గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2017, బుధవారం

నూతన ఛందములలో గర్భ కవిత 94. . . . రచన . . . శ్రీ వల్లభ

  జైశ్రీరామ్.
నగోచర వృత్తము  
 రచన. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.   జుత్తాడ.
కనలేక వినలేక కనివిని మనలేక కడు కష్ట సుఖాల గడంగి 
ధనహీను పడుపాట్లు తనవిగ మదినెంచి తడబాటు పడంగ దడంది
మనసెంతొ చెదరంగ మనుకలి విధమెంచి మడియింపగ రారె మడాన
కనరేమి కిలోన కనికరమునుమాని కడిగోరి జనంబుకడడంట. 
1. కనలేక వినలేక
ధనహీను పడుపాట్లు
మనసెంతొ చెదరంగ
కనరేమి కలిలోన
2.కనివిని మనలేక.
తనవిగ మదినెంచి 
మనుకలి విధమెంచి 
కనికరమును మాని. 
3. కడుకష్ట సుఖాల గడంగి
తడబాటు పడంగ దడంది
మడియింపగరారె మడాన
కడిగోరి జనంబు కడంట 
4. కనలేక వినలేక కనివిని మన లేక
ధనహీను పడుపాట్లు తనవిగ మదినెంచి
మనసెంతొ చెదరంగ మనుకలి విధమెంచి 
కనరేమి కలిలోన కనికరమును మాని 
5. కనలేక వినలేక కనివిని మనలేక కడుకష్ట సుఖాల
ధనహీను పడుపాట్లు తన విగ మదినెంచి తడబాటు పడంగ
మనసెంతొ చెదరంగ మనుకలి విధమెంచిమడియయింపగ రారె
కనరేమి కలిలోన కనికరమును మానికడిగగోరి జనంబు
6.కనివిని మనలేక కడుకష్ట సుఖాల
తనవిగ మదినెంచి తడబాటు పడంగ
మనుకలి విధమెంచి మడియింపగ రారె
కనికరమును మాని కడికోరి జనంబు
7.కనివిని మనలేక కడు కష్ట సుఖాలగడంగి
తనవిగ మదినెంచి తడబాటుపడంగ దడంది
మనుకలి విధమెంచి మడియింపగ రారెమడాన
కనికరమును మాని కడిగోరి జనంబుకడంట
8. కనివిని మనలేక కడు కష్ట సుఖాల గడంగి కనలేక వినలేక
తనవిగ మదినెంచి తడబాటుపడంగ దడంది ధనహీను పడుపాట్లు
మనుకలి విధమెంచి మడియింపగ రారె మడాన మనసెంతొ చెదరంగ
కనికరమును మాని కడిగోరి జనంబు కడంట కనరేమి కలిలోన
9. కడుకష్ట సుఖాల గడంగి కనలేక వినలేక
తడబాటు పడంగ దడంది ధనహీనుపడు పాట్లు 
మడియింపగ రారె మడాన మనసెంతొ చెదరంగ .
కడిగోరి జనంబు కడంట కనరేమి కలిలోన 
10. కడు కష్ట సుఖాల గడంగి కనలేక వినలేక కనివిని మనలేక
తడబాటు పడంగ దడంది ధనహీను పడుపాట్లుతనవిగ మదినెంచి
మడియింపగ రారె మడాన మనసెంతొ చెదరంగ మనుకలి విధమెంచి
కడిగోరి జనంబు కడంట కనరేమి కలిలోన కనికరమును మాని. 
దడంది....దడనుపొంది   మాడ....ధనము . కడంట.....చివరనుపొందగ 
కడిగోరి.....తిండిని కోరుకొనుచు. 

నగోచర వృత్తము .ఉత్కృతి .స.న.భ.న.స.న.భ.భ.గల.యతులు.9.17.24.
1.మోహినీ అనుష్టుప్. స.న.గల. వృ.సం.188. 
2. మృదుపద. అనుష్టుప్ .వృ.సం. 192.
3. స్థితిగమన .పంక్తి .న .స. .స.ల.యతి8.
4. న జీవనా   .అష్టీ .స.న.భ.న.స.ల. యతి  9.
5. ఘనసన్నిభ. వికృతి .స.న.భ.న.స.న.భ.గల.యతులు 9.17.
6.కనరాని అతిశక్వరీ .న.న.భ.జ.జ. యతి 9.
7.నిర్జరా. ధృతి న.న.భ.జ.జ.జ. యతి.9.
8. అసాధ్య. ఉత్కృతి .న.న భ.జ.జ.జ.స.న.గల. యతులు. 9.16.19.
9.ఆర్తి .ధృతి .స.స.స.న.భ.జ. యతి 11.
10.కడగడి .ఉత్కృతి .స.స.స.న.భ.జ.న.న.గల. యతులు 8.11.19. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.