గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జులై 2013, బుధవారం

హరి నామోచ్చారణా మాహాత్మ్యము1.

జైశ్రీరామ్.
హరియను రెండక్షరములు హరియించును పాతకములు.
ఆర్యులారా! హరి నామోచ్చారణా మహహిమజ్ఞులారా!మీలో ఉప్పొంగే హరి భక్తికి కారణము ఈ క్రింది శ్లోకం చూచినప్పుడు నాకు స్పష్టమైంది
శ్లో: అయం హి కృత నిర్వేశో జన్మకోట్యంహసామపి
యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః (భాగవతము 6-2-7)
క: హరి యను నామోచ్చారణ 
హరియించును పాతకముల నసదృశ ఫణితిన్.
హరియే కనబడు లోపల,
హరియే కనిపించు బయట హరి భక్తులకున్. 
భావము: సమస్త పాపములను నశింపజేయుటయే హరి నామము యొక్క ప్రప్రథమ ధర్మము.  
దానికి ప్రమాణం ఏమనగా 
అజామిళుడు అవసానకాలమందు "నారాయణ" శబ్దము ముమ్మారు ఉచ్చరించి కోటి కోటి జన్మలలో చేసిన పాపరాశులనుండి ముక్తిని బొంది భగవత్సాన్నిధ్యము జేరెను. ఇది కోరు మనవుడు సాధన చేయ వలెను
కళ్ళు మూసినప్పుడు ధ్యానంలోను, కళ్ళు తెరిచినప్పుడు ప్రకృతిలోనూ దైవాన్ని చూడగలిగితే సాధన సార్ధకమైనట్లే.  
జైహింద్. 
Print this post

1 comments:

Goutami News చెప్పారు...

మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.

www.poodanda.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.