గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2020, మంగళవారం

౧౨ - ౪ - ౨౦౨౦ వ తేదీన శ్రీ కందిశంకరయ్య చేసిన ఆన్లైన్ అష్టవధానం. .

జైశ్రీరామ్.
ఆర్యులకు నమస్సులు.
శ్రీ కందిశంకరయ్య అవధాని చేసిన ఆన్లైన్ అష్టవధానం. .
వారిని పృచ్ఛకులడిగిన వాటికి వెంట వెంటనే నేనూ వ్రాసిన సమాధినాలు కూడా ఇక్కడ ఉంచియుంటిని. .
అవధానమునకు సంచాలకత్వం వహించిన శ్తీ ఆముదాల మురళి గారు శ్రీకారముతో ప్రారంభము చేసిరి.
శ్రీ రమణీయ భావ రస శేవధి యైన కవిత్వ తత్వమున్
చారు సుధామయోక్తుల ప్రసన్న గభీర విశిష్ట శైలితో
ధీరులు మెచ్చు పద్యముల తేకువ చెప్పెడి తేజమిచ్చి శ్రీ
శారద! రమ్ము! మమ్ము సరసమ్ముగఁబ్రోవ వధాన మందునన్.

వేలకు వేలు సమస్యల
లీలగ సంధించు సుంత క్లేశమనక ని
ర్వేలముగ, కంది శంకర
ధీలలితుం డిట వధాని దీప్తులు నింపున్. 

సప్తతి దాటిన వయసున 
ప్రాప్తించెడి మరపునకు పరాజయ మిడుచున్
సుప్త వధానము మేల్కొనె
శప్తులు గా పద్యవిద్య శత్రువు లణగన్.

శ్రీ కంది శంకరార్యులు 
మా కెల్లను మార్గదర్శి ,మాన్యుడు ,విద్యా
శ్రీకంఠుండవధానము 
ప్రాకామ్యము తోడఁజేయు భారతి కృపచే.

నమస్కారం
శంకరాభరణం సమూహ మిత్రులకు, రసజ్ఞులకు స్వాగతం. ఈరోజు మనం ఈ సముదాయంలో మూడవ  అష్టావధానాన్ని నిర్వహించుకొంటున్నాము. అవధానం చేస్తున్నవారు శ్రీమాన్ కంది శంకరయ్య గారు.వారిని గూర్చి చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు .అయితే చెప్పాల్సిన విషయం మాత్రం ఉన్నది. ఇప్పుడు వారి వయస్సు సుమారు 70 ఏళ్ళు. అవధానాలు చేసేవాళ్ళు మానేసే వయసు అది. ప్రముఖ అవధాని శ్రీ గాడేపల్లి వీర రాఘవ శాస్త్రిగారి పుత్రులు శ్రీ గాడేపల్లి శివరామయ్య గారు మిత్రుల ప్రోత్సాహంతో 60 ఏళ్లు నిండిన తరువాత అవధానాలు ప్రారంభించి విజయవంతంగా నిర్వహించారు. అలాంటి సంఘటనే ఇది కూడా.
శ్రీమాన్ శంకరయ్య గారు చేయి తిరిగిన పద్యరచయిత కావడం వల్ల అవధానాన్ని నల్లేరుపై బండి నడకలా పూర్తి చేయగలరు. అది అలా ఉంచితే ఈ అవధానంలో పృచ్ఛకులు అందరూ అవధానులు కావడం చాలా గొప్ప విషయం . అందరూ అవధానులు కనుక అవధాన అరంగేట్రం చేస్తున్న పెద్దలు శ్రీ కంది శంకరయ్య గారికి సహకరించి శారదా మాత కృపకు పాత్రులు కాగలరు అని వేడుకుంటున్నాను.
ఇలాంటి చారిత్రాత్మకమైన అవధానానికి సంచాలకుడిగా ఉండే అవకాశం రావడం నా పురాకృత పుణ్య విశేషం గా భావిస్తున్నాను. సమస్యా పృచ్ఛక చక్రవర్తి అవధాన చక్రవర్తిగా అవతరించే ఈ సమయంలో జరుగుతున్న ఈ అక్షర అభిషేకానికి మరొక్కమారు మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను పృచ్ఛకులకు నియమాలు తెలిసినవే గదా !అవధాని గారు పాదం చెప్పిన తర్వాత  ప్రశంసించే పద్ధతికి స్వస్తి పలికితే మంచిది.  చివరన వారివారి స్పందనలను తెలియజేయవచ్చు .అప్రస్తుత ప్రసంగం చేసే పృచ్ఛకులు తప్ప మిగిలిన వారు ఇతర అంశాలు జరుగుతున్నప్పుడు జోక్యం కల్పించుకొనరాదని మనవి. నేను కూడా అవసరం ఉంటే తప్ప మాట్లాడను. పృచ్ఛకులు మంచి ప్రశ్నలు అడగండి, మంచి పద్యాలను రాబట్టండి. ఇక అవధాని గారు వారి ఇష్టదేవతా ప్రార్థన తో అవధానం ప్రారంభిస్తారు .

