గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2014, ఆదివారం

అవధాన రాజధానిలో పాల్గొన వచ్చిన అవధాని అంజయ్య గారి పద్యాలు ఆలకించండి.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
అవధాన రాజధానిలో పాల్గొన వచ్చిన అవధాని అంజయ్య.
అవధాని అంజయ్యగారి పద్యాలు ఆలకించండి.

అవధాని అంజయ్య గారికి ఎదురుగా నిలిచి ఉన్నవారు ప్రముఖ హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావుగారు.
 పృచ్ఛకుఁడుగా పాల్గొన్న శ్రీ అంజయ్యావధాని.
అవధానిని ప్రశ్నిస్తున్న శ్రీ అంజయ్య.
అవధాని అంజయ్యగారికి అభినందనలు.
జైహింద్.

29, నవంబర్ 2014, శనివారం

అవధాన రాజధానిలో నిర్వహించిన నృత్యపది తిలకించండి.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధానిలో  నిర్వహించిన నృత్యపది తిలకించండి.
ఈ నృత్యము చేయుచున్న చిరంజీవి కేవలం మూడు పదుల వయసువాడే కాని నాలుగు పదుల దేశాలలో మన నాట్యశాస్త్ర ప్రాచుర్యాన్ని పెంచ్ పంచిన భరత మాత ముద్దుబిడ్డ. మన తెలుగు యువకుడే. ఇతనికి సుమారు 27 బిరుదులు అనేక దేశాలవారు ఇచ్చారు. ఇతను పూర్తి చేసిన డాక్టరేట్లు 7 ఉన్నాయి ఇప్పటికి. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు అయిన దీక్షితు గారి శిష్యుఁడే ఇతడు. వీని నృత్యాన్ని ఆకళింపు చేసుకొని, వెన్వెంటనే మన అవధాని శ్రీమాన్ నాగఫణి శర్మ గారు ఆశువుగా గీతం పాడి వినిపించి ప్రేక్షకాళిని సమ్మోహితులను చేశారు.
మీరూ విని చూచి, ఆనందాన్ని అనుభవించుదురనే సద్భావనతో మీముందుంచినాను.
  ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారే నిజమైన జ్ఞానులనేది నిజం గురుపాదములదగ్గరే కూర్చొని ప్రణమిల్లుతున్న ఈ శిష్యుఁడే పైన నృత్యపదిలో నాట్యం ప్రదర్శించిన మన నాట్యాచార్యుడు..
అవధానిగారిచేత సపత్నీకముగా సత్కృతుడైన మన నాట్యబ్రహ్మ.
భారతాంబ ముద్దుబిడ్డతో నేను.
జైహింద్.

28, నవంబర్ 2014, శుక్రవారం

హాస్య బ్రహ్మ శ్రీమాన్ శంకర్నారాయణ గారిచే హాస్యావధాన కార్యక్రమం.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! పశ్చిమ కోనసీమ ప్రాంతమైన తణుకు పట్టణంలో శ్రీ నన్నయ భట్టారక పీఠం వారి నిర్వహణలో హాస్యబ్రహ్మ బిరుదాంకితులైన శ్రీ శంకర నారాయణ గారిచే హాస్యావధాన కార్యక్రమము 30-11-2014 న సాయంత్రం 6 గంటలకు జరుగుచున్నది.అవకాశమున్నవారంతా తప్పక ఈ కార్యక్రమాన్ని చూచి మహదానందభరితులగుదురనుటలో ఏమాత్రం విప్రతిపత్తి లేదు. ఇది శ్రీమాన్ సుశర్మగారి ఆధ్వర్యవమున అత్యద్భుతముగా జరుగనున్నది. అవకాశం కల్పించుకొని వెళ్ళగలిగేవారందరినీ మనసారా ఆహ్వానిస్తున్నారు. తప్పక మీరూ వెళ్ళే అవకాశం ఉంటే మాత్రం మానవద్దు. తప్పక వెళ్ళగలరు. 
నాకు ఎడమప్రక్కనున్నవారే శ్రీ శంకర నారాయణ గారు.
కార్యక్రమనిర్వాహకులు శ్రీ సుశర్మగారు.
అవధానరాజధానిలో నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా శ్రీ సుశర్మ.
నమస్తే.
జైహింద్.

