గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఏప్రిల్ 2020, బుధవారం

భారణా,వరీయ,దోషచరా,నిభసరి,అనూత్తమ,ఉన్నతావరోధ,పద్దుగ,వికారతా,మందతా,బన్నముసేయు,గర్భ"-ఛిన్నా భిన్న"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
భారణా,వరీయ,దోషచరా,నిభసరి,అనూత్తమ,ఉన్నతావరోధ,పద్దుగ,వికారతా,మందతా,బన్నముసేయు,గర్భ"-ఛిన్నా భిన్న"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
     
                         
"-ఛిన్నా భిన్న"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.ర.ర.మ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నది మాసిపోయె గద!ఉన్నతి గూల్చె "-కరోన"-ఉద్ధరణంబేమౌ?భూతలిన్!
ఛిన్నము కాబడె న్జగతి!చెన్నెడ మేర్చు"- చమారి"-!సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!
భిన్న మనోవికారముల!వెన్నున తన్నె"- పిశాచి"-!పెద్దగు దుర్మార్గంబు న్హరా!
పన్నె విషాధ ఘోషణలు!బన్నము సేయ"-మహేశ!పద్దుగ మాప న్రావా!వడిన్!

అర్ధములు:-
ఉన్నతి=గొప్పతనము(అభివృద్ధి).ఛిన్నము=విచ్చిత్తు,చెన్నడమేర్చు=మనోహరతను. దూరముచేయు,(ఆనందము మాపు),వెన్నునదన్నె=నడ్డిపై తన్నె,నడ్డి విరిచె,పెద్దగు=గొప్పది యగు,పన్నె=విస్తరించె, బన్నముసేయ=ఆటంక పరచ,
పద్దుగ=పద్ధతి ననుసరించి,భవిన్=భవిష్యత్తును,

1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.
ప్రాసనియమము కలదు.
ఉన్నది మాసిపోయె గద!
ఛిన్నము కాబడె న్జగతి!
భిన్న మనోవికారముల!
పన్నె విషాధ ఘోషణలు!

2.గర్భగత"-వరియ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గల.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
ఉన్నతి గూల్చె!"-కరోన"-
చెన్నెడ మేర్చు"-చమారి"-
వెన్నున దన్నె "-పిశాచి"-
బన్నము సేయ "-మహేశ"-

3.గర్భగత"-దోష చరా"-వృత్తము.
బృహతీఛందము.భ.మ.ర.గణములు.వృ.సం.135.
ప్రాసనియమము కలదు.
ఉద్ధరణంబేమౌ?భూతలిన్!
సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!
పెద్దగు దుర్మార్గంబు న్హరా!
పద్దు మాపన్రావా!వడిన్!

4.గర్భగత"-నిభ సరి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.న.భ.భ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నది మాసిపోయె గద!ఉన్నతి గూల్చె"-కరోన"-
ఛిన్నము కాబడె న్జగతి!చెన్నెడమేర్చు"-చమారి"-
భిన్న మనోవికారముల!వెన్నున దన్నె"-పిశాచి"-
పన్నె విషాధ ఘోషణలు!బన్నము సేయ"-మహేశ"-

5.గర్భగత"-అనుత్తమ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.స.మ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నతి గూల్చె"-కరోన"-ఉద్ధరణం బేమౌ?భూతలిన్!
చెన్నెడ మేర్చు"-చమారి"-సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!
వెన్నున దన్నె"-పిశాచి"-పెద్దగు దుర్మార్గంబు న్హరా!
బన్నము సేయ"మహేశ" పద్దుగ మాపన్రావా!వడిన్!

6.గర్భగత"-ఉన్న తావరోధ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.మ.య.స.జ.లల.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నతి గూల్చె "-కరోన"-ఉద్ధరణం బేమౌ?భూతలిన్!ఉన్నది మాసిపోయె గద!
చెన్నెడ మేర్చు"-చమారి"-సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!ఛిన్నము కాబడె న్జగతి!
వెన్నున దన్నె"-పిశాచి"-పెద్దగు దుర్మార్గంబు న్హరా!భిన్న మనోవికారముల!
బన్నము సేయ"-మహేశ"-పద్దుగ మాపన్రావా!వడిన్!పన్నె విషాధ ఘోషణలు!

7.గర్భగత"-పద్దుగ"-వృత్తము.
ధృతిఛందము.భ.మ.ర.భ.ర.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉద్ధరణం బేమౌ?భూతలిన్!ఉన్నది మాసిపోయె!గద!
సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!ఛిన్నము కాబడె న్జగతి!
పెద్దగు దుర్మార్గంబు న్హరా!భిన్న మనో వికారముల!
పద్దుగ మాప న్రావా!వడిన్!పన్నె విషాధ ఘోషణలు!

8.గర్భగత"-వికారతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.ర.భ.ర.న.భ.భ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉద్ధరణం బేమౌ?భూతలిన్!ఉన్నది మాసిపోయె గద!ఉన్నతి గూల్చె"-కరోన"-
సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!ఛిన్నము కాబడె న్జగతి!చెన్నెడ మేర్చు"-చమారి"-
పెద్దగు దర్మార్గంబు న్హరా!భిన్న మనో వికారముల!వెన్నున దన్నె"-పిశాచి"-
పద్దుగ మాప న్రావా!వడిన్!పన్నె విషాధ ఘోషణలు!బన్నము సేయ"-మహేశ"
-
9.గర్భగత"-మందతా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.స.జ.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నతి గూల్చె"-కరోన"-ఉన్నది మాసిపోయె గద!
చెన్నెడ మేర్చు"-చమారి"-ఛిన్నము కాబడె న్జగతి!
వెన్నున దన్నె"-పిశాచి"-భిన్న మనో వికారముల!
బన్నము సేయ"-మహేశ"-పన్నె విషాధ ఘోషణలు!

10,గర్భగత"-బన్నము సేయు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.జ.స.స.మ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నతి గూల్చె"-కరోన"-ఉన్నది మాసిపోయె గద!ఉద్ధరణంబేమౌ?భూతలిన్!
చెన్నెడ మమేర్చు"-చమారి"-ఛిన్నము కాబడె న్జగతి!సిద్ధికి క్షుద్రంబేర్చెన్భవిన్!
వెన్నున దన్నె"-పిశాచి"-భిన్న మనో వికారముల!పెద్దగు దుర్మార్గంబు న్హరా!
బన్నము సేయ"-మహేశ"-పన్నె విషాధ ఘోషణలు!పద్దుగ మాపన్రావా వడిన్.
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.