జైశ్రీరామ్.
ఆదిత్యాయ నమో నమః.
శ్లో: నమః పవిత్రే జగదేక చక్షుషే - జగత్ ప్రసూతి, స్థితి, నాశ హేతవే,త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే - విరించి, నారాయణ, శంకరాత్మనే.
క: జగదేక చక్షు సవితకు,
జగములకన్నిటికి మూల సంస్థిత రవికిన్,
త్రిగుణాత్మగను, త్రిమూర్త్యా
త్మగ గల సూర్యునికి నుతులు మది నొనరింతున్.
భావము: జగదేక చక్షువైన సూర్య భగవానునకు నమస్కార సహస్రములు. సర్వ జగత్తుల సృష్టి స్థితి లయలకు కారణభూతుఁడై, వేద స్వరూపుఁడై, త్రిగుణాత్మకుఁడై, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాత్మకుఁడగు సవితకునా నమస్సులు అర్పించుచున్నాను.
జైహింద్.
1 comments:
ఆది దేవునకు నమస్కృతులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.