గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2013, శుక్రవారం

హరి నామోచ్చారణా మాహాత్మ్యము 3.

జైశ్రీరామ్.
మహిమాన్విత హరినామామృత పాన లోలులారా!
సమస్త వ్రతముల కంటెనూ కూడా హరి నామము ఉత్తమమైనది.
శ్లో: సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుంఠనామ గ్రహణ మశేషాఘహరం విదు: (భాగవతము 6-2-14)
గీ: ఐహికంబుల కాశించి హరిని పలుక,
హేళనముఁ జేయ నితరుల పలుక హరిని,
గానమును చేయ, నశ్రద్ధగా హరి యన
అట్టి వారల పాపాళి యిట్టె పోవు.
భావము: ప్రాపంచిక ఫలితములనాశించి గాని ఇతరులను హేళన చేయు ఉద్దేశ్యముతో గాని, గానము చేయవలెనని గాని, ఆశ్రద్ధతో గాని వైకుంఠుని నామమును ఎవరు ఆశ్రయించుదురో, వారి అశేష పాపములు హరింపబడును.  ఈ విషయమును శాస్త్రవేత్తలగు భాగవతోత్తములు తెలిసికొని ఉన్నారు. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
హరి నామ మహత్యమును వరుసగా ప్రచు రించి మాకందించిన సోదరులు శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.