గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జనవరి 2013, ఆదివారం

శ్రీ నందన నామ సంవత్సర మకర సంక్రాంతి సందర్భముగా పాఠకులకు శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.

పాఠక పుంగవులారా! శ్రీ నందన నామ సంవత్సర మకర సంక్రాంతి సందర్భముగా మీకు మీ పరివారమునకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
మకర సంక్రాంతి శుభ వేళ మధురమైన
భావ జాలంబు రూపమై ప్రబలఁ జేసి,
మీకు సంతృప్తి నొసగుత. మేలు గొల్పి.
ప్రణవ నాదస్వరూపులౌ భవ్యులార!
జైహింద్.


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సంక్రాంతి పండుగ అంటే మా చిన్న తనంలో రంగు రంగుల ముగ్గులతో , వాటి మధ్య పసుపు కుంకుమలతో పూలతొ పూజించిన గొబ్బెమ్మలు , హరి దాసుల కీర్తనలు , గంగిరెద్దుల మేళాలు , కొత్త అల్లుళ్ళ తో , పచ్చ తోరణాలతో , బొమ్మల కొలువులతో ,పల్లె సీమలు కలకల లాడుతూ ఉండేవి .ప్చ్ ! ఇప్ప్డుడు ఆ అందాలు కను మరుగై పోతున్నాయి . బాగుంది చక్కని చిత్రాన్ని అందించి కొన్ని ఏళ్ళు వెనక్కి పంపిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు

పండితులకూ , గురువులకూ సాహితీ మిత్రులకూ, అందరికీ " సంక్రాంతి శుభా కాంక్షలు "

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.