గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జులై 2013, మంగళవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 139.(త్రొమూర్త్యాత్మ దివాకరుఁడు)

జైశ్రీరామ్.
ఆదిత్యాయ నమో నమః.
శ్లో: నమః పవిత్రే జగదేక చక్షుషే  -  జగత్ ప్రసూతి, స్థితి, నాశ హేతవే,
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే  -  విరించి, నారాయణ, శంకరాత్మనే.
క: జగదేక చక్షు సవితకు,
జగములకన్నిటికి మూల సంస్థిత రవికిన్,
త్రిగుణాత్మగను, త్రిమూర్త్యా
త్మగ గల సూర్యునికి నుతులు మది నొనరింతున్.
భావము: జగదేక చక్షువైన సూర్య భగవానునకు నమస్కార సహస్రములు. సర్వ జగత్తుల సృష్టి స్థితి లయలకు కారణభూతుఁడై, వేద స్వరూపుఁడై, త్రిగుణాత్మకుఁడై, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాత్మకుఁడగు సవితకునా నమస్సులు అర్పించుచున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆది దేవునకు నమస్కృతులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.