గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఏప్రిల్ 2020, గురువారం

రసయా ద్వయ,సింహరేఖా,రసరాజి,హరాయుధ ద్వయ,శక్తిబీజ ద్వయ,పుఱ్ఱియౌ,గర్భ"-బీజకుండలినీ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
రసయా ద్వయ,సింహరేఖా,రసరాజి,హరాయుధ ద్వయ,శక్తిబీజ ద్వయ,పుఱ్ఱియౌ,గర్భ"-బీజకుండలినీ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.                        
"-బీజ కుండలినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.జ.మ.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.

బీజ శక్తిని మించి తంచున్!విఱ్ఱవీగెదే!"-కరోనా"-!వెఱ్ఱిదాన!హరాయుధానన్!
ఆజి నోడక!సాగి పొమ్మా!అఱ్ఱు చాచకే!పిశాచీ!అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!
తూ జపంబిది కాదు లెమ్మా!తొఱ్ఱ పుల్గు చూపు లాపే!తుఱ్ఱు మంచున్జేరు  చంద్రున్.                                             వాజినం బది నీఱు నౌలే!పఱ్ఱి యౌలే!పారిపొమ్మా!పఱ్ఱు మన్నటు లౌదు! వెంచన్!
                                                                                 
అర్ధములు:-
అఱ్ఱమౌ=జీర్ణము కానిదౌ,తొఱ్ఱ పుల్గు=గుడ్ల గూబ,తుఱ్ఱుమంచున్=
వడిజను,వాజినంబు=బలము,నీఱు=బూడిద,పఱ్ఱి యౌలే=ఛిన్నా భిన్న
మగును(ముక్కలు కాబడును),పఱ్ఱు మన్నటు=చౌటి మట్టి వలె,
శాస్త్రము లోక కల్యాణానికి నుపయోగ పడుట హర్షనీయమే!కాని
రక్షణమనే ముసుగులో ఆధిపత్య పోరుకు గాను ఒకరికొకరు తెలిసి కొనని
విధమున మారణాయుధాలు తయారు చేసి కొను నేపధ్యములో పంచ
భూతాత్మక ప్రకృతి ప్రకోపించు ననుటకు సందేహము లేదు.జీవ థాత్రిని
నడిపించే అతీతమైన శక్కి యొకటి గలదు.అదియే దైవము.భగవద్గీతలో
శ్రీకృష్ణుడు"-థర్మ సంస్తాపనార్ధాయ సంభ వామి యుగే!యుగే"-అన్నాడు.
యుగ ధర్మాన్ని బట్టి,నీతి,ధర్మము పూర్తిగా నశించు నపుడు దానిని
రక్షించుటకు భగ వంతుడు జన్మించు చుండును.మానవుడు తన రక్షణార్థమై
యెన్ని మారణాయుధములు సృజించినను లాభ ముండదు.దైవాన్నే మన
అదుపులో నుంచు కొందామనే యోచన ముప్పునకు కారణమగును.
త్రికాలజ్ఞులైన యోగులు మునులు వారి తపః శక్తిచే రాబోవు కాలమున
జరుగు య రాచికములను ముందుగనే యూహించి ప్రజల కందించినారు.
యోగ వాశిష్ట్యమున వాటిని దూరము చేసికొనుటకు బీజ సంపుటి
నేర్పరచిరి.
ప్రస్తుతము కరోనా మారి వాయు రూపమున దుష్ట క్రిమి యెదిరించుటకు
కనబడని మహమ్మారియై ప్రపంచమునే గడగడ లాడించుచున్నది.
దానినుండి తప్పించు కొనుట కవకాశము లేని పరిస్థితి యేర్పడినది.
అందరిని సమాన దృష్టిచే చూసి  కబళించు నీ పిశాచిని యంత్ర శక్తి,
శాస్త్ర శక్తి నిరుప యోగమని తేలినది.ఇప్పుడు దిక్కు మాలిన స్థితి
యేర్పడినది.దిక్కు లేని వారికి దేముడే దిక్కను నార్యుల వచనము
లిప్పటికైనా విందాము.
   
ఓం,హ్రీం,రీం,రాం,అనే విష్ణుబీజములు విపత్తులను దూరము చేయును.
అదియే విష్ణు శక్తితో"-హర హర,నయ నయ,పచ పచ,మథ మథ, ఉత్పాదయ దూరే కురు కురు స్వాహా!హర హరా శ క్త్యాయుధాన"-కోరంగి"-
కరోనా"-మారిని దూరముగా చంద్రమండలము పొమ్మని"-ఏక వింశత్యా
ధిక బీజము లుపయోగించి ఈ "-బీజ కుండలినీ"-లిఖింబడినది.
భావము:-
అణుశక్తి నాకు లెక్కా!బీజ శక్తినే మించినా నని,విఱ్ఱ వీగు "-కరోనా"-
హర హర యను నాయుధమున మేము చేయు యుద్ధమున పరాజయము
నందక వెడలి పొమ్ము.గెలుపునకు పిశాచీ యూహింపకు.ఇంత వరకు
యెందరినో పొట్టను పెంటు కొంటివి.అజీర్తి రోగముచే!నీ జవ సత్వములు
కృశించును.తూ తూ మంత్రము కాదు.మేము చేయునది.గుడ్ల గూబ  చూపు లెందు లకు?(గుడ్ల గూబలు,గబ్బిల భక్షణమున  కరోనా సంక్రమించునట).
తుఱ్ఱుమని యెగిరి చంద్రుని చేరికొమ్ము.నీ బలము బూడిదగును.నీబ్రతుకు
ఛిన్నా భిన్న మగును.పారి పొమ్ము.తుదకు నీవు.చౌటి మట్టి వౌదువు.

