జైశ్రీరామ్
Print this post
శ్లో: విద్యా ధన మదోన్మత్తః - యః కుర్యాత్ పితృ హేళనమ్
స యాతి నరకం ఘోరమ్ - సర్వ ధర్మ బహిష్కృతః.
గీ: ధన విద్యల మద గర్వము
కనులకు పొర గొలిపి నిజము కానంబడమిన్
వినయము విడి తలిదండ్రుల
కినుకను గను పుత్రుఁడొందు కిల్భష జగతిన్..
భావము: విద్యా ధన మదములతో కళ్ళు గానక పొగరుబోతుదనంతో తల్లిదండ్రులనెవ్వఁడు చులకన చేయునో వాఁడు ధర్మ చ్యుతుడై నరకమున బడును.
జైహింద్.
1 comments:
నమస్కారములు
ఈ నిజాన్ని తెలిసి కొందరు , తెలియక కొందరు , తెలిసినా సాగక , కొందరు పాటించరంటే అతిశ యోక్తి కాదు . ఇవి , పూర్వ జన్మ సుకృతాలు అంతె
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.