గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జులై 2017, ఆదివారం

నూతన ఛందములలో గర్భ కవిత 84. . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్.
శ్రీవాణీ ద్వయ ,స్తితి, శమనామన, ఉత్తుంగ ద్వయ, స్వర్లింగ, నేవనా, అర్చనా, వొనరు, దనరారు, శయ్యాట, డోలికా, లోలామరస్వప్న గర్భ లీలాలోలన, వృత్తము
రచన:  వల్లభవఝల అప్పల నరసింహమూర్తి ,జుత్తాడ.
లీలాలోలన వృత్తము
కలలోన మల్లేశు కమనీయ లింగంబు కడుభక్తి నర్చించి గడగినాడ
నిలిచేవు డెందాన నిమిషంబు నేవీడ. నిడుపెంచు జీవంబు నిడితివీవు
పల్కించుపల్కీవు భములెల్లరానీవు పడుపాట్ల సౌఖ్యంబు వడినిడేవు
తలపించు నాతండ్రి తమిదీర రక్షించు తడబాట్లు రానీక తడవు పెంచు
            1.    కలలోన మల్లేశు                      కమనీయ లింగంబు
                  నిలిచేవు డెందాన                      నిమిషంబు నేవీడ
                  పల్కించుపల్కీవు                       భములెల్లరానీవు
                  తలపించు నాతండ్రి                     తమిదీర రక్షించు
           2.  కడుభక్తి నర్చించి            
                నిడుపెంచు జీవంబు
                పడుపాట్ల సౌఖ్యంబు 
                తడబాట్లు రానీక
          3.   గడగినాడ
                 నిడితివీవు
                వడినిడేవు
                తడవు పెంచు
         4.   కలలోన మల్లేశు కమనీయ లింగంబు    
                నిలిచేవు డెందాన నిమిషంబు నేవీడ.   
                పల్కించుపల్కీవు భములెల్లరానీవు    
                తలపించు నాతండ్రి తమిదీర రక్షించు.
       5.      కలలోన మల్లేశు కమనీయ లింగంబు కడుభక్తి నర్చించి  
                నిలిచేవు డెందాన నిమిషంబు నేవీడ నిడుపెంచు జీవంబు
                పల్కించుపల్కీవు భములెల్లరానీవు పడుపాట్ల సౌఖ్యంబు 
                తలపించు నాతండ్రి తమిదీర రక్షించు తడబాట్లు రానీక
      6.       కమనీయ లింగంబు కడుభక్తి నర్చించి  
                నిమిషంబు నేవీడ నిడుపెంచు జీవంబు
                 భములెల్లరానీవు  పడుపాట్ల సౌఖ్యంబు 
                 తమిదీర రక్షించు తడబాట్లు రానీక
     7.     కమనీయ లింగంబు  కడుభక్తి నర్చించి గడగినాడ
              నిమిషంబు నేవీడ నిడుపెంచు జీవంబు నిడితివీవు
              భములెల్లరానీవు పడుపాట్ల సౌఖ్యంబు వడినిడేవు
               తమిదీర రక్షించు తడబాట్లు రానీక తడవు పెంచు
     8.     కమనీయ లింగంబు కడుభక్తి నర్చించి  గడగినాడ కలలోన మల్లేశు
              నిమిషంబు నేవీడ నిడుపెంచు జీవంబు నిడితివీవు నిలిచేవు డెందాన  
              భములెల్లరానీవు పడుపాట్ల సౌఖ్యంబు వడినిడేవు  పల్కించుపల్కీవు 
               తమిదీర రక్షించు తడబాట్లు రానీక తడవు పెంచు తలపించు నాతండ్రి 
     9.        గడగినాడ కలలోన మల్లేశు కమనీయ లింగంబు
               నిడితివీవు  నిలిచేవు డెందాన నిమిషంబు నేవీడ
               వడినిడేవు పల్కించుపల్కీవు భములెల్లరానీవు
               తడవు పెంచు తలపించు నాతండ్రి తమిదీర రక్షించు
    10.     గడగినాడ కలలోన మల్లేశు కమనీయ లింగంబు కడుభక్తి నర్చించి
              నిడితివీవు నిలిచేవు డెందాన  నిమిషంబు నేవీడ నిడుపెంచు జీవంబు
               వడినిడేవు పల్కించుపల్కీవు భములెల్లరానీవు  పడుపాట్ల సౌఖ్యంబు 
               తడవు పెంచు తలపించు నాతండ్రి  తమిదీర రక్షించు తడబాట్లు రానీక
       11.    కడుభక్తి నర్చించి గడగినాడ
                నిడుపెంచు జీవంబు నిడితివీవు
                పడుపాట్ల సౌఖ్యంబు వడినిడేవు
                తడబాట్లు రానీక తడవు పెంచు
        
       12 .    కడుభక్తి నర్చించి  గడగినాడ  కలలోన మల్లేశు 
                నిడుపెంచు జీవంబు నిడితివీవు నిలిచేవు డెందాన   
                పడుపాట్ల సౌఖ్యంబు వడినిడేవు పల్కించుపల్కీవు   
                తడబాట్లు రానీక  తడవు పెంచు తలపించు నాతండ్రి 

       13.    కడుభక్తి నర్చించి గడగినాడ కలలోన మల్లేశు కమనీయ లింగంబు
                నిడుపెంచు జీవంబు నిడితివీవు నిలిచేవు డెందాన నిమిషంబు నేవీడ
                పడుపాట్ల సౌఖ్యంబు వడినిడేవు పల్కించుపల్కీవు భములెల్లరానీవు
                తడబాట్లు రానీక తడవు పెంచు  తలపించు నాతండ్రి తమిదీర రక్షించు

        14.  గడగినాడ కలలోన మల్లేశు     
               నిడితివీవు నిలిచేవు డెందాన       
               వడినిడేవు పల్కించుపల్కీవు         
               తడవు పెంచు తలపించు నాతండ్రి      


లీలాలోలనవృత్తము .ఉత్కృతి ,,,,,,,,,గల. యతులు, 8,12,22.
1, శ్రీవాణీ ద్వయ వృత్తములు, ఉష్ణిక్, వృత్త సం.76
2, స్థితి ,ఉష్ణిక్, ,,. వృత్తసం.108.
3, శమనామన సుప్రతిష్ట ,గల.వృసం.24.
4 ఉత్తుంగ ద్వయవృత్తములు.శక్వరీ,,,,,గల, యతి 8.
5, స్వర్లిింగ ప్రకృతి, ,,,రభ,,,  యతి 8.
6 సేవనా, అతిధృతి, ,,,,,, యతులు,8,15,20.
7, అర్చనా, ఉత్కృతి ,,,,,,సన,,గల.యతులు,8,15,20.
8, వొనరు, అతిధృతి, ,,,,,,. యతులు,6,13.
9, దనరారు, ఉత్కృతి, ,,,,,,,,గల,యతులు,6,13,20.
10, శయ్యాట, జగతీ,  ,,,.యతి 8.

11, డోలికా, అతిధృతి, ,,,,,,.యతులు,8,13.
12, లోలామర, ఉత్కృతి, ,,, ,,,,గల.యతులు, 8,13,20.

13, స్వప్న, జగతీ. ,,,, యతి6,
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కలలోన మల్లేశు కమనీయ లింగంబు " చాలా బాగుంది.
"చదవంగ యెదపొంగి జల్లుమనిపించె ".

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.