[12/04, 3:05 pm] ఆముదాల మురళి: అవధానిగారి ఇష్టదేవతా ప్రార్థన
[12/04, 3:06 pm] Kandi 2: దైవ ప్రార్థన....
శ్రీసతి నెప్డు వక్షమునఁ జేర్చి జగమ్ములఁ గాచు శౌరి, గౌ
రీసుదతీమణిన్ దన శరీరమునన్ సగమిచ్చి మెచ్చు కై
లాసగిరిస్థితుండగు కళానిధిమౌళి, సరస్వతిన్ మనో
ల్లాసముగం జతుర్ముఖములందు ధరించిన బ్రహ్మ వేడ్క నా
కీ సమయమ్మునన్ శుభము లీయఁగఁ గోరుచుఁ బ్రస్తుతించెదన్.
[12/04, 3:06 pm] Kandi 2: అమ్మా భారతి! నీ పదాబ్జముల కేనందింతు దండంబుఁ జే
కొమ్మా! తల్లడమందు నా యెడఁదకున్ గోరంత ధైర్యమ్ము నీ
విమ్మా! నేఁ డవధానమందు విజయం బిచ్చోట వాక్శుద్ధితో
నెమ్మిం బొందు నదృష్ట మీయఁ గదవే నిన్నే మదిన్ నమ్మితిన్.
[12/04, 3:07 pm] Kandi 2: గురుస్తుతి....
కమ్ర కళ్యాణరాఘవ కావ్యకర్త
యై యఖండ యశమ్ముఁ గొన్నట్టి చిలుక
మఱ్ఱి రామానుజాచార్యు మద్గురువరు
పాద పంకజమ్ములకు నేఁ బ్రణతులిడుదు.
[12/04, 3:07 pm] Kandi 2: ప్రస్తావన....
స్తవనీయమ్ముగ నెచ్చో
నవధానము జరుగునో నయంబుగ నటకున్
దవిలి పయనించుచుండెద
నవధానముఁ జేయఁ బోదు ననుకొనలేదే!
[12/04, 3:08 pm] Kandi 2: 'శంకరాభరణం' సమూహ సభ్యులు.....
శ్రీ రంజిల్లఁగ శంకరాభరణ సుక్షేత్రమ్మునన్ సత్సుధా
ధారాపాతముగా కవిత్వమును సంధానించుచున్ నిచ్చలు
న్మేరల్ మీరిన స్నేహమాధురుల నందింపంగ ముందుండు వి
స్తారోదార కవీంద్ర సంఘమున కందం జేసెదన్ నా నుతుల్.
[12/04, 3:08 pm] Kandi 2: సంచాలకులు....
రసిక జన హృత్సరోరుహ రవివి నీవె
యగణితాష్టావధాన శతావధాన
కరణ వైదగ్ధ్య సంపన్న కవివరుండ
వాముదాల మురళి! నిన్ను నభినుతింతు.
[12/04, 3:08 pm] Kandi 2: పృచ్ఛకులు....
అక్షరాక్షర నిషేధాచరణోత్సుక
          చింతాన్వయ శశాంక! చేసెద నుతి;
మతినిఁ బోఁగొట్టు సమస్య నిచ్చెడి మైల
          వరపు మురళి నీకు వందనములు;
దత్తపదములతోఁ జిత్తమ్ముఁ గలఁగించు
          ముద్దు రాజయ్య! కేల్మోడ్తు నీకు;
శిక్షింప నన్ను న్యస్తాక్షరి నిచ్చెడి
          లోకా జగన్నాథ! మోకరిలుదు;
భావసంపదఁ గోరి వర్ణనాంశ మిడెడి
           యంజయ్య గౌడ! ని న్నభినుతింతు;
నాశువుల నొసంగి యాగమ్ము సేసెడి
          యైతగోనీ! నీకు జోతలిడుదు;
చిత్రమేదో యిచ్చి చెప్పు పద్య మనెడి
          భానుప్రకాశ! నిన్ బ్రస్తుతింతు;
అప్రస్తుత ప్రసంగార్భాటి గంగుల
          ధర్మరాజా! నీకు దండమిడుదు
అందరికి నంద రవధాను లడుగువార
లనుభవము సుంత లేనట్టి యర్భకుఁడను
యుక్తమౌ ప్రశ్న లడిగిన యుక్తితోడఁ
జెప్పఁగా సమాధానముల్ చేసెదఁ గృషి.
[12/04, 3:09 pm] Kandi 2: ఒప్పులను మెచ్చుకొని నా
తప్పుల మన్నించి దిద్ది దయతోఁ గనఁగన్
గొప్పగఁ గీర్తించెద మీ
మెప్పును నే నందినపుడె మేలని తలఁతున్.
[12/04, 3:09 pm] ఆముదాల మురళి: అవధాన కావ్య ఆరంభం అదిరింది
[12/04, 3:10 pm] ఆముదాల మురళి: ఇక ప్రారంభిద్దామా అవధాని గారు
[12/04, 3:11 pm] ఆముదాల మురళి: అవధాని శ్రీ కంది శంకరయ్యగారు తమ ఇష్ట దేవతా ప్రార్థనను, ప్రస్తావనాంశాలను పూర్తి చేశారు. ఇప్పుడు అవధానం లోని మొట్టమొదటి అంశం నిషిద్ధాక్షరి ప్రారంభం అవుతున్నది .మాన్యులు చిత్రకవితా సామ్రాట్ శ్రీ చింతా రామకృష్ణారావు గారు నిషేధం చేస్తారు ,వారికి స్వాగతం .
చింతా వారు !నిషేధం ప్రారంభించండి.

