గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఏప్రిల్ 2020, ఆదివారం

విశ్వసౌఖ్య,సమీపక,వినసొంపు,ఉత్తమ,నమామీశ,దుర్దోషార్తి,జ్ఞానతా,దూరోత్పన్నయ,నమతయా,వాతదూర,గర్భ"-మేథాశ్రీ వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
విశ్వసౌఖ్య,సమీపక,వినసొంపు,ఉత్తమ,నమామీశ,దుర్దోషార్తి,జ్ఞానతా,దూరోత్పన్నయ,నమతయా,వాతదూర,గర్భ"-మేథాశ్రీ వృత్తము.
రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-మేథాశ్రీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.ర.న.మ.మ.మ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కురు మేథాశ్రిత జ్ఞానతన్!కుతల,హ్రీం,హ్రాం,రీం,రామ్మౌ!కొండంతౌ విష్ణు శక్తి కాయున్!                                        
తరుమం జాలని వాతమున్!తతుల దుర్దోషార్తిం బాపన్!దండం బూనున్! సుథాంశు లొప్పన్!                            
హర హరోన్నయ వాచియై!హత పచా ద్వందంబున్వేగన్!యండల్దండల్! హరౌచు భూమిన్!                                
గురు నయంబు ల్జేయుతన్!కుతుకతన్!మంచున్జేర్చున్!కొండన్సః,సః స చ్చంద్రు నటున్!                                    
భావము:-
మేథాశ్రిత జ్ఞాన సంపన్నతతో,హ్రీం,హ్రాం,రీం,రాం,బీజాక్షర సంపన్నయగు
విష్ణు శక్తి కొండంతై జనులను కాపాడును.తరుమ శక్యము గాని విష గాలిని
లోకుల కంటనీయక,రుగ్మతలంట నీయక,మంచికిరణములను ప్రసరింప జేసి
చెడును హరించును.హర,హర,యను ఉన్నత వాచులు,హత మేర్చు,పచ,
పచ,లజంటచే పారద్రోలుచు,హర,హర,యన హరించి భూమిని కాపాడును.
మేలును చేకూర్చును.సః,సః,సః,మేరుధీర బీజములు.హిమాంశుని చేరు
నటులంపును.లోక కంటక వ్యాధులను పారద్రోలును.
"-మేథాశ్రిత జ్ఞాన సంపన్నులు,భూత,భవిష్యద్వర్త మానము లవలీల నెరుంగ
గల్గిన,యోగులు,మునిపుంగవులు,తపః పుంగవులైన,మహర్షుల నిలయమౌ,
భారతావనిని,బీజ సమన్విత,మంత్రానుష్టాన,త్రష్ట లనేకులు కలరు.వారిచే
విరచిత మంత్రములు,జగద్రక్షణ కుపకరించు ననుట యదార్థము.
వశిష్ట మహాముని విరచిత"-యోగ వాశిష్ఠ్య మందు గల ప్రధాన మంత్రమిది.
"నియమోల్లంఘన,అకాల భోజన,భాజన,లోక కంటక కార్యాను వర్తుల,
దుర్మార్గతను పోజేయుటకు గాను భయంకర రాక్షసి యుందని,అది విషవాయు,రూపమున,జనుల ముక్కు రంధ్రముల ద్వారా ప్రవేశించి,
ఒకరినుండి,మరియొకరికి వ్యాపించి,హతమార్చుతుందని,దీని బారి నుండి
రక్షించు కొనుటకు,మంచి ఆహారపు టలవాట్లు,శుచి శుభ్రత,పాటించ
వలెనని,అప్పటికే రోగ పడిన వారు,ఈమంత్రమును,పఠించి,సరియైన,
ఔషధ సేవ చేసిన రోగ విముక్తు లగుదురని వక్కాణింప బడినది.
మంత్రము:-
ఓం, హ్రీం, హ్రాం, రీం ,రాం వి ష్ణు శక్తయేనమః!
ఓం,భగవతి విష్ణు శక్తి. మేనామ్!
ఓం,హర హర, నయ నయ పచ పచ మథ మథ ఉత్పాదయ
దూరే కురు స్వాహా!
హిమ వంతం గచ్ఛ జీవ
సః సః, సః చంద్ర మండల గతోపి స్వాహా!!

