గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, నవంబర్ 2008, శనివారం

మంగిపూడి సుబ్బ లక్ష్మి గారి మహనీయ కార్యక్రమం.

















































































ఈ నెల (నవంబరు 2008) 14 వ తేదీన శ్రీ న్నమాచార్య సంగీత పీఠం, చొడవరం, (విశాఖపట్నం జిల్లా) లో " కలహ క్షేత్రంలో నారదుని పాత్ర " అనే అంశంపై డా. యన్. రాజేశ్వరీ శంకరం (విశాఖ పట్నం) గారి చే సుదీర్ఘమైన ఉపన్యాసం యివ్వబడింది.
శ్రీమతి యన్. రాజేశ్వరి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయం ద్వారా పి.హెచ్. డి. సాధించిన మొట్ట మొదటి మహిళ అవడం ఒక ప్రత్యేకత అయితే ఆ పి.హెచ్.డి. లో బంగారు పథకమును ఈమె కైవసం చేసుకోవడం రెండవ ప్రత్యేకత. ఈ సందర్భంగా తీయబడిన ఛాయా చిత్రాలను మీ ముందుంచగలిగాను.

ఈ మహిళా మణి ప్రసంగానంతరం ఆమెపై నేను ఆశువుగా చెప్పిన ప్రసంసా పూర్వక పద్యములు.
శార్దూలము:-
శ్రీ రాజేశ్వరి వాక్ ప్రవాహ మహిమా చిద్రూప గాంభీర్యముల్
పారంబంటిన పాండితీ గరిమయున్, భాస్వంత సద్ రూపమున్,
ధీరోదాత్తుడు నారదుండె యనగన్ తెల్పేటి యా పల్కులున్,
ధారా శుద్ధియు మాకు తృప్తి గొలిపెన్. ధన్యాత్మవీవమ్మరో!

ఆటవెలది:-
కాల యవను గూర్చి కమ్మగా చెప్పిరి,
నహుషు గూర్చి చెప్పి నయత దెల్పి,
వినిచిరిట జలంధరుని గూర్చి వివరించి
కంశు గూర్చి దెల్పె కమ్మగాను.

ఆటవెలది:-
సవివరముగ జెప్పె జాబాలి కథ మీరు,
దుష్ట యోధు గూర్చి దుమ్ము దులిపి
గయుని వృత్తమిపుడు ఘనముగా తెలిపిరి
యుగ యుగాలలోని సొగసు దెలిఓ.

ఉత్పలమాల:-
నారద వృత్తమే ప్రణవ నాదముగా వివరించి చెప్పి మా
కోరిక తీర్చినారు కడు కూర్మిజి. మా మహనీయ భాగ్యమే
చేరగ చెసె మమ్మిచట. చిద్ విలసన్ మహనీయ వమ్మ. నిన్
చేరి వచించుటీక్షణము చేసిన పుణ్యముగా తలంచెదన్.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.