జైశ్రీరామ్.
వీడనినీడ.చాతురిభా. ఛాయాగ్రాహి.గర్భ కర్మ చేతనా వృత్తము.
రచన .వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి జుత్తాడ.
కర్మ చేతనా వృత్తము.
వీడని నీడవోలె నిను వీడదు కర్మపు చేతన బేలతనంబదేలనో
పీడిలజేయు కర్మమది పీడకు లోనగు నెంచుమ పేలవబుద్ధి కీడగున్.
పాడిగ నెంచి మన్నుమయ పాడియె నీతికి మూలము పాలనమెంచు కీర్తినిన్.
దాడిని కోరకెన్నడును తాడనమెంచకుమానవ తాలిమి పొందు శాంతిలున్ .
1. వీడని నీడవోలెనిను
పీడిల జేయు కర్మమది
పాడిగ నెంచి మన్నుమయ
దాడిని కోరకెన్నడును.
2 .వీడదు కర్మపు చేతన
పీడకు లోనగు నెంచుమ
పాడియె నీతికి మూలము
తాడనమెంచకు మానవ.
3.బేలతనంబదేలనో
పేలవ బుద్ధి కీడగున్
పాలనమెంచు కీర్తినిన్
తాలిమి పొందు శాంతిలున్.
4.వీడని నీడ వోలె నిను వీడదు కర్మపు చేతన
పీడిల జేయు కర్మమది పీడకులోనగు నెంచుమ
పాడిగ నెంచి మన్నుమయ పాడియె నీతికి మూలము
దాడిని కోరకెన్నడును తాడిమి నెంచకు మానవ
5.వీడదు కర్మపుచేతన బేలతనంబదేలనో
పీడకులోనగునెంచుమ పేలవ బుద్ధి కీడగున్
పాడియె నీతికి మూలము పాలనమెంచు కీర్తినిన్.
తాడన మెంచకు మానవ తాలిమి పొందు శాంతిలున్.
6. వీడదు కర్మపుచేతన బేలతనంబదేలనో వీడని నీడవోలెనిను
పీడకులోనగు నెంచుమ పేలవబుద్ధి కీడగున్ పీడిల జేయు కర్మమది
పాడియె నీతికిమూలము పాలనమెంచు కీర్తినిన్ పాడిగ నెంచిమన్నుమయ.
తాడనమెంచకు మానవ తాలిమి పొందు శాంతిలున్దాడినికోరకెన్నడును.
7.బేలతనంబదేలనో వీడని నీడవోలెనిను
పేలవ బుద్ధి కీడగున్ పీడిలజేయు కర్మమది
పాలనమెంచు కీర్తినిన్ పాడిగ నెంచి మన్నుమయ
తాలిమి పొందు శాంతిలున్ దాడిని కోరకెన్నడును.
8.బేలతనంబదేలనో వీడని నీడవోలెనిను వీడదు కర్మపుచేతన.
పేలవ బుద్ధి కీడగున్ పీడిలజేయు కర్మమది పీడకు లోనగు నెంచుమ.
పాలనమెంచుకీర్తిననిన్ పాడిగనెంచిమన్నుమయ పాడియెనీతికిమూలము.
తాలిమిపొందు శాంతిలున్ దాడిని కోరకెన్నడును తాడనమెంచకుమానవ.
9.వీడదు కర్మపు చేతన వీడనినీడ వోలెనిను
పీడకు లోనగు నెంచుమ పీడిలజేయు కర్మమది
పాడియె నీతికి మూలము పాడిగ నెంచి మన్నుమయ
తాడనమెంచకు మానవ దాడిని కోరకెన్నడును.
10.
వీడదు కర్మపుచేతన వీడని నీడవోలెనిను బేలతనంబదేలనో
పీడకు లోనగునెంచుమ పీడిలజేయు కర్మమది పేలవబుద్ధికీడగున్.
పాడియె నీతికిమూలము పాడిగనెంచిమన్నుమయపాలనమెంచుకీర్ తినిన్.
తాడనమెంచకుమానవ దాడిని కోరకెన్నడును తాలిమిపొందు శాంతిలున్.
కర్మచేతనావృత్తము ఉత్కృతి భ.ర.న.భ.భ.భ.భ.ర.లగ.యతులు10.19.
1విభూతినీ బృహతీ భ.ర.న.వృ.సం.471.
2.ఆదర్శ .బృహతీ భ.త.భ.వృ.సం. 423.
3.పరిహరణా అనుష్టుప్ .వృ.సం.87.
4.కోటిప్రభాసి .ధృతి .భ.ర.న.భ.భ.భ. యతి10.
5.మనోవికార .అత్యష్టీ భ.త.భ.భ.ర.లగ.యతి10.
6..బేలతా. ఉత్కృతి భ.త.భ.భ.ర.త.స.జ.లల. యతులు 10.18.
7.వెన్నాడు అత్యష్టీ భ.ర.య.స.జ.లల.యతి9.
8.వీడనినీడ .ఉత్కృతి భ.ర.య.స.జ.స.స.స.లల.యతులు .9.18.
9. చాతురిభా. ధృతి. భ.భ.భ.భ.ర.న.యతి .10.
10.ఛాయాగ్రాహి .ఉత్కృతి .భ.భ.భ.భ.ర.న.న.ర.లగ.యతులు 10.19.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.