గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2017, మంగళవారం

నూతన ఛందములలో గర్భ కవిత 93. . . . రచన . . . శ్రీ వల్లభ

 జైశ్రీరామ్.
జీవప్రేమ.ధనామోహ.నిగ్రహ మృగీ.గుణభాసి.పాంచజన్య.ఊహక.వారినిభ.భాస్వానన.సురపూజిత.జలంధర. విద్వత్కరి.వరదమ.తామరస. ఉత్పలాశ్రయా గర్భ వరగుణవృత్తము.
రచన. వల్లభవఝల అప్పలనరమూర్తి    జుత్తాడ. 
వరగుణవృత్తము
వరగుణ భాసితుండు వరదామర పూజ్యుడు వారి శిరోరుధారి వరదున్. 
నిరతము గొల్చువాని నిరుపంబగు వాగ్ఝరి నేరిపి చిత్ర గర్భ నిరతున్.
సరి గురుతేర్చి రామచరితాలర్ధుడు కృష్ణుడు సా. రసమౌ తెరంగు చరితన్ .
వరగ గురు పూర్ణిమాన వరదుండిల బ్రోవుత పారగు సత్కరాన వరత న్. 

గర్భగతవృత్తములు. 
1. వరగుణ భాసితుండు
నిరతము గొల్చు వాని
సరిగురు తేర్చె రామ
వరగురు పూర్ణిమాన. 
2.వరదామర పూజ్యుడు. 
నిరుపంబగు వాగ్ఝరి
చరితార్ధుడు కృష్ణుడు
వరదుండిల బ్రోవుత. 
3.వారి శిరోరు ధారి. 
నేరిపె చిత్ర గర్భ 
సా రసమౌ తెరంగు
పారగు సత్కరాన. 
4 వరదున్
నిరతున్ 
చరితన్ 
వరతన్. 
5.వరగుణ భాసితుండు వరదామర పూజ్యుడు .
నిరతము గొల్చువాని    నిరుపంబగు వాగ్ఝరి 
సరి గురుతేర్చె రామ చరితార్ధుడు కృష్ణుడు .
వర గురుపూర్ణిమాన వరదుండిల బ్రోవుత 
6. వరగుణభాసితతుండు వరదామర పూజ్యుడు వారిశిరోరుధారి. 
నిరతము గొల్చు వాని నిరుపంబగు వాగ్ఝరి నేరిపిచితత్ర గర్భ
సరిగురుతేర్చె  రామ చరితార్ధుడు కృష్ణుడుసా రసమౌ తెరంగు.
వర గురుపూర్ణిమాన వరదుండిల బ్రోవుత పారగు సత్క రాన. 
7.వారిశిరోరు ధారి.వరదున్.
నేరిపె చిత్రగగర్భ నిరతుల్
 సా రసమౌ తెరంగు చరితన్.
పారగు సత్కరాన వరతన్. 
8.వారిశిరోరు ధారి వరదున్ వరగుణభాసితుండు.
నేరిపె చిత్ర గర్భ నిరతున్ నిరతముగొల్చు వాని 
సారసమౌ తెరంగు చరితన్ సరి గురుతేర్చె రామ
పారగు సత్కరాన వరతన్ వరగురు పూర్ణిమాన
 9.వారిశిరోరుధారి వరదామర పూజ్యుడువరగుణభాసి తుండు 
నేరిపె చిత్ర గర్భ  నిరుపంబగు వాగ్ఝరి నిరతము గొల్చువాని
సారసమౌ తెరంగు చరితార్ధుడు కృష్ణుడు సరిగురుతేర్చె రామ 
పారగు సత్కరాన వరదుండిల బ్రోవుత వర గురుపూర్ణిమాన. 
10. 
వారిశిరోరుధారి వరదామర పూజ్యుడు వరగుణభాసితుండు వరదున్. 
నేరిపె చిత్ర గర్భ నిరుపంబగు వాగ్ఝరినిరతము గొల్చువాని నిరతున్ .
సా రసమౌ  తెరంగు చరితార్ధుడు కృష్ణుడు సరిగురుతేర్చె రామ చరితన్. 
పారగు సత్కరాన వరదుండిల బ్రోవుత వరగురుపూర్ణిమాన వరతన్
 11.
వారిశిరోరు ధారి వరదున్ వరగుణభాసి తుండు వరదామరపూజ్యుడు. 
నేరిపె చిత్ర గర్భ నిరతున్ననిరతముగొల్చువాని నిరుపంబగువాగ్ఝరి
సా రసమౌ తెరంగు చరితసరిగురుతేర్చర్చె రామ చరితార్ధుడు కృష్ణుడు 
పారగు సత్కరాన వరతన్ వరగురు పూర్ణిమాన వరదుండిల బ్రోవుత 
12.
వరదామర పూజ్యుడు వారిశిరోరు ధారి వరగుణ భాసితుండు వరదున్.
నిరుపంబగు వాగ్ఝరి నేరిపె చిత్ర గర్భ  నిరతము గొల్చువాని నిరతున్
 చరితార్ధుడు కృష్ణుడు సా రసమౌతెరంగుసరిగురుతేర్చె రామ చరితన్
వరదుండిల బ్రోవుత పారగుసత్కరాన వర గురుపూర్ణిమాన వరతన్. 
13.
వరదామర పూజ్యుడు వారిశిరోరు ధారి
నిరుపంబగు వాగ్ఝరి నేరిపె చిత్ర గర్భ
చరితార్ధుడు కృష్ణుడు సారసమౌతెరంగు
వరదుండిల బ్రోవుత పారగు సత్కరాన. 
14.
వరదామర పూజ్యుడువారిశిరోరుధారి వరదున్ వరగుణభాసితుండు. 
నిరుపంబగువాగ్ఝరి నేరిచిత్రగర్భనిరతున్న్ నిరతము గొల్చువాని 
చరితార్ధుడు కృష్ణుడు  సా రసమౌతెరంగు చరితన్ సరిగురుతేర్చె రామ 
వరదుండిలబ్రోవుత పారగు సత్కరాన వరతన్ వర గురు పూర్ణిమాన.
15.
వారిశిరోరుధారి వరదామర పూజ్యుడు 
నేరిపె చిత్ర గర్భననిరపంబగు వాగ్ఝరి 
సా రసమౌ తెరంగు చరతార్ధుడు కృష్ణుడు
పారగుసత్కరాన వరదండిలబ్రోవుత. 


