గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2017, శనివారం

నూతన ఛందములలో గర్భ కవిత 97. . . . రచన . . . శ్రీ వల్లభ

  జైశ్రీరామ్
నీతివిదూర. నిందిలు గర్భ నిజనిష్టురవృత్తము..రచన. వల్లభవఝల అప్పల నరసింహమూర్తి . జుత్తాడ
నిజనిష్టుర వృత్తము .
నిజము నిష్టుర మొప్పు నిందల పాల్జేయు నీతిహీనుల చేతుల నీచమందు. 
సృజనతే కొదువౌను చిందిలు కష్టాలు చేతగానటు గన్పడు జీవితాన. 
భజనకీర్తిదమౌను. బంధిగ నిల్బెట్టు పాతమేర్చును ఖ్యాతిని భగ్న మేర్చు .
తేజము గీడ్పడు ధాత్రి  తిందువు చీవాట్లు తీతురే యపవాదుల తెల్సికొమ్మ. 
1.నిజమునిష్టుర మొప్పు 
సృజనతే కొదువౌను .
భజన కీర్తిదమౌను .
తేజము గీడ్పడుధాత్రి. 
2.నిందలపాల్జేయు .
చిందిలుకష్టాలు .
బంధిగ నిల్బెట్టు
తిందువు చీవాట్లు .
3. నీతి హీనుల చేతుల 
చేత గానటు గన్పడు .
పాతమేర్చును ఖ్యాతిని .
తీతురే యపవాదుల 
4. నీతిహీనుల చేతుల నీచమందు .
చేతగానటు గన్పడు జీవితాన. 
పాతమేర్చును ఖ్యాతిని భగ్న మేర్చు .
తీతురేయపవాదుల తెల్సి కొమ్మ. 
5. నీతి హీనులచేతుల నీచమందు నిజము నిష్టుర మొప్పు .
చేత గానటు గన్పడు జీవితాన సృజనతే కొదువౌను 
పాతమేర్చును ఖ్యాతిని భగ్న మేర్చు భజన కీర్తిదమౌను .
తీతురే యపవాదుల తెల్సి కొమ్మ .తేజముగీడ్పడు ధాత్రి .
6.నిజము నిష్టురమొప్పు నిందల పాల్జేయు. 
సృజనతే కొదువౌను చిందిలు కష్టాలు  .
భజన కీర్తిదమౌను బంధిగ నిల్బెట్టు .
తేజము గీడ్పడు ధాత్రి తిందువు చీవాట్లు .
7. నిజము నిష్టురమొప్పు నిందల పాల్జేయు నీతిహీనుల చేతుల .
సృజనతే కొదువౌను చిందిలు కష్టాలు చేతగానటు గన్పడు 
భజన కీర్తిదమౌను బంధిగ నిల్బెట్టు పాత మేర్చును ఖ్యాతిని .
తేజము గీడ్పడుధాత్రి తిందువు చీవాట్లు తీతురే యపవాదుల .
8.నిందల పాల్జేయు నీతి హీనుల చేతుల
చిందిలు కష్టాలు చేత గానటు గన్పడు
బంధిగ నిల్బెట్టు పాత మేర్చును ఖ్యాతిని
తిందువు చీవాట్లు తీతురే యపవాదుల .
9.నిందల పాల్జేయు నీతిహీనుల చేతుల నీచ మందు .
చిందిలు కష్టాలు చేతగానటు గన్పడు జీవితాన .
బంధిగ నిల్బెట్టు పాత మేర్చును ఖ్యయాతిని భగ్నమేర్చు
తిందువు చీవాట్లు తీతురే యపవాదుల తెల్సి కొమ్మ .
10.
నిందల పాల్జేయు నీతి హీనుల చేతుల నీచమందు నిజము నిష్టుర మొప్పు .
చిందిలు కష్టాలు చేత గానటు గన్పడు జీవితాన సృజనతే కొదువౌను 
బంధిగ నిల్బెట్టు పాత మేర్చును ఖ్యాతిని భగ్న మేర్చు భజన కీర్తిదమౌను .
తిందువు చీవాట్లు తీతురే యపవాదు ల తెల్సి కొమ్మ తేజముగీడ్పడు ధాత్రి .
11. 
నీతిహీనుల చేతుల నీచమందు నిజమునిష్టురమొప్ప నిందల పాల్జేయు .
చేత గానటు గన్పడు జీవితాన సృజనతే కొదువౌను చిందిలు కష్టాలు 
పాతమేర్చును ఖ్యాతిని భగ్నమేర్చు భకీర్తర్తిదమౌను బంధిగ నిల్బెట్టు 
తీతురే యపవాదుల తెల్సికొమ్మ తేజము గీడ్పడు ధాత్రి తందువు చీవాట్లు. 
నిజనిష్టుర ఉత్కృతి .న.భ.ర.స.ర.జ.జ.జ.గల. యతులు .9.15.23. 
1.దశాశ్రి .అనుష్టుప్ .న.భ.గల.వృ.సం.184. 
2.భావగాయిత్రి. భ.త .వృ.సం.39. 
3.నిందా .అనుష్టుప్. ర.స.లల. వృ.సం. 219.
4.సంతస. జగతి .ర.స.స.జ. యతి9.
5.నిమ్నతా కృతి ర.స.స.జ.న.భ.గల.యతి 13
6.రసగుణి .శక్వరీ .న.భ.ర.స.గల. యతి 9.
7.ప్రభాకలి ఆకృతి న.భ.ర.స.ర.జ.జ.ల.యతులు 9.15.
8.హీనచేతన .శక్వరీ భ.త.ర.స.లల. యతి  7. 
9.చేతనా ధృతి భ.త.ర.స.స.జ.యతి 14. 
10 .నీతివిదూర .ఉత్కృతి భ.త.ర.స.స.జ.న.భ.గల. యతులు 7.15.19.
11. పాల్జేయు  ఉత్కృతి ర.స.స.జ.న.భ.ర.స.గల. యతులు 9.17.21. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.