గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2017, సోమవారం

నూతన ఛందములలో గర్భ కవిత 105. . . . రచన . . . శ్రీ వల్లభ

  జైశ్రీరామ్.
 పురమోహినీ. గర్భవివక్షక (ధృగ్గోచర) వృత్తము.
రచన .వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి . జుత్తాడ.
 వివక్షకవృత్తము.
విలువేది విప్రజాతికి వెలమాపె స్వేచ్ఛ భారతి పెర పాలనంబు కోరన్.
వెలమాసె వేద సంస్కృతి విలువోప బ్రహ్మ శక్యమె వెరగేమి లేని దాయెన్. 
తిలకింపరైరి తేజము తెలిఛాయ శంకరయ్యరొ తెరదీయు నీతి స్వేచ్ఛన్. 
పలికించు మంచి మాటలు బలమేర్చు సర్వ సామ్యత పరమంబుగూర్చరమ్మా
 1---(1).విలువేది విప్ర జాతికి 
              వెలమాసె వేద సంస్కృతి.
              తిలకింపరైరి తేజము . 
            పలికించు మంచిమాటలు.
      (2)వెలమాపె స్వేచ్ఛ భారతి.
            విలువోప  బ్రహ్మ శక్యమె
            తెలి ఛాయ శంకరయ్యరొ
             బలమేర్చు సర్వ సామ్యత.
2.పెర పాలనంబు కోరన్
వెరగేమి లేనిదాయెన్
తెరదీయు నీతి స్వేచ్ఛన్
పరమంబుగూర్చ రమ్మా.
3.విలువేది విప్రజాతికి  వెలమాపె స్వేచ్ఛ భారతి 
వెలమాసె వేద సంస్కృతి విలువోప బ్ర హ్మ శక్యమె
తిలకింపరైరి తేజము తెలి ఛాయ శంకరయ్యరొ. 
పలికించు మంచి మాటలు బలమేర్చు సర్వ సామ్యత. 
4.వెలమాపె వేద సంస్కృతి పెరపాలనంబుకోరన్
విలువోప బ్రహ్మ శక్యమె వెరగేమి లేనిదాయెన్
తెలి ఛాయశంకరయ్యరొ తెరదీయు నీతి స్వేచ్ఛన్
బలమేర్చు సర్వ సామ్యత పరమంబు గూర్చ రమ్మా. 
5.వెలమాపె వేద సంస్కృతి పెరపాలనంబు కోరన్ విలువేదివిప్రజాతికి.
విలువోప బ్రహ్మ శక్యమె వెరగేమి లేనిదాయెయెన్  వెలమాసె వేదసంస్కృతి.
తెలిఛాయ శంకరయ్యరొ తెరదీయు నీతి స్వేచ్ఛన్ తిలకింపరైరి తేజము
బలమేర్చు సర్వ సామ్యత పరమంబు గూర్చ రమ్మా పలికించుమంచిమాటలు
6.పెరపాలనంబు కోరన్ విలువేది విప్రజాతికి
వెరగేమిలేనిదాయం వెలమాసె వేద సంస్కృతి 
తెరదీయు నీతి స్వేచ్ఛన్ తిలకింపరైరి తేజము. 
పరమంబు గూర్చ రమ్మా పలికించు మంచిమాటలు.

7.తిలకించు నీతిమార్గం తెలివైన జన్మ నెత్తియు
విలువొంది నిల్చు భూమిన్ వెలవోని సత్యవాక్కులు.
తులువౌట హీనమోపున్ తులలేని కీర్తి నందుము 
పలుమాటలాడ పాపం పలికించు మంచి నెన్నడు. 

8. తిలకించు నీతిమార్గంతతెలివైన జన్మనెత్తియు తిమిరంబు నందెదేలను.
విలువొంది నిల్చుభూమిన్ వెలవోని సత్యవాక్కుల విమలంపు ప్రజ్ఞనందుమ
తులువౌట హీనమోపున్ తులలేని కీర్తినందుము దుముకాడు సర్వరక్షణ.
పలుమాటలాడ పాపం పలికించుమంచినెన్నడు భములందవెన్నడీవయ
9.తిమిరంబునందె దేలను తెలివైన జన్మనెత్తియు 
విమలంపుప్రజ్ఞ నందుమ వెలవోసత్యవాక్క్కుల 
దుముకాడు సర్వరక్షణతులలేనని కీర్తి నందుము
భములంద వెన్నడీవయ పలికించు మంచినెన్నడు. 
10.తిమిరరంబు నందెదేలను తెలివైన జన్మనెత్తియు తిలకించు 
నీతిమార్గమవిమలంపు ప్రజ్ఞనందుమ వెలవోని సత్యవాక్కుల
దుముకాడు సర్వరక్షణ తులలేనికీర్తి నందుమతులువౌటహీనోపున్
భములందవెన్నడీవయ పలికించుమంచి నెన్నడు పలుమాటలాడ పాపం.
1 .1.2 కందళి బృహతీ స.జ.భ. వృ.సం.428.
2.జడిపిలు . అనుష్టుప్ స.జ.గగ.వృ.సం.44.
3. 1.8.వివక్ష. ధృతి .స.జ.భ.స.జ.భ.యతి .10.
4.చెలాకి.అత్యష్టీ స.జ.భ.స.జ.గగ.యతి .10.
5. వెలగాని ఉత్కృతి .స.జ.భ.స.జ.త.జ.ర.లల.యతులు .10.18.
6.యుతిలేని .అత్యష్టీ .స.జ.త.జ.ర.లల.యతి 9.
7.విరోధిని  .ఉత్కృతి స.జ.త.జ.ర.లల. యతులు.9.18.
8 .పెరమోహిని .ఉత్కృతి .స.జ.భ.స.జ.భ.స.జ.గగ.యతులు.10.19.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
విలువేది విప్రజాతికి ....
వెలమాసె స్వేచ్చ భారతి "
శ్రీ వల్లభవఝుల వారి వివక్షక వృత్తము అద్భుతముగా నున్నది . ధన్య వాదములు
మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.