1.గర్భగత"-రసయాద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.123.
ప్రాసనియమము కలదు.
బీజ శక్తిని మించి తంచున్!
ఆజి నోడక సాగి పొమ్మా!
తూ జపంబిది కాదు!లెమ్మా!
వాజినం బది నీఱు నౌ లే!

వెఱ్ఱి దాన!హరాయుధానన్!
అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!
తుఱ్ఱు మంచు న్జేరు చంద్రున్!
పఱ్ఱు మన్నటు లౌదు వెంచన్!

2.గర్భగత"-సింహరేఖా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గగ.గణములు.వృ.సం.43.
ప్రాసనియమము కలదు.
విఱ్ఱ వీగెదే!"-కరోనా"-
అఱ్ఱు చాచకే!పిశాచీ!
తొఱ్ఱ పుల్గు!చూపు లాపే!
పఱ్ఱి యౌలె!పారి పొమ్మా!

3.గర్భగత"-రసరాజి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
బీజ శక్తిని మించి తంచున్!విఱ్ఱ వీగెదే!"-కరోనా"-
ఆజి నోడక సాగి పొమ్మా!అఱ్ఱు చాచకే!పిశాచీ!
తూ జపంబిది కాదు!లెమ్మా!తొఱ్ఱ పుల్గు!చూపు లాపే!
వాజినం బది!నీఱు నౌ లే!పఱ్ఱి యౌలే!పారి పొమ్మా!

4.గర్భగత"-హరాయుధ ద్వయ "-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.మ.జ.జ.గ.గణములు.యతి9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
విఱ్ఱ వీగెదే!"-కరోనా"-!వెఱ్ఱిదాన!హరాయుధానన్!
అఱ్ఱు చాచకే!పిశాచీ!అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్?
తొఱ్ఱ పుల్గు!చూపు లాపే!తుఱ్ఱు మంచు న్జేరు!చంద్రున్!
పఱ్ఱియౌలే?పారి పొమ్మా!పఱ్ఱు మన్నటు లౌదు!వెంచన్!

విఱ్ఱ వీగెదే!"-తకరోనా"-బీజ శక్తిని మించి తంచున్!
అఱ్ఱు చాచకే!పిశాచీ!ఆజి నోడక సాగి పొమ్మా!
తొఱ్ఱ పుల్గు!చూపు లాపే!తూ జపంబిది కాదు!లెమ్మా!
పఱ్ఱి యౌలే!పారి పొమ్మా!వాజినం బది నీఱు నౌలే!

5.గర్భగత"-శక్తి బీజ ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.మ.జ.జ.మ.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
విఱ్ఱ వీగెదే!"-కరోనా"-వెఱ్ఱిదాన హరాయుధానన్!బీజ శక్తిని మించితంచున్!
అఱ్ఱు చాచకే!పిశాచీ!అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!ఆజి నోడక సాగి పొమ్మా!
తొఱ్ఱ పుల్గు చూపులాపే!తుఱ్ఱు మంచు న్జేరు చంద్రున్!తూ జపంబిది కాదు లెమ్మా.                                                                                                                                            
విఱ్ఱ వీగెదే"-కరోనా!బీజ శక్తిని మించి తంచున్!వెఱ్ఱిదాన హరాయుధానన్!
అఱ్ఱు చాచకే!"-పిశాచీ!ఆజి నోడక సాగి పొమ్మా!అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!
తొఱ్ఱ పుల్గు చూపులాపే!తూ జపంబిది కాదు లెమ్మా!తుఱ్ఱు మంచు న్జేరు చంద్రున్!
పఱ్ఱి యౌలే!పారి పొమ్మా!వాజినంబది నీఱు నౌ లే!పఱ్ఱు మన్నటు లౌదు వెంచన్!                                                                                    
6.గర్భగత"-రసయద్వయ"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.య.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వెఱ్ఱిదాన హరాయుధానన్!బీజ శక్తిని మించి తంచున్!
అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!ఆజి నోడక సాగి పొమ్మా!
తుఱ్ఱు మంచు న్జేరు చంద్రున్!తూ జపంబిది కాదు లెమ్మా!
పఱ్ఱు మన్నటు లౌదు వెంచన్!వాజినంబది నీఱు నౌ లే!
7.గర్భగత"-పఱ్ఱియౌ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.ర.త.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వెఱ్ఱిదాన హరాయుధానన్!బీజ శక్తిని మించి తంచున్!విఱ్ఱ వీగెదే!"-కరోనా"-
అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!ఆజి నోడక సాగి పొమ్మా!అఱ్ఱు చాచకే"-పిశాచీ"-
తుఱ్ఱు మంచు న్జేరు చంద్రున్!తూ జపంబిది కాదు లెమ్మా!తొఱ్ఱ పుల్గు చూపు లాపే!                                             పఱ్ఱు మన్నటు లౌదు వెంచన్!వాజినం బది నీఱు నౌలే!పఱ్ఱి యౌలే!పారి పొమ్మా!                                                                                
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.