1.గర్భగత"-విశ్వ సౌఖ్య"-వృత్తము.
బృహతీఛందము.స.భ.ర.గణములు.వృ.సం.180.
ప్రాసనియమము కలదు.
కురు మేథాశ్రిత జ్ఞానతన్!
తరుమం జాలని వాతమున్!
హర హరోన్నయ వాచియై!
గురు నయంబులు జేయుతన్!
2.గర్భగత"-సమీపక"-వృత్తము.
అనుష్టప్ఛందము.న.మ.గగ.గణములు.వృ.సం.08,
ప్రాసనియమము కలదు.
కుతల హ్రీం,హ్రాం,రీం,రామ్మౌ!
తతుల దుర్దోషార్తిం బాపన్!
హత పచా ద్వంద్వంబున్వేగన్!
కుతుకత న్మంచుం జేర్చున్!
3.గర్భగత"-వినసొంపు"-వృత్తము.
బృహతీఛందము.మ.ర.య.గణములు.వృ.సం.89,
ప్రాసనియమము కలదు.
కొండంతౌ!విష్ణు శక్తి కాయున్!
దండం బూనున్సుథాంశు లొప్పన్!
అండల్దండల్!హరౌచు భూమిన్!
కొండన్సః,సః, స చ్చంద్రు నంటన్!
4.గర్భగత"-ఉత్తమ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.ర.న.మ.గగ.గణములు.యతి 10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కురు మేథాశ్రిత జ్ఞానతన్!కుతల హ్రీం,హ్రాం,రీం,రామ్మౌ!
తరుమన్జాలని వాతమున్!తతుల దుర్దోషార్తిం బాపన్!
హర హరోన్నయ వాచియై!హత పచాద్వందంబున్వేగన్!
గురు నయంబులు జేయుతన్!కుతుకతం మంచున్జేర్చున్!
5.గర్భగత"-నమామీశం"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.మ.మ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కుతల హ్రీం,హ్రాం.రీం,రామ్మౌ!కొండంతౌ విష్ణు శక్తి కాయున్!
తతుల దుర్దోషార్తిం బాపన్!దండం బూనున్సుథాంశు లొప్పన్!
హత పచా ద్వంద్వంబున్వేగన్!అండల్దండల్!హరౌచు భూమిన్!
కుతుకత న్మంచుం జేర్చున్!కొండన్సః,సః,స చ్చంద్రు నంటన్!
6.గర్భగత"-దుర్దోషార్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.మ.మ.జ.త.య.స.లగ.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
కుతల హ్రీం,హ్రాం,రీం,రామ్మౌ!కొండంతౌ!విష్ణు శక్తి కాయున్!కురు మేథాశ్రిత జ్ఞానతన్!                                        
తతుల దుర్దోషార్తిం బాపన్!దండం బూనున్శుథాంశు లొప్పన్!తరుమం జాలని వాతమున్!                                
హత పచా ద్వంద్వంబు న్వేగన్!అండల్దండల్!హరౌచు భూమిన్!హర హరో న్నయ వాచియై!                                
కుతుకతం మంచు న్జేర్చున్!కొండన్సః,సః,స చ్చంద్రు నంటన్!గురు నయం బుల్జేయుతన్!                                  
7.గర్భగత"-జ్ఞానతా"-వృత్తము.
ధృతిఛందము.మ.ర.య.స.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కొండంతౌ!విష్ణు శక్తి కాయున్!కురు మేథాశ్రిత జ్ఞానతన్!
దండం బూనున్శు థాంశు లొప్పన్!తరుమం జాలని వాతమున్!
అండల్దండల్!హరౌచు భూమిన్!హర హరోన్నయ వాచియై!
కొండన్సఃసః సచ్చంద్రు నంటన్!గురు నయంబుల్!జేయుతన్!
8.గర్భగత"-దూరోత్పన్నయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.ర.య.స.భ.ర.న.మ.గగ.గణములు.యతులు.
10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
కొండంతౌ!విష్ణు శక్తి కాయున్!కురు మేథాశ్రిత జ్ఞానతన్!కుతల హ్రీంహ్రాం, రీం,రామ్మౌ!                                        
దండన్బూనున్సుథాంశు లొప్పన్!తరుమం జాలని వాతమున్!తతుల దుర్దోషార్తిం బాపన్!                                  
అండల్దండల్!హరౌచు భూమిన్!హర,హరోన్నయ వాచియై!హత పచా  ద్వందంబున్వేగన్!                                  
కొండన్సః,సః,స చ్చంద్రు నంటన్!గురు నయంబుల్!జేయుతన్!కుతుకతన్!మంచున్జేర్చున్!                                
9,గర్భగత"-నమతయా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.త.య.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కుతల హ్రీం,హ్రాం,రీం,రామ్మౌ!కురు మేథాశ్రిత జ్ఞానతన్!
తతుల దుర్దోషార్తిం బాపన్!తరుమం జాలని వాతమున్!
హత పచా ద్వంద్వంబు న్వేగన్!హర హరోన్నయ వాచియై!
కుతుకతం మంచుం జేర్చున్!గురు నయంబుల్!జేయుతన్!
10,గర్భగత"-వాతదూర"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.త.య.స.య.మ.జ.గగ.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
కుతల హ్రీం,హ్రాం,రీం,రామ్మౌ!కురు మేథాశ్రిత జ్ఞాతన్!కొండంతౌ!విష్ణుశక్తి కాయున్!                                            
తతుల దుర్దోషార్తిం బాపన్!తరుమం జాలని వాతమున్!దండంబూనున్శుథాంశు లొప్పన్!                                  
హత పచా ద్వంద్వంబు న్వేగన్!హర హరోన్నయ వాచియై!అండల్దండల్ హరౌచు భూమిన్!                                
కుతుకతం మంచున్జేర్చున్!గురు నయంబులు జేయుతన్!కొండన్సః,సః స చ్చంద్రు నంటన్!                                
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

   



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.