సాక్షరా శ్యులంత సరస వర్తులు కారు.:-
మనం లోకంలో ఎందరినో విద్యా వంతులను చూస్తున్నాం. విద్యా విహీనులనూ చూస్తున్నాం. గుణ వంతులను చూస్తున్నాం. గుణ హీనులనూ చూస్తున్నాం. సరసులను చూస్తున్నాం. రస హీనులను చూస్తున్నాం. విద్యా వంతులైన జ్ఞానులను చూస్తున్నాం. విద్యా వంతులైన జ్ఞాన హీనులను చూస్తున్నాం. విద్యా విహీనులైన జ్ఞాన వంతుల్ని చూస్తున్నాం. విద్యా విహీనులైన మూర్ఖుల్ని చూస్తున్నాం.విద్యా విహీనుడైనవాడు మూర్ఖు డవడంలో అర్థం లేకపో లేదు. కాని విద్యావంతుడు మూర్ఖు డవడంలో అర్థం లేదు. ఈ విషయంలో ఒకసంస్కృత శ్లోకం గుర్తుకు వస్తోంది. చూద్దామా!
శ్లో. సాక్షరా విపరీతాశ్చేత్ రాక్షసా యేవ కేవలం.
సరసో విపరీతో2పి సరసత్వం నముంచతి.
గీ. సాక్షరాశ్యులు శృతి మించి రాక్షసాన
వెనుక మార్గము పట్టుట కనగ నుండె.
సరస వర్తులు సతతము సరసులుగనె
యుండు చూచిన. కనుడిది నిండు మదిని.
భావము:- సాక్షరాశ్యులు = అక్షర జ్ఞానము కలవారు = విద్యా వంతులు అని మనం గ్రహించినట్లయితే అట్టి వారు తమజ్ఞానాన్ని సద్వినియోగం చేస్తే సమాజానికి చాలా మేలు జరుగు తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఐతే ఆ అక్షరాశ్యులే తమ విపరీతమయిన తెలివినుపయోగించుకొని విపరీత పోకడలతో ప్రవర్తించినట్లయితే అది సమాజానికి ఎనలేని కీడు కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు రాక్షసులే.
దీనినే కవి చమత్కరించి " సాక్షరా " తిరగ బడితే అంటే వెనుకనుండి చదివినట్లయితే
" రాక్షసా " { సాక్షరా ; = రాక్షసా } అని అవుతుందని చమత్కరించడం ఒక ఎత్తయితే,
సరస హృదయులు ఎప్పుడూ స్థిర స్వభావులుగా వుంటారని చెప్పడంలో మరో చమత్కారాన్ని కనబరచడం జరిగింది. గమనించండి. " సరస = సరస " ఏవిధముగ చూచినను, ఏవిధముగ వెనుకనుండి ముందుకైనా, ముందు నుండి వెనుకకైనా చదివిననూ మార్పు వుండదు. సరసుడయిన వాని స్థిర స్వభావం అటువంటిది.అని చెప్పడం మరొకెత్తు.

దీనిని బట్టి మనం సమాజానికీ మనకీ మంచినే కాంక్షిస్తాం కాబట్టి సరసత్వముగల సాక్షరాశ్యులుగా వెలుగొందేందుకు ప్రయత్నిద్దామా మరి?
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.