గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, నవంబర్ 2008, సోమవారం

అమెరికా లోని ఆంధ్రులు క్షేమంగా వర్ధిల్లాలి.

పైశాచికత్వాన్ని ముక్త కంఠంతో ఖండిద్దాం.
విజ్ఞాన సముపార్జనే లక్ష్యంగా విశ్వమే విద్యాలయంగా భావించి విద్యార్థులై పాశ్చాత్య దేశాలకు వెళ్ళి శ్రద్ధాబుద్ధులతో సంస్కారంతో వికసిస్తున్న ఆంధ్ర విద్యార్థినీ విద్యార్థులను అమెరికావంటి అభివృద్ధి పొందిన దేశాలలోనే అమానుషంగా, పరమ కిరాతకంగా, హతమారుస్తున్న వైనం చూచి ప్రపంచ దేశాలన్నీ ఏవగించుకొంటున్నాయి.
మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన " అర్పణ " 12రోజుల క్రితమే కత్తి పోట్లకు గురయి మరణిచగా నిన్న వరంగల్లుకుచేందిన శశాంక్ ను అతి దారుణంగా కాల్చేశారు. ఏమిటీ దొర్భాగ్యం?
మన దేశీయుల ప్రతిభ చూచి అక్కసుతో చంపెస్తున్నారా? లేక మరేదయినా కారణముందా? ఏది యేమైనా మన పిల్లలు ఆ దేశంలో వారికి అతిధులేకదా? అక్కడి ప్రభుత్వాలకి యివేవీ పట్టవా? మనప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరేచర్యా తీసుకొనే సత్తా కలిగి లేదా? ఇలా యెంతమంది అక్కడ బలైపోవాలి? పోనీ వుచి విద్యకోసం అక్కడికి వెళ్ళారా? బోలెడంత ధనాన్ని, అక్కడ ఖర్చుపెట్టుకొంటూ, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చుకొంటూ, అందరినీ యిక్కడ విడిచిపెట్టి, ఇక్కడికి సుదూర ప్రాంతాలలో వుంటూ, కేవలం విద్యార్థులుగా వెళ్ళితే అమానుషంగా చంపెస్తారా?
ప్రపంచాన్నే శాశించ గలిగిన దేశమా అది? తన దేశంలొని దురాగతాలనే గమనించలేని, అదుపు చేయలేని దౌర్భాగ్య స్థితిలోనున్న ఆ దేశమా ప్రపంచాన్ని శాశించేది?
తప్పు. చాలా తప్పు. దేశ ప్రజలకూ, అతిధులుగా వచ్చిన విదేశీయులకూ ప్రభుత్వం రక్షణ కల్పించ గలగాలి. సార్వభౌమత్వాన్ని ప్రదర్శిచడం కాదు. రుజువు చేసుకోవాలి.
అమెరికా ప్రభుత్వమిప్పటికైనా కళ్ళు తేరవాలి. చుట్టుముట్టుతున్న అపఖ్యాతిని గ్రహించుకొని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. కారణం యెవరైనా ప్రభుత్వాలు అపఖ్యాతిపాలు కాకూడదు.
శశాన్ క్ క్షేమమనేవార్త ఇప్పుడే తీ.వీ. 9 లో చూచి చాలా ఆనంద పడుతున్నాను. అమెరికా వైద్యుల్ని అభినడైస్తున్నాను. ఆరోగ్యంగా శశాన్ క్ స్వదేశానికి రావాలని కోరుకొంటున్నాను.
అమెరికాలోనున్న మనవారంతా క్షేమంగా వుండాలని పరమాత్మను కోరుకొంటున్నాను. మీరూ నాతో ఏకీఎభవిస్తారనుకొంటున్నాను. జైహింద్. Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

srIraamaraxa .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.