గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జులై 2017, శుక్రవారం

నూతన ఛందములలో గర్భ కవిత 102. . . . రచన . . . శ్రీ వల్లభ

  జైశ్రీరామ్.
 పదవీమోహనవృత్తము.  
రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
పద్ధతిమీరి పొందినది భద్రతమేర్చుటకేసుమా పదవికివచ్చుటంద్రు.
కొద్దిగగుప్పియోట్లుగని కుద్రతమోపనిమాటలన్ కొదువొదవంగనీరు.
సుద్దులుబల్కుచెన్నిటినొ క్షుద్రులు గానటు దోచుచున్ క్షుదలను దీర్చుకొంద్రు. 
వద్దనరేమిచూపినను భద్ర తమంబునజిక్కుచున్ పదిలపుజీవులౌచు. 
1.పద్ధతి మీరి పొందినది 
కొద్దిగ గుప్పి యోట్లుగని
 సుద్దులు బల్కుచెన్నిటినొ. 
వద్దన రేమిజూపినను. 
2.భద్రత మేర్చుటకే సుమా.
కుద్రతమోపనిమాటలన్. 
క్షుద్రులుగానటు దోచుచున్. 
భద్రతమంబున జిక్కుచున్. 
3.పదవికివచ్చుటంద్రు. 
కొదువొదవంగనీరు .
క్షుదలనుతీర్చుకొంద్రు. 
పదిలపుజీవులౌచు. 
4.పద్దతిమీరిపొందినది భద్రతమేర్చుటకేసుమా 
కొద్దిగగుప్పియోట్లుగని కుద్రతమోపనిమాటలన్
సుద్దులుబల్కుచెన్నిటినొ క్షుద్రులుగానటుదోచుచున్. 
వద్దనరేమిచూపినను భద్ర తమంబున జిక్కుచున్. 
5.భద్రతమేర్చుటకేసుమా పదవికివచ్చుటంద్రు. 
కుద్రతమోపని మాటలన్ కొదువొదవంగనీరు 
క్షుద్రులుగానటు దోచుచున్ క్షుదలను తీర్చుకొంద్రు.
భద్ర తమంబున జిక్కుచున్ పదిలపుజీవులౌచు. 
6.భద్రతమేర్చుటకేసుమా పదవికివచ్చుటంద్రు పద్ధతిమీరిపొందినది. 
కుద్రతమోపని మాటలన్ కొదువొదవంగనీరు  
కుద్రతమోపని మాటలన్ కొదువొదవంగనీరు   కొద్దిగగుప్పియోట్లుగని.
క్షుద్రులుగానటు దోచుచున్ క్షుదలనుదీర్చుకొంద్రు సుద్దులు బల్కుచెన్నిటినొ.
భద్ర తమంబున జిక్కుచున్ పదిలపుజీవులౌచు వద్దనరేమిచూపినను. 
7.పదవికివచ్చుటంద్రు పద్ధతి మీరి పొందినది 
కొదువొదవంగనీరు కొద్దిగగుప్పియోట్లుగని .
క్షుదలను దీర్చుకొంద్రు సుద్దులు బల్కుచెన్నిటినొ
పదిలపుజీవులౌచు వద్ధనరేమి జూపినను .
8.పదవికి వచ్చుటంద్రు పద్ధతిమీరి పొందినది భద్రతమేర్చుటకేసుమా.
కొదువొదవంగనీరు కొద్దిగ గుప్పియోట్లుగని కుద్రతమోపని మాటలన్.
క్షుదలను దీర్చు కొంద్రు సుద్దులు బల్కు చెన్నిటినొక్షుద్రులుగానటుదోచుచున్
పదిలపు జీవులౌచు వద్దనరేమి చూపినను భద్ర తమంబున జిక్కుచున్.
9.భద్రతమేర్చుటకేసుమా పద్ధతిమీరి పొందినది 
కుద్రత మోపని మాటలన్ కొద్దిగ గుప్పి యోట్లుగని. 
క్షుద్రులు గానటు దోచుచున్ సుద్దులు బల్కు చెన్నిటినొ 
భద్రతమంబున జిక్కుచున్ వద్దన రేమి జూపినను. 
10.
భద్ర తమంబేర్చుటకేసుమా పద్ధతి మీరి పొందినది పదవికి వచ్చుటంద్రు.
కుద్రత మోపని మాటలన్ కొద్దిగ గుప్పి యోట్లుగని  కొదువొదవంగనీరు
క్షుద్రులు గానటు దోచుచున్ సుద్దులు బల్కు చెన్నిటినొ క్షుదలను దీర్చుకొంద్రు.
భద్ర తమంబున జిక్కుచున్వద్దనరేమిజూపినను పదిలపుజీవులౌచు.
పదవీమోహనవృత్తము ఉత్కృతి భ.ర.న.భ.భ.ర.న.జ.గల.యతులు10.19.
1.విభూతినీ బృహతీ భ.ర.న.వృ.సం. 471.
2.ఉత్సుక .బృహతీ. భ.భ.ర.వృ.సం.183.
3.జీవప్రేమ. అనుష్టుప్ .వృ.సంస.176.
4 .పూర్ణోత్పల ధృతి భ.ర.న.భ.భ.ర.యతి10.
5.కూర్మిలు .అత్యష్టీ భ.భ.ర.న.జ.గల.యతి10.
6.భంగుర..ఉత్కృతి .భ.భ.ర.న.జ.ర.స.జ.లల.యతులు 10.18.
7.రసజ్ఞ అత్యష్టి న.జ.ర.స.జ.లల.యతి 9.
8.గప్తక ఉత్కృతి న.జ.ర.స.జ.స.స.స.లగ.యతులు.9.18.
9.రంభకా ధృతి .భ.భ.ర.భ.ర.న.యతి10.
10.భద్రతమ .ఉత్కృతి భ.భ.ర.భ.ర.న.న.జ.గల.యతులు.10.19.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పండితుల వారికి పాదాభి వందనములు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.