27, నవంబర్ 2014, గురువారం

అవధాన రాజధానిలో అవధానిగారు నిర్వహించిన ఈలపది. పృచ్ఛకులు శ్రీ ఈలపాట ప్రసాద్ .

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధానిలో అవధానిగారు నిర్వహించిన  ఈలపది. పృచ్ఛకులు శ్రీ ఈలపాట ప్రసాద్. మీరూ చూడండి. .

శ్రీ ఈలపాట ప్రసాద్ గారి ఈలపాట.
జైహింద్.

26, నవంబర్ 2014, బుధవారం

రాజమహేంద్ర వర పుత్రిక అయిన ప్రజాపత్రిక వార పత్రిక అవధాన రాజధాని విశేషాలనుగ్గడిస్తూ చేసిన ప్రచురణ

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!  
రాజమహేంద్ర వర పుత్రిక అయిన ప్రజాపత్రిక 
పత్రిక మాత్రయా! సుజన వర్ధన రాజమహేంద్ర సద్విరాట్ 
పుత్రిక. దుర్జనావళికి ముచ్చెమటల్ కలిగించు సత్ ప్రజా
పత్రిక. సత్ కవీంద్ర వర వాఙ్మయ మాతృక. సద్విమర్శకున్
క్షాత్రిక. మాతృదేవి వర కామ్య సుదర్శన దేవి పోలికౌన్.
అటువంటి యీవార పత్రిక అవధాన రాజధాని విశేషాలనుగ్గడిస్తూ  చేసిన ప్రచురణను చూడగలరు.
ప్రజాపత్రిక నిర్వాహకులకు నా అభినందన పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
జైహింద్.

25, నవంబర్ 2014, మంగళవారం

శ్రీ తెలకపల్లి రామచంద్రశాస్త్రి విరచిత భారత ధరణీ స్తుతి.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అభినవకాళిదాస బిరుదాంకిత శ్రీ తెలకపల్లి రామచంద్రశాస్త్రి విరచిత భారత ధరణీ స్తుతి ఎంత హృద్యంగా ఉందో చూడండి.
జైహింద్.

24, నవంబర్ 2014, సోమవారం

అవధాన రాజధానిలో ఒక సన్నివేశం చలన చిత్రం.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధానిలో ఒక సన్నివేశం చలన చిత్రం తిలకించండి.

జైహింద్.

23, నవంబర్ 2014, ఆదివారం

అవధాన రాజధాని కార్యక్రమ ప్రారంభోత్సవం చలనచిత్రం.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధాని కార్యక్రమ ప్రారంభోత్సవం చలనచిత్రం తిలకించండి.
జైహింద్.

19, నవంబర్ 2014, బుధవారం

అవధాన రాజధానిలో కొన్ని చలనచిత్రాలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధాని కార్యక్రమంలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను మీముందుంచుతున్నాను. చూడండి.





జైహింద్

18, నవంబర్ 2014, మంగళవారం

అవధాన రాజధానిలో ప్రశ్నిస్తున్న ప్రముఖులు, సమాధానం చెప్పుచున్న అవధానిగారు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా మరికొన్ని చిత్రాలను అవధాన రాజధానికి సంబంధించినవి చూడండి.
అవధానిగారిని ప్రశ్నిస్తున్న మాన్యశ్రీ హరీష్ రావు మంత్రివర్యులు.
సమాధానం  చెప్పుతున్న అవధానిగారు.
జగన్మాతను గూర్చి అడిగిన ప్రశ్నకు పాటరూపంలో జనరంజకంగా అవధానిగారు పాడగా పారవశ్యంతో బ్రతుకమ్మను ఆవిష్కరిస్తున్న పేరటాండ్రు.
ఆ ఆనంద పారవశ్యంలో అవధానిగారిని నింగికెత్తుతున్న అభిమానులు.
సభలో హాస్యబ్రహ్మ శ్రీ బీ.కామేశ్వరరావుగారు,  శ్రీ కుంచె బ్రహ్మచారిగారు మున్నగు ప్రముఖులు.
అవధాని శర్మగారిని ప్రశ్నిస్తున్న మన అంజయ్యావధాని.
బ్రహ్మచారిరో నేను.
విశాఖ జిల్లా చోడవరం ప్రముఖులతో పాటు మల్లేశ్.
అవధానిగారిని మల్లేశ్ ప్రశ్నిస్తున్న దృశ్యం.
సమాధానం చెప్పుతున్న అవధానసమ్రాట్ మాడుగులనాగఫణిశర్మగారు.
జైహింద్.

