గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2013, మంగళవారం

"మద్యము లేక వోటరులు మౌనము దాల్చిరి రోడ్డుషోలలో" అనే సమస్యాపూరణం మీరూ సునాయాసంగా చేసి పంపగలరు.

జైశ్రీరామ్.
మద్యము లేక వోటరులు మౌనము దాల్చిరి రోడ్డుషోలలో.
అనే సమస్యకు నా పూరణము చూడండి.
:-
మద్యము నాశ జూపుచునుమంచిగ రమ్మనియిప్పు డచ్చటన్
మద్యము పోయకుండతమ మాటను తప్పిన , యల్గి ,పౌరులో
యుద్యమమార్గ గాములయి ,ఉల్కక పల్కక బెట్టుసేసెనోయ్.
మద్యము
 లేక వోటరులు మౌనము దాల్చిరి రోడ్డుషోలలో.
మీరూ పూరించి పంపండి.
జైహింద్.
Print this post

2 comments:

G.P.V.Prasad చెప్పారు...

మధ్యము ఎందుకు పోసితిరో తెలుసుకుని దిమ్మతిరిగి ఆ
మధ్యము తాగి తిరిగి ఆ
మధ్యము అమ్మువారిని వోటరు కూడా ధనవంతుడు చేసి
మధ్యము లేక వోటరులు మౌనము దాల్చిరిరోడ్డు షోలలో

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

హృద్యము గాసభల్ జనుల హిండిత కేకస లన్ ధ్వనింపగన్
మద్యమె చక్కనై నఋజు మార్గము తప్పదు రాజకీయమున్
మద్యము మీకునిత్తుమని మానకరమ్మని చేయియివ్వగన్
మద్యము లేక వోటరులు మౌనము దాల్చిరి రోడ్డుషోలలో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.