గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జులై 2017, శనివారం

నూతన ఛందములలో గర్భ కవిత 76. . . . రచన . . . శ్రీ వల్లభ

    జైశ్రీరామ్.
రమణిత, విక్రమ, మానన, మాయా, చిరునగ, మత్తేభ, కరివరద, సాకరి, నామసుధా, తామరస, తులసరి, మనోరమ, మయసభా, జీవనపుట, జీవదా,  గర్భ 
మాతంగినీ వృత్తము.  
రచన.వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.జుత్తాడ
మాతంగినీ వృత్తము
చిరుపొత్తంబిది జీవితంపు పుటలం  జెన్నొందు ఛందంబులం జేయంబూనినాడన్
పరమార్ధంబవ భావిజీవగతులన్ పన్నీటదేల్చంవలెం  శ్రేయంబోప శ్రీలన్
హర  నీ నామమె యావదాస్థి యనగా నన్నింట నీవే యనం హాయంగూర్చు సోమా
వరదంబౌకృతి,భావమింపొనరుతన్ వన్నెం సదాశర్వమై వ్రాయించుం సుభూతిన్
1.     చిరుపొత్తంబిది   
   పరమార్ధంబవ     
హర  నీ నామమె   
వరదంబౌకృతి
2.    జీవితంపు పుటలం   
భావిజీవగతులన్    
యావదాస్థి యనగా    
భావమింపొనరుతన్ 
3.    జెన్నొందు ఛందంబులం  
పన్నీటదేల్చంవలెం         
నన్నింట నీవే యనం   
వన్నెం సదాశర్వమై
4. జేయంబూనినాడన్
శ్రేయంబోప శ్రీలన్
హాయంగూర్చు సోమా
వ్రాయించుం సుభూతిన్
5.  చిరుపొత్తంబిది  జీవితంపు పుటలం   
పరమార్ధంబవ భావిజీవగతులన్     
హర  నీ నామమె యావదాస్థి యనగా    
వరదంబౌకృతి, భావమింపొనరుతన్     
6. చిరుపొత్తంబిది జీవితంపు పుటలం జెన్నొందు ఛందంబులం 
పరమార్ధంబవ భావిజీవగతులన్ పన్నీటదేల్చంవలెం         
హర  నీ నామమె యావదాస్థి యనగా నన్నింట నీవే యనం   
వరదంబౌకృతి, భావమింపొనరుతన్ వన్నెం సదాశర్వమై
7. జీవితంపు పుటలం జెన్నొందు ఛందంబులం
భావిజీవగతులన్ పన్నీటదేల్చంవలెం 
యావదాస్థి యనగానన్నింట నీవే యనం   
భావమింపొనరుతన్ వన్నెం సదాశర్వమై
8. జీవితంపు పుటలం జెన్నొందు ఛందంబులం జేయంబూనినాడన్
భావిజీవగతులన్ పన్నీటదేల్చంవలెం శ్రేయంబోప శ్రీలన్
యావదాస్థి యనగా నన్నింట నీవే యనం హాయంగూర్చు సోమా
భావమింపొనరుతన్ వన్నెం సదాశర్వమై వ్రాయించుం సుభూతిన్
9. జీవితంపు పుటలం జెన్నొందు ఛందంబులం జేయంబూనినాడన్ చిరుపొత్తంబిది  
భావిజీవగతులన్  పన్నీటదేల్చంవలెం శ్రేయంబోప శ్రీలన్, పరమార్ధంబవ
యావదాస్థి యనగా నన్నింట నీవే యనం హాయంగూర్చు సోమా హర నీ నామమె
భావమింపొనరుతన్ వన్నెం సదాశర్వమై వ్రాయించుం సుభూతిన్ వరదంబౌకృతి,   
10. జెన్నొందు ఛందంబులం జేయంబూనినాడన్
పన్నీటదేల్చంవలెం  శ్రేయంబోప శ్రీలన్
నన్నింట నీవే యనం హాయంగూర్చు సోమా
వన్నెం సదాశర్వమై వ్రాయించుం సుభూతిన్
11. జెన్నొందు ఛందంబులం జేయంబూనినాడన్ 
పన్నీటదేల్చంవలెం శ్రేయంబోప శ్రీలన్,  
నన్నింట నీవే యనం హాయంగూర్చు సోమా,  
వన్నెం సదాశర్వమై వ్రాయించుం సుభూతిన్
12. జెన్నొందు ఛందంబులం జేయంబూనినాడన్ జీవితంపు పుటలం   
పన్నీటదేల్చంవలెం  శ్రేయంబోప శ్రీలన్, భావిజీవగతులన్     
నన్నింట నీవే యనం  హాయంగూర్చు సోమా యావదాస్థి యనగా    
వన్నెం సదాశర్వమై  వ్రాయించుం సుభూతిన్ భావమింపొనరుతన్
13. జేయంబూనినాడన్ చిరుపొత్తంబిది   
శ్రేయంబోప శ్రీలన్ పరమార్ధంబవ 
హాయంగూర్చు సోమాహర  నీ నామమె  
వ్రాయించుం సుభూతిన్వరదంబౌకృతి
14. జేయంబూనినాడన్ చిరుపొత్తంబిది  జీవితంపు పుటలం   
శ్రేయంబోప శ్రీలన్ పరమార్ధంబవ భావిజీవగతులన్    
హాయంగూర్చు సోమాహర  నీ నామమె యావదాస్థి యనగా    
వ్రాయించుం సుభూతిన్వరదంబౌకృతి భావమింపొనరుతన్
15. జేయంబూనినాడన్ చిరుపొత్తంబిది  జీవితంపు పుటలం జెన్నొందు ఛందంబులం  
శ్రేయంబోప శ్రీలన్ పరమార్ధంబవ భావిజీవగతులన్ పన్నీటదేల్చంవలెం          హాయంగూర్చు సోమాహర  నీ నామమె యావదాస్థి యనగా నన్నింట నీవే యనం   
వ్రాయించుం సుభూతిన్వరదంబౌకృతి భావమింపొనరుతన్ వన్నెం సదాశర్వమై
1, రమణిత, గాయిత్రీ, ,, వృ,సం.52.
2, విక్రమ,  ఉష్ట్నిక్,  ,,, వృ,సం.59.
3, మానన,  ఉష్ణిక్, ,,. వృ,సం.37,.
4, మాయా, గాయిత్రి, ,, వృ,సం. 9.
5, చిరునగ, అతిజగతీ, ,,,,. యతి, 7.
6, మత్తేభము, ,,,,,,లగ.
7, కరివరద, శక్వరి, ,,,,లగ. యతి,8.
8, సాకరి, కృతి, ,,,,,,,గగ, యతి 14.
9, నామసుధా, ఉత్కృతి, ,,,,,,,,లల. యతులు,9,15,21.
10, తామరస, అతిజగతీ, ,,,,. యతి8. 
11, తులసరి, అతిధృతి, ,,,,,,. యతులు,8,14.
12, మనోరమ, ఉత్కృతి, ,,,,,,,,లగ. యతులు, 8,14,20.
13, మయసభా, జగతీ, ,,,.యతి,7.
14, జీవనపుట, అత్యష్టీ, ,,సభ,,,గగ. యతి, 7.

15, జీవదా, ఉత్కృతి, ,,,,,,,యలగ. యతులు, 7,13,20. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అద్భుత మైన చందస్సులను మాకందిస్తున్న మాన్యులు శ్రీ వల్లభవఝుల వారికి ప్రణామములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.