జైశ్రీరామ్.
కరోనా దండకము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.చోడవరం(మం).విశాఖ పట్నము(జిల్లా).
ఓం,కార,హ్రీం కార,హ్రాం కార,రీం కార,రాం కార,బీజాశ్రి,
విష్ణ్వంశ,భక్తాళి మోదంబునై,రక్షకుం నెల్వవం,రాద్ధాంత
మున్జేయ,కోరంగి నామాన క్రొవ్వెక్కి,ఉచ్ఛ్వాస,నిశ్వాసలం
జేరి,మర్త్యాళి నాశంబు కాక్షించి,కానంగ రాకీవు కోరంగి నామా!
కరోనా పిశాచీ! ప్రకోపాన లోకంబు దండెత్త లెక్కింప
కీవుంటి వేలన్!వినాశీ కబోదీ!కరాళ ధంష్ట్రీ!సదా నంద
మున్బొంది ప్రాణాలు గొంపోవు నిన్జూసి,లోకంబు హింసింప
యత్నింప,తప్పించు కుంటున్న ద్రోహీ!వినాశంబు లేదెంతొ దూరంబు!
మాపాలి దైవాలు,నీపాల రుద్రాలు!వెన్నంటి తర్మంగ,
పర్వెత్తు కాలంబు!దర్జేరె!నీదౌ వికారంబు వికారిం
ప్రవేశించి ధర్మంబు గీడ్చేసి,కర్మంబు సేయంగ,నీక్షుద్ర
కర్మంబు జీవాళి హర్షంబు గా దెంచ! మర్యాద పాఠించి
పో పొమ్ము!సౌమ్యాన! లేకున్న దర్మంబు రక్షింప. బీజాస్త్ర
నాగాస్త్ర,సర్వాస్త్ర సంపన్నతం దేవ సంఘంబు విచ్చేసి
లోకంబు రక్షించు!మన్నింప రెవ్వారు నిన్నెంచ!
భీతిల్లి నిస్సాయతం పారు,నీభీతి మాపంగ శక్యంబు
గాదింక!పో వేగ భూ మండలం వీడి!మారీ మహామారి
కోరంగి రూపీ కరోనా కఠోరీ!
కటాక్షించు దైవాలు!హింసింప పాపంబు!
నా మాట లాలించి శాంతించి పొమ్మింక!
సద్ధర్మ సంకీర్తనం బొప్ప,కీర్తింతు రెన్నండు!శాంతించు
లోకంబు!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.