గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జులై 2013, శనివారం

హరి నామోచ్చారణా మాహాత్మ్యము 4.

జైశ్రీరామ్.
మహిమాన్విత హరినామామృత పాన లోలులారా!
సమస్త వ్రతముల కంటెనూ కూడా హరి నామము ఉత్తమమైనది.
శ్లో: పతితః స్ఖలితో భగ్నః సందష్టస్తప్త ఆహతః 
హరిరిత్యవశే నాహ పుమాన్ నార్హతి యాతనాః (భాగవతము 6-2-15)
గీ: పడెడి వేళల, జారుచు పడెడి వేళ,
గాయమగునప్డు,హానియే కలుగు నపుడు,
రోగ పీడన బాధచే రోయునపుడు
హరి హరీ యన యాతనల్ కరిగి పోవు.
భావము: పైనుండి క్రింద పడినపుడు గాని, నడచుచు జారినపుడు గాని, శరీరమునకు గాయము తగిలినపుడు గాని, సర్పాది క్రూర జంతువుల వలన హాని కలిగినపుడు గాని, రోగపీడితుడైనపుడు లేదా ఇతరులు శిక్షించినపుడు గాని ఎవరు కృష్ణ, హరి, నారాయణ అను నామములను ఉచ్చరించుదురో వారికి ఎన్నడును నరక బాధ కలుగదు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అసలు ప్రతి క్షణము కుడా హరి నామమును అలవాటుగా గా జేసుకుంటే అన్ని విధాలా శ్రేయ స్కరం మం చి శ్లోకాలను అందించి నందులకు చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.