు కావ్య నివహంబు ధరన్ కావింతుం శివానీమంబారగ బుద్ధిని.
రామా శ్రీరామ నీమ రవళింప సిరుల్ రావింతున్ బుధా రామం బేర్పడ జేయగ. 
కామారింకీర్తిసేతు శివమేర్చవలెన్ జీవంబౌ కతన్ క్షేమంబౌ కృతి క్ష్మాతలి.
10.శివ సూను నిలం సేవింతుం దొలిన్ శ్రీమంతుండగజాసుతు 
నివంబుం ధరన్ కా వింతుం శివా నీమంబారగ బుద్ధిని 
రవళింపం సిరుల్ రావింతున్ బుధా రామంబేర్పడ జేయగ.
శివమేర్చ వలెన్ జీవంబౌకతన్ క్షేమంబౌ కృతిక్ష్మాతలి .
11. శివసూనునిలం సేవింతుం దొలిన్ శ్రీమంతుండగజాసుతు క్షేమంబేర్పంగ నెంచి
నివహంబుధరం కావింతుం శివా నీమంబారగ బుద్ధిని నేమంబుంగూర్చుకావ్య 
రవళింపం సిరుల్ రావింతుం బుధా రామంబేర్పడ జేయగ రామాశ్రీరామ నీమ 
శివమేర్చ వలెన్ జీవంబౌకతం క్షేమంబౌ కృతి క్ష్మాతలి కామారిం కీర్తి సేతు. 
12.సేవింతుం దొలిం శ్రీమంతుండగజా సుతు. 
కావింతుం శివా నీమంబారగ బుద్ధిని 
రావింతుం బుధా రామంబేర్పడ జేయగ
జీవంబౌ కతం క్షేమంబౌ కృతి క్ష్మాతలి. 

13.
సేవింతుం దొలిం శ్రీమంతం డగజాసుతు క్షేమంబేర్పంగ నెంచి
కావింతుం శివా నీమంబారగ బుద్ధిని నేమంబుం గూర్చు కావ్య 
రావింతుం బుధా రామమంబేర్పడ జేయగ రామా శ్రీరామ నీమ 
జీవంబౌ కతం క్షేమంబౌ కృతి క్ష్మాతలి కామారింకకీర్తి సేతు. 
14.
సేవింతుందొలిం శ్రీమంతుండగజాసుతు క్షేమంబేర్పంగ నెంచి శివసూను నిలన్. 
కావింతుం శివా నీమంబారగ బుద్ధిని నేమంబుం గూర్చు కావ్య నివహంబుధరన్ .
రావింతుం బుధా రామం బేర్పడ జేయగ రామా శ్రీరామనీమ రవళింప సిరుల్. 
జీవంబౌ కతం క్షేమంబౌ కృతి క్ష్మాతలి కామారిం కీర్తి సేతు శివమేర్చ వలెన్.
15. క్షేమం బేర్పంగనెంచి శ్రీమంతుం డగజాసుతు. 
నేమంబుం గూర్చు కావ్య నీమంబారంగ బుద్ధిని.
రామాశ్రీరామ నీమ రామంబేర్పడ జేయగ. 
కామారిం కీర్తి సేతు క్షేమంబౌ కృతి క్ష్మాతలిగ 
16 క్షేమం బేర్పంగ నెంచి శ్రీమంతుండగజాసుతు శివసూను నిలన్
నేమంబుంగూర్చు కావ్య నీమంబారంగ బుద్ధిని నివహంబు ధరన్ .
రామాశ్రీరామ నీమ రామంబేర్పడ జేయగ రవళింప సిరుల్ 
కామారం కీర్తి సేతు క్షేమంబౌ కృతి క్ష్మాతలి శివ మేర్చ వలెన్.
17. 
క్షేమంబేర్పంగ నెంచి శ్రీమంతు డగజాసుతు శివ సూను నిలం సేవింతుందొలిన్ .
