గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జనవరి 2013, సోమవారం

నేను రచించిన 32 కంద పద్యములు 1 తేటగీతి గర్భమందుగల చంపక మాల చూడండి.

జైశ్రీరామ్.
చ: నిను తలతున్ హరీ! సుగుణ నిర్మల నీ వర శోభఁ జూతురా !
నిను కొలుతున్ మదిన్ మరువ నేర లసద్గుణ మాన్య దేవరా !
నిను పిలుతున్ ప్రభూ!కనుమ!నిల్కడగా నను గౌరవంబుగా.
నిను వలతున్ సదా మధుర నిర్మల భక్తిని మంచి గాంతురా !
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను తలతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్ 1.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను కొలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను తలతున్ 2.
క: పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను పిలుతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను తలతున్ 3.
క: పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను తలతున్.
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను పిలుతున్ 4.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను తలతున్
వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను వలతున్ 5.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను వలతున్
వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్ 6.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్
పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను పిలుతున్ 7.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్
పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను కొలుతున్ 8.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్
వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను వలతున్ 9.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను వలతున్
వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను కొలుతున్ 10.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను కొలుతున్
పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్ 11.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను కొలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్ 12.
క: వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను కొలుతున్ 13
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను కొలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్ 14.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్
పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్ 15.
క: పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్
వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్ 16.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను తలతున్ 17.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను తలతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను కొలుతున్ 18.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను తలతున్
పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను పిలుతున్ 19.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను పిలుతున్
పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను తలతున్.20.
క: వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను వలతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను తలతున్ 21.
క: వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను వలతున్ 22.
క: పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను పిలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్ 23.
క: పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను కొలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్ 24.
క: వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను వలతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్ 25.
క: వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను కొలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను వలతున్ 26.
క: పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను కొలుతున్ 27.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను కొలుతున్ 28.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను కొలుతున్
వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్ 29
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ వర శోభఁజూతురా. నిను కొలుతున్ 30.
క: పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్ 31.
క: వలతున్ సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్
పిలుతున్ ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్ 32.
గీ: సుగుణ నిర్మల నీ వర శోభఁజూతు.
మరువ నేర లసద్గుణ మాన్య దేవ!
కనుమ!నిల్కడగా నను గౌరవంబు.
మధుర నిర్మల భక్తిని మంచి గాంతు! 33. 
జైహింద్.
Print this post

7 comments:

మిస్సన్న చెప్పారు...

ఆర్యా! అద్భుతం! ఏమైనా మీర లఘటనాఘటన సమర్థులైన కవి పండితులండీ.

కమనీయం చెప్పారు...


mee kavitvamu adbhutamgaa undi.abhinandanalu.

కమనీయం చెప్పారు...



mee kavitvam adbhutam gaa undi.abhinandanalu.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

ఆర్య!చింతా రామకృష్ణా రావు గారికి నమస్సులు.
కాంచ లేదింతవరకు గర్భఛంద
మంద మైన కందంబున డెందమలర
చదువరుల్ శహబాసను చందమునను
చంద్రతారార్క ము సరగు సత్యమరయ.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూర్వ కవుల రచనల్లో ఇలా బంధ కవిత్వములు గర్భ కవిత్వములు ఇంత విరివిగా ఉన్నాయో లేదో నాకు అంతగా తెలియదు కానీ నేడు తమ వంటి పాండితీ స్రష్టలు ఇంత అద్భుత ప్రయోగములు చేయడం , ఆనందాన్నీ , ఆశ్చర్యాన్నీ కలిగి స్తున్నాయి.
చురికా బంధము , నాగ బంధము , వంటివి కొన్ని మాత్రమె చదవ గలిగాను కానీ , ఇన్ని , ఇన్ని రకముల చందస్సులు , బంధములతో తమకలాన్ని బంధించ గల నేర్పు ఆ వాగ్దేవి వరం వల్లనే సాధ్య పడ గలదు. నిరంతరం ఆ దేవి కటాక్షం లభించు గాక
మనసారా ఆశీర్వ దించి అక్క

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూర్వ కవుల రచనల్లో ఇలా బంధ కవిత్వములు గర్భ కవిత్వములు ఇంత విరివిగా ఉన్నాయో లేదో నాకు అంతగా తెలియదు కానీ నేడు తమ వంటి పాండితీ స్రష్టలు ఇంత అద్భుత ప్రయోగములు చేయడం , ఆనందాన్నీ , ఆశ్చర్యాన్నీ కలిగి స్తున్నాయి.
చురికా బంధము , నాగ బంధము , వంటివి కొన్ని మాత్రమె చదవ గలిగాను కానీ , ఇన్ని , ఇన్ని రకముల చందస్సులు , బంధములతో తమకలాన్ని బంధించ గల నేర్పు ఆ వాగ్దేవి వరం వల్లనే సాధ్య పడ గలదు. నిరంతరం ఆ దేవి కటాక్షం లభించు గాక
మనసారా ఆశీర్వ దించి అక్క

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సుమధుర వ్యాఖ్యను మిస్సన
కమనీయపు వ్యఖ్య తోడ కమనీయ సఖుల్,
సుమధుర వాగ్ఝరి నక్కయ
సుమసమ తోపెల్ల జాత సుబ్రహ్మణ్యం
ప్రముదంబు కలుగ జేసిరి
సుమధుర వాక్పరిమళముల సుగుణ గణాఢ్యుల్.
క్రమముగ నందరి కంజలి
సుమనంబున జేయుచుంటి సుకృతులు గొనుడీ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.