17, నవంబర్ 2014, సోమవారం

మన రాజధాని హస్తినలో మా ఛాయాచిత్రాలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధాని కార్యక్రమంలో పాల్గొన్న మాకు ఖాళీ సమయంలో ముఖ్యమైన ప్రదేశాలు చూచే భాగ్యం కలిగింది. ఆ తీపి జ్ఞాపకాలచిహ్నాలను మిత్రులకానందం కలిగిస్తుందనే భావంతో ఇందుంచుచున్నాను.

జైహింద్.

16, నవంబర్ 2014, ఆదివారం

అవధాన రాజధానిలో శ్రీ మడిపల్లి భద్రయ్య గారి సహృదయత నాపై కురిపించిన పద్యామృతం.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! విశ్రాంత ఉన్నత పాఠశాల ప్రథానోపాధ్యాయులు శ్రీ మడిపల్లి భద్రయ్య గారు అవధాన రాజధానిలో నాపై కురిపించిన అవ్యాజనురాగ భరిత పద్యరత్నాలను, నా ప్రతిస్పందనను, వారు కలిగియున్న చిత్రములను, తిలకించగలరు.
శ్రీమాన్ వీరభద్రార్యా! నమస్తే.

ద్వివిధ కందద్వయ గీత గర్భ చంపకమాల.
శ్రియ ధిషణాఢ్య! సద్ వినుత ప్రేమ సుధాంబుధి!  వీరభద్రమా!
ప్రియ సచివా ! సుధా మధుర రీతి చరించుచు మమ్ముఁ బ్రోచితే !
జయ విసృతా న్తరా! సుగుణ జాల సముద్భవ శోభ వెల్గులన్
నయ ప్రచయాత్మవై సుగతి  నంద చరించెడి సూక్ష్మ భావనా ! (నంద=కలిమి)

శ్రియ ధిషణాఢ్య! సద్ వినుత ప్రేమ సుధాంబుధి!  వీరభద్రమా!
ప్రియ సచివా ! సుధా మధుర రీతి చరించుచు మమ్ముఁ బ్రోచితే !
జయ విసృతా న్తరా! సుగుణ జాల సముద్భవ శోభ వెల్గులన్
నయ ప్రచయాత్మవై సుగతి  నంద చరించెడి సూక్ష్మ భావనా ! 

ధిషణాఢ్య! సద్ వినుత ప్రే
మ సుధాంబుధి!  వీరభద్రమా!ప్రియ సచివా ! 
విసృతా న్తరా! సుగుణ జా
ల సముద్భవ శోభ వెల్గులన్ నయ ప్రచయా!

సచివా! సుధా మధుర రీ
తి చరించుచు మమ్ముఁ బ్రోచితే!జయ విసృతా !
ప్రచయాత్మవై సుగతి  నం
ద చరించెడి సూక్ష్మ భావనా! శ్రియ ధిషణా !

వినుత ప్రేమ సుధాంబుధి!  వీరభద్ర!
మధుర రీతి చరించుచు మమ్ముఁ బ్రోచి!
సుగుణ జాల సముద్భవ శోభ వెల్గు
సుగతి  నంద చరించెడి సూక్ష్మ భావ!

నమస్తే

మీ
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.