జైశ్రీరామ్.
చ:-మకరమునందు సూర్యుఁడు విమానప్రదేశమునందు కూడగా
సకల జగమ్ము పుణ్య పరిసంభవ కాలముగా గణించుచున్
ముకుళిత హస్తులై తలచి పూర్వుల నెల్లర బ్రాహ్మణాళిలో.
సకల పదార్థముల్ గొనగ చక్కగ నిత్రు భుజింప భక్తితో.
ఉ:-పంట పొలాలలో విరగ పండిన పంటల లక్ష్మి బండ్లపై
నింటికి చేరి శోభిలగ, హేమ ప్రభా రమణీయ తేజసం
బంటిన రైతు బిడ్డ పరమాన్నము పంచును గాదె! పూజ్యులై
యింటికి వచ్చు వారలకు, నెంతటి పుణ్య పునీత మూర్తియో!
ఉ:-బంగరు కాంతులీను పురి పాకలు, మామిడి తోరణావళుల్
ముంగిట రంగవల్లుల నమోఘముగా విరచించు కన్యకల్
చొంగలు కార్చుచున్ కనెడి సోకుల రాయుల వేష భాషణల్
రంగుగ నద్దినట్టి చదరంగపు మ్రుగ్గుల మధ్య గొబ్బిళుల్,
జంగమ దేవరల్ కొలుపు చక్కని నాదములిచ్చు శంఖముల్
టింగరి వోలె చెట్లపయి డేకుచు నాడెడు కొమ్మ దాసరుల్
సాంగముగా హరిన్ కొలుచు సన్నుత శ్రీ హరి దాసరావళుల్
పింగళ వర్ణులౌ పగటి వేషపు గాండ్రును, పల్లె వాసులున్,
రంగుల వస్త్ర ధారణను రాజిలు ముంగిటి గంగిరెద్దులున్
హంగులకాశ చేసి వరహాలను జల్లెడి పెత్నదారులున్
నింగికినంటు యాశల మునింగియు నల్గెడి క్రొత్త యల్లుళున్
రంగులు పూసి బావలకు రాతిరి యక్కల దాచు చెల్లెళున్
బంగరు బావ గారనుచు వందలు గుంజెడి బావ మర్దులున్,
బెంగగ నుండు నప్పులిల పేరుకు పోవుచునున్న మామలున్.
భంగమునొంది జూదమున పళ్ళికలించెడి తోటి యల్లుళున్.
ఖంగని మ్రోగునట్టి గుడి గంటలు. మండెడి భోగి మంటలున్,
నింగికి నంటు సంతసము నివ్వటిలే సరి క్రొత్త జంటలున్,
బంగరు పళ్ళెరంబులను పంటికి నోటికి నచ్చు వంటలున్,
రంగుల నీను పల్లెలును రమ్యత నొప్పెడి పట్టణంబులున్,
యింగిత మున్నసత్కవుల కెల్ల మనోజ్ఞ ము సంకురాత్రులౌన్.

జైహింద్.
4 comments:
లలిత లలిత అలతియలతి పదసముదాయంతో చంపకోత్పలోత్పల మాలిక గంగాప్రవాహంలా వాణీవిలాస గంగ మునిగి అందొక బిందువొంది బిందుపూర్వక “గ”
( గం గణపతే) కార ప్రాసతో సాగిన ఆంధ్రామృత ఝరిలో తడిసి ముద్దగునట్లు చేసిన
ఆర్య!చింతా రామకృష్ణా రావు గారికి ధన్యవాదములు
లలిత లావణ్య పదసుమమాలికల
లేసు లీలగ హేలగ లిఖిత మయ్యె
చంపకోత్పల మమృత ఝరుల పద్య
గీత మార్య!చింతా రామకృష్ణ రావు.
అలనాటి పల్లె సీమల సంక్రాంతి శోభను కనులకు కట్టిన పద్య రచన ఆంధ్రుల వైభవామృతం . శ్రీ చింతా వారికి శుభాభి నందనలు
శ్రీ రామకృష్ణారావుగారికి,
సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నమస్సులతో............
భంగములేక, తత్వరసభంగముజేయక, సంకురాత్రి శో
భాంగములన్నిటిన్ తమరభంగుతరంగమువోలెజెప్పి, రై
తాంగము, కార్మికుల్ వడయు హ్లాదములన్ వివరించ మీకు స
ర్వాంగనమస్సులిచ్చెదనయా! కవిచంద్రమహోదయా! నుతా!
శ్రీ తోపెల్ల సుబ్రహ్మణ్య శర్మ గారికి, రాజేడ్వరక్కయగారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి తమ అమూల్యమై అభిప్రాయాలు తెలియ జేసి నన్ను ప్రోత్సహిస్తున్నందులకు ధన్యవాదములు తెలియ జేస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.