Hai. kalyaan gaaroo! Thank you very much for following ANDHRAAMRUTHAM with interest.I am appreciating your critical out. Nagabandham is also a famous chitrabandha kavita. Ancient poets also performed this kind of bandhaas in their poetry. సంస్కృతములో చిత్ర కావ్య కౌతుకమ్ - మందార మరంద చంపూ - ప్రతాప రుద్రీయము మున్నగు గ్రంథములలో ప్రాచీనులు ఈ నాగ బంధమును విరచించి యున్నారు. హిందీ భాషా కవులు కూడా ఈ బంధమును వ్రాసి యున్నారు. ఒక తమిళ కవి ఇరట్టెయి నాగ పంతం అని రెండు పద్యాలను రెండు నాగ బంధాలలో మిళితం చేసి రచించారు. అప్ప కవీయములో 4 - 575 పద్యములో ఈ నాగ బంధ లక్షణమును వివరించెను. తెలుగు కవి కోలాచలం శ్రీనివాసరావు గారు తాను రచించిన సునందినీ పరిణయము న ఇష్ట దేవతా ప్రార్థనగా వరుణుని ఆయుధమయిన నాగ పాశమున చంపక మాల రచించారు. చ: దశరథ రామ! శ్రీశ! నత దాత దురత్యయ ప్రీతి బ్రోవరా! కుశలర సేర!యీశ! యజ కుంజర సఖ్య!మహాదికారణా! పశుపతి చింతనా!శమిత పాతక! నిర్జర నాథ౧ యీ సదా యశము దినాయమున్ శుచి మహా మతి వర్ణిత సారధీ నిధీ! నాగు పామును చేతితో రెండు మూడు చుట్టలుగా చుట్టి పట్టుకుంటే చేతిలో చిక్కిన అక్షరమేదైతే ఉందో అదే అక్షరం ప్రతీ చుట్టలోను చేతిలో చిక్కిన అక్షరంగా ఉండాలి. ఈ విధంగా చంపక మాల పద్యం వ్రాసినట్లైతే ఆ పధ్యాన్ని నాగబంధంగా చుట్టి పట్టుకున్నట్లైతే చేతికి చిక్కే నాలుగు చుట్టలలోని నాల్గు అక్షరాలు ఒకటే అవుతాయి. మొదటక్షరం ద సర్పంగా ముందువస్తే తరువాత వచ్చే శ అనే అక్షరం చేతిలో చిక్కుతుంది. మొదటి చుట్టలో శ్రీశ లోని శ చేతికి చిక్కింది. రెండవ చుట్టులో యీశ లోని శ చేతికి చిక్కింది. మూడవ చుట్టులో సదా యశ లోని శ చేతికి చిక్కింది. ఈ విధంగా చేతికి చిక్కిన అక్షరం ఒక్కటే వచ్చేలా పద్యం వ్రాస్తే నాగాస్త్ర బంధం ఔంతోంది. నంది తిమ్మన పారిజాతాపహరణ కావ్యం 5 - 94 ను ఈ నాగబంధం లో వ్రాశాడు. ఇలాగే పెక్కురు కవులు ఈ నాగ బంధాన్ని తమకావ్యాలలో నిర్మించారు. నాకు బొమ్మ వెయ్యడం రానందున మీకు నాకర్థమైన రీతిలో వివరించే ప్రయత్నం చేశాను. శుభమస్తు.
2 comments:
కల్యాణ్ గారు ఇలాగన్నారు.
hello ramakrishna garu,
plz clear me one doubt abt naga banda padyalu,
how it started and is there any tantra like thing is involved in this.
do our ancient poets also used this kind of slokas or what.?
plz clear my doubt, ill be very thank full to you.
regards,
kalyan.
Hai. kalyaan gaaroo! Thank you very much for following ANDHRAAMRUTHAM with interest.I am appreciating your critical out.
Nagabandham is also a famous chitrabandha kavita. Ancient poets also performed this kind of bandhaas in their poetry.
సంస్కృతములో చిత్ర కావ్య కౌతుకమ్ - మందార మరంద చంపూ - ప్రతాప రుద్రీయము మున్నగు గ్రంథములలో ప్రాచీనులు ఈ నాగ బంధమును విరచించి యున్నారు.
హిందీ భాషా కవులు కూడా ఈ బంధమును వ్రాసి యున్నారు.
ఒక తమిళ కవి ఇరట్టెయి నాగ పంతం అని రెండు పద్యాలను రెండు నాగ బంధాలలో మిళితం చేసి రచించారు.
అప్ప కవీయములో 4 - 575 పద్యములో ఈ నాగ బంధ లక్షణమును వివరించెను.
తెలుగు కవి
కోలాచలం శ్రీనివాసరావు గారు తాను రచించిన సునందినీ పరిణయము న ఇష్ట దేవతా ప్రార్థనగా వరుణుని ఆయుధమయిన నాగ పాశమున చంపక మాల రచించారు.
చ: దశరథ రామ! శ్రీశ! నత దాత దురత్యయ ప్రీతి బ్రోవరా!
కుశలర సేర!యీశ! యజ కుంజర సఖ్య!మహాదికారణా!
పశుపతి చింతనా!శమిత పాతక! నిర్జర నాథ౧ యీ సదా
యశము దినాయమున్ శుచి మహా మతి వర్ణిత సారధీ నిధీ!
నాగు పామును చేతితో రెండు మూడు చుట్టలుగా చుట్టి పట్టుకుంటే చేతిలో చిక్కిన అక్షరమేదైతే ఉందో అదే అక్షరం ప్రతీ చుట్టలోను చేతిలో చిక్కిన అక్షరంగా ఉండాలి.
ఈ విధంగా చంపక మాల పద్యం వ్రాసినట్లైతే ఆ పధ్యాన్ని నాగబంధంగా చుట్టి పట్టుకున్నట్లైతే చేతికి చిక్కే నాలుగు చుట్టలలోని నాల్గు అక్షరాలు ఒకటే అవుతాయి.
మొదటక్షరం ద సర్పంగా ముందువస్తే తరువాత వచ్చే శ అనే అక్షరం చేతిలో చిక్కుతుంది. మొదటి చుట్టలో శ్రీశ లోని శ చేతికి చిక్కింది. రెండవ చుట్టులో యీశ లోని శ చేతికి చిక్కింది. మూడవ చుట్టులో సదా యశ లోని శ చేతికి చిక్కింది.
ఈ విధంగా చేతికి చిక్కిన అక్షరం ఒక్కటే వచ్చేలా పద్యం వ్రాస్తే నాగాస్త్ర బంధం ఔంతోంది.
నంది తిమ్మన పారిజాతాపహరణ కావ్యం 5 - 94 ను ఈ నాగబంధం లో వ్రాశాడు.
ఇలాగే పెక్కురు కవులు ఈ నాగ బంధాన్ని తమకావ్యాలలో నిర్మించారు.
నాకు బొమ్మ వెయ్యడం రానందున మీకు నాకర్థమైన రీతిలో వివరించే ప్రయత్నం చేశాను.
శుభమస్తు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.