గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జులై 2013, ఆదివారం

మహనీయుల కృషి ఫలమగు అంతర్జాలము అందుబాటులోకి వచ్చి నేటికి మప్ఫైయేళ్ళు.

జైశ్రీరామ్.
ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా మనగుప్పిట్లో ఇమిడిపోవడం ఎంత వింత?
మిత్రులారా! అంతర్ జాలము (ఇంటర్నెట్) మనకు అందుబాటులోకి వచ్చి సరిగ్గా నేటికి ముప్పదేండ్లు పూర్తయ్యెను.
ఈ నాడు మనకు ఇంటర్ నెట్ సదుపాయం ఉండటం వల్ల అన్ని పనులూ సుకరమైన మాట సత్య దూరము కాదు. ఇంతటి సాంకేతిక పరిజ్ఞానముమనకందించుటకు ఎంతమంది మహనీయులు నిద్రాహారాలు మాని అహర్నిశలూ కృషిచేశారో తల్చుకుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది కదండీ!
ఇంతకీ మనమెప్పుడైనా ఆ మహనీయులను తలుచుకొంటున్నామా? వారి శ్రమ ఫలితాన్ని కూర్చొని అనుభవిస్తున్న మనం వారికి ఋణపడుతున్నామన్న మాటైనా గుర్తిస్తున్నామా?  అట్టి మహనీయుల ఋణం మనం తీర్చుకోవాలంటే మనసారా మనసులోనైనా వారికి ధన్యవాదాలు చెప్పాలి. మనం కూడా సాధ్యమైనంత వరకు సమాజానికి అపకారం జరగని మార్గంలో ఉపకారం చేసే మార్గంలో పయనించాలి.
ఈ ఇంటర్ నెట్ 1983 లో ఇదే రోజున ప్రారంభమయింది.  1995 నుండి విస్త్రుతమయింది.
ఎందరు శాస్త్ర వేత్తలు శ్రమించి రహర్నిశలెన్నినాళ్ళొ! వా
రందరి మేధ సంపద మనందరి నిత్య సుఖోపభోగ్యమై
సుందర వ్సప్నలోకము వసుంధరపైననె గొల్పుచుండె. వా
రందరు నిత్య సత్శుభదు లందరికేను నమస్కరించెదన్.
మహనీయులు నిత్య సంతుష్టులై వరలుదురు గాక. వారు నిత్యమంగళురై మంగళ మార్గమున లోకమున ప్రవర్ధింప జేతురు గాక.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మంచి విషయాన్ని గుర్తు చేసారు.
మూడు పదులుగా అభి వృద్ధి చెందిన అంతర్జాలమును అహరహము వాడు కోవడం తప్ప అందించిన మహనీయులను తలుచు కునే తీరిక ఓపికా ఎవరికి ? మన కందిన ప్రతి ఒక్క విజయము మాటునా మహనీయుల కృషి ఉంది .ఒక్కసారి వారిని తలచి అంజలి ఘటించ గలగడం కనీస ధర్మం .మీ రర్పించిన ఉత్పల ములకు ధన్య వాదములు

Unknown చెప్పారు...

అంతర్జాలాన్నినిత్యసంతుష్టులమై సంపూర్తిగా వినియోగించుకుంటున్న మహర్జాతకులం మనం!మూడుపదులు దానికి నిండిన సందర్భంలో దాన్ని కనిపెట్టి మనకు కనుకట్టు చేసిన మహనీయులను మనసునిండా తలచుకోవడం మన విధి!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.