మనం పోతన భాగవతం లోని ప్రథమ స్కంధం లోని కథా క్రమమును తెలుసుకొన్నాం. ఇప్పుడు ద్వితీయ{రెండవ,} తృతీయ { మూడవ } స్కంధముల లోని కథా క్రమాన్ని తెలుసుకొందామా మరి.
పోతన భాగవతము ద్వితీయ { రెండవ } స్కంధము లోని కథా క్రమము:-
శుకుడు పరీక్షితునకు ముక్తి మార్గమును దెలుపుట.
భక్తి మార్గమే ముఖ్యమని శుకుడు పరీక్షితునకు దెలుపుట.
ప్రపంచ ప్రకారమును గూర్చి నారదుడు బ్రహ్మ నడుగుట.
శ్రీమన్నారాయణుని లీలావతారముల వర్ణన
ప్రపంచోద్భవము మొదలైన వానిని గురించి పరీక్షితుడు శుక యోగినడుగుట.
నారాయణుడు బ్రహ్మ తపమునకు మెచ్చి వరములిచ్చుట.
ద్వితీయ { రెండవ } స్కంధము సమాప్తము.
తృతీయ { మూడవ } స్కంధము లోని కథా క్రమము:-
విదురుని తీర్థ యాత్ర.
విదురుడుద్ధవుని గని కృష్ణాదుల వృత్తాంతమడుగుట.
విదుర మైత్రేయుల సంవాదము.
పంకజ భవునిజన్మ ప్రకారము.
బ్రహ్మ కృత నారాయణ ప్రార్థనము.
బ్రహ్మకు శ్రీమన్నారాయణుని కర్తవ్యోపదేశము.
కమల సంభవుని మానస సర్గము.
బ్రహ్మ నిర్మితమైన దశవిధ సర్గములు.
కాల లక్షణ నిరూపణము.
మైత్రేయుడు విదురునకు సృష్టి మహిమ వివరించుట.
స్వాయంభువ మనువు ప్రజా వృద్ధి చేయుట.
శ్రీ యజ్ఞ వరాహావతార వర్ణనము.
బ్రహ్మాదులు శ్రీ యజ్ఞ వరాహ మూర్తిని స్తుతించుట.
మైత్రేయ మహాముని విదురునకు హిరణ్యాక్ష హిరణ్య కశిపుల వృత్తాంత మెఱిగించుట.
కశ్యపుడు భార్య సంతాపము తీర్చుట.
సనక సనందనాదులు వైకుంఠమునకరుగుట.
జయ విజయులకు సనక సనందనాదులు శాపమిచ్చుట.
సనకాదులు భగవన్నారాయణుని స్తుతించుట.
ముని వరులకు గోవిందుని ఉద్బోధ.
భగవంతునికి ముని వరుల వినతి.
లక్ష్మీ కాంతుడు జయ విజయులను ఊరడించుట.
జయ విజయులు దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట.
హిరణ్యాక్షుడు యజ్ఞ వరాహమగు హరి నెదిరించి పోరుట.
చతుర్ముఖుడొనర్చు యక్షాది దేవతా గణ సృష్టిని దెలుపుట.
కర్దముడు భగవదనుజ్ఞ వడసి దేవహూతిని పెండ్లి యాడుట.
స్వాయంభువుని కన్యాన్వేషణ ప్రయాణము.
దేవహూతి గర్భమున విష్ణుడు గపిలాచార్యుడుగా బుట్టుట.
దేవహూతి పుత్రుడైన కపిలునిచే దత్వ జ్ఞానము వడయుట.
కపిలుడు దేవహూతికి భక్తి యోగమును దెలియ జేయుట.
కపిలుడు దేవహూతికి పిండోత్పత్తి క్రమమును తెలియ జేయుట.
గర్భస్థుండగు జీవుండు భగవంతుని స్తుతించుట.
తృతీయ స్కంధము సమాప్తము.
మిగిలిన భాగములు దైవ కృపతో త్వరలో మీముందుంచే ప్రయత్నం చేయగలను.
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
2 comments:
రామకృష్ణారావుగారు, మీరు ఆయా స్కంధములందుఁగల ముఖ్యమైన పద్యములు కూడ నిక్కడ నుంచితే నింకఁ బాగుగ నుండెడిది :)
అయ్యా! రాఘవ గారూ! నమస్తే.
స్కంధాల వారీగా కథాక్రమం ముందుగా మనసుకు పట్టడానికి వీలుగా ఈ ప్రయత్నం చేస్తున్నాను. నా తదుపరి ప్రయత్నం మీరు సూచించిన విధంగా ఒక్కొక్క స్కంధములోని ఒక్కొక్క కథలోని ఆంధ్రామృతాన్ని పాఠకులకందించడమే. మీ సూచనకు ధన్య వాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.