నేమంబుంగూర్చు కావ్య నీమంబారంగ బుద్ధి నివహంబు ధరం కావింతుంశివా 
రామా శ్రీరామా నీమ రామంబేర్పడ జేయగరవళళింప సిరుల్ రావింతుం బుధా.
కామారిం కీర్తి సేతు క్షేమంబౌ కృతి క్ష్మాతలి శివమేర్చవలెం జీవంబౌ కతన్. 
18. శివ సూను నిలం శ్రీమంతుండగజా సుతు  
నివహంబు ధరం  నీమంబారగ బుద్ధిని 
రవళింపం సిరుల్ రామంబేర్పడ జేయగ 
శివమేర్చ వలెం క్షేమంబౌ కృతి క్ష్మాతలి.
19.శివసూనునిలం శ్రీమంతుండగజా సుతు క్షేమంబేర్పంగ నెంచి 
నివహంబు ధరం నీమంబారగ బుద్ధిని నేమంబుంగూర్చు కావ్య. 
రవళింపం సిరుల్ రామంబేర్పడ జేయగ  రామా శ్రీరామ నీమ 
శివమేర్చ వలెం క్షేమంబౌ కృతి క్ష్మాతలి కామారిం కీర్తి సేతు. 
20.
శివసూను నిలం శ్రీమంతుండగజా సుతు క్షేమంబేర్పంగ నెంచి సేవింతుం దొలిన్. 
నివహంబు ధరం నీమంబారగ బుద్ధిని నేమంబుం గూర్చు కావ్య కావింతుం శివా. 
రవళింపం సిరుల్ రామంబేర్పడ జేయగ రామా శ్రీరామ నీమ రావింతుంబుధా. 
శివమేర్చవలెం క్షేమంబౌ  కృతి క్ష్మా తలికామారరిం కీర్తి సేతు శివమేర్చవలెన్. 
నుతివల్లభ .ఉత్కృతి మ.స.స.మ.జ.స.స.మ.లగ.యతులు 9.16.22.

1. శ్రీవశీ  అనుష్టుప్ మ.స.లల.వృ.సం. 217.
2. ముక్తిదా ఉష్ణిక్ మ.ర.ల. వృ సం. 81.
3.సద్వర. గాయిత్రి .స.స. వృసం. 28.
4. దేవాశ్రి .సుప్రతిష్ట .మ.లగ.వృ.సం. 9.
5.సమజా అతిశక్వరి మ.స.స.మ.జ.యతి 9.
6.పరమగు ప్రకృతి మ.స.స.మ.జ.యతి 9.
7.కపిలా అతిజగతి మ.ర.న.భ.గ యతి 8.
8.ప్రమోదినీ ధృతి  మ.ర.న.భ.మ.ర.యతి 8.
9.సేవనావరి ఉత్కృతి మ.ర.న.భ.మ.ర.మ.స.లల.యతులు8.14.19.
10.ముదల అతిధృతి స.స.మ.యత.జ ల. యతులు 7.12.
11.తొలినుత .ఉత్కృతి స.స.మ.య.త.జ.య .త.గల.యతులు 7.12.20.
12.మతవర్తి అతి జగతీ మ.య.త.జ.ల.యతి 6.
13. శుభంకరీ కృతి మ.య.త.జ.య.త.గల.యతి 14.
14 . శ్రీకర్త ఉత్కృతి మ.య.త.జ.య.త.భ.జ.లగ.యతులు 6.14.20.
15.సిరివరు అతిశక్వరి మ.ర.య.భ.భ. యతి 8.
16. స్మరామి ప్రకృతి .మ.ర.య.భ.భ.స.స. యతి8.
17.క్షేమనీ ఉత్కృతి మ.ర.య.భ.భ.స.స.మ.లగ. యతులు 8.16.22.
18.అగజానన. శక్వరీ .స.స.మ.స.లల.యతి14
19.క్షేమజ  ప్రకృతి స.స.మ.స.స.మ.జ.యతి7.
20.సేవిత .ఉత్కృతి స.స.మ.స.స.మ.జ.మ.లగ.యతులు 7.15.22.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.