వరగుణ వృత్తము .ఉత్కృతి న.జ.భ.జ.జ.జ.జ.భ.లగ.యతులు .9.17.23.
గర్భగతవృత్తములు
జీవప్ప్రేమ అనుష్టుప్న.జ.గల.వృసం.176.
2. ధనామోహ అను ష్టుప్.స.స.లల.వృ.సం.220.
3.నిగ్రహ ఉష్ణిక్ భ.ర.ల. వృ.సం.87.
4. మృగీ.మధ్య వృ.సం.3.
5.గుణభాసి అష్టీ .న.జ.భ.జ.జ.ల.యతి 9 
6. పాంచజన్య. వికృతి న.జ.భ.జ.జ.జ..జ.గల.యతులు.9.17.
7.ఊహక. పంక్తి. భ.ర.స.గ. యతి.8.
8. వారినిభా .ధృతి .యతి 11.
9. భాస్వానక.వికృతి. భ.ర.న.భ.భ.న.జ.గల. యతులు. 8.16.
10.సుర పూజిత. ఉత్కృతి .భ.ర.న.భ.భ.న.జ.భ.లగ.యతులు 8.16.24.
11.జలంధర. ఉత్కృతి భ.ర.న.భ.ర.జ.న.స.లల.యతులు .8.11.19.
12.విద్వత్కరి ఉత్కృతి .స.స.స.స.జ.న.జ.గల.యతులు 8.16.24.
13.వరదమ ఉత్కృతి. స.స.స.స.జ.స.న.జ.గల. యతులు 9.16.19.
14. తామఅతిశక్వరీ.స.స.స.స.జ.యతి 9.
15.ఉత్పలాశ్రయ. అతిశక్వరీ. భ.ర.న.భ.భ.యతి 8.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.