గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఏప్రిల్ 2020, గురువారం

శ్రీరామ నవమి సందర్భముగా మీకు శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.

శ్రీరామ భక్తులకు

శ్రీరామనవమి సందర్భముగా శుభాకాంక్షలు.


శా. శ్రీరామా! జనకాత్మజా! మదుల మా చింతల్ గనన్ నేరరా?

కారుణ్యంబున చేయనీయరుగ మీ కల్యాణ మీనాడు. మా

నేరంబేమి? కరోన రక్కసి వలన్ నిర్వీర్యమై నిష్క్రియన్

ఘోరంబౌ పతనంబదేలఁ గలిగెన్? కూర్మిన్ మమున్ గావరే?


శా. మీ పాదాబ్జము లెన్నుచున్ మదులలో మీ దివ్య కల్యాణమున్

బ్రేమన్జేయ వలంతిమీరు కరుణన్ బ్రీతిన్ నిలుండీవిధిన్.

క్షేమంబున్ జగమంత నింపుటకునై కేల్పట్టుమో రామయా

శ్రీమన్మంగళ సీత పొంగునటులన్. జీవాళి పొంగన్ భువిన్.


శా. ఈ మీ భక్తులు మీ వివాహ మెదలన్ హృద్యంబు గాంచుటన్

క్షేమంబున్ గలిగించి శోభనములన్ చిన్మార్గ సద్వర్తనల్

ప్రేమన్ గొల్పుడు. కావుడీ సతతమున్. విశ్వాసమున్ బెంచుడీ.

శ్రీమన్మంగళ మూర్తులార! ప్రణతుల్.  చిత్తంబులన్ నిల్చుడీ.
🙏🏻🙏🏻🙏🏻

సుజనవిధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.