నిషిద్ధాక్షరి.
చింతా రామకృష్ణారావు.
అవధాన మిచట సుకరము
ప్రవిమల శంకరులకుఁ గన. వాగీశ్వరియే
నవ కవితావేశంబిడు.
భవుడుఁను మెచ్చంగ సాగి వరలఁగఁ జేయున్.

ఆర్యా!
అంశము. రావణునిచే అపహరించఁ బడిన సీత మనోగతము. స్వేచ్ఛా ఛందస్సులో.చెప్పవలసినదిగా మనవి..

నిషిద్ధాక్షరి.. అవధాని.పూరణ.
(ర)ఏ(న)మి(ట)ది(వేసుకోండి) నా(ద) భా(గ)వ(న)మ్మై
(జ)నా మ(న)ది(వేసుకోండి)లో(వేసుకోండి)కు (వ) కుందు(చ)న(న)ట్లు నై(ర)క (వేసుకోండి)కంబై (త)యీ
క్షేమాంతపు దుస్థితి నా
కేమాత్రము కోరనిది యిసీ నా రామా!

సమస్య....పూరణ. శ్రీ మైలవరపు మురళీకృష్ణ.
ఇచ్చిన సమస్య.
*కందెను* *కందిశంకరముఖాబ్జము* *పద్యములల్లువేళలో !!*

సమస్యకు అవధాని పూరణ.
సుందర శబ్ద భావముల చొప్పు నెఱుంగుచు పద్యలేఖనం
బందిన విద్యయే యని నయంబుగ నెంచ వధానమందు పే
రందిన పృచ్ఛకాళియె దయన్ విడనాడుచు ప్రశ్నలివ్వగన్
కందెను కంది శంకర ముఖాబ్జము పద్యము లల్లు వేళలో.

దీనికి నా పూరణ.
సుందరమౌ సమస్యలను శోభిల వారలొసంగు వేళలో
నందముగా లిఖించుతరి నద్భుత పూరణచేయ నేర్తుమే
మందర మేలనందుర? సమంచిత రీతిని వ్రాయఁ బూన మా
కందెను కంది శంకర ముఖాబ్జము పద్యములల్లు వేళలో.

దత్తపది....శ్రీ ముద్దు రాజయ్య అవధాని.
చిత్తము, పొత్తము, విత్తము, బెత్తము అనే పదాలను వాడి ప్రస్తుత లాక్ డౌన్ ను గూర్చి  స్వేచ్ఛాఛందంలో చెప్పండి.

దత్తపది..అవధాని..పూరణ.
చిత్తమునన్ భయమ్ము గడు జిత్రముగాగ కరోన నింపెనే
పొత్తములం దెటన్ జదువబోము గతమ్మున నిట్టి దుస్థితిన్
విత్తము లేనిదాయె గన వింతలు పెక్కులు గానవచ్చె పో
బెత్తము బట్టు వారిఁ గన భీతిని పారుచునుంటి మయ్యయో!

దీనికి నా పూరణ.
చిత్తము వచ్చినట్లు ప్రజ ఛీ యను దుస్థితిఁ గొల్పుటన్ మనన్
బెత్తము పట్టి శిక్షణను ప్రీత్ నొసంగ కరోన వచ్చె. యే
పుస్తకమందు చూచినను పుణ్యచరి త్రలె కాన గ్రంథముల్
విత్తముపెట్టి పొంద గుణవృద్ధినొనర్చు. కరోన నాశమౌన్.

న్యస్తాక్షరికి అంశం.. శ్రీ.లోకా జగన్నాథ శాస్త్రి.
అంశం..పోతన సారస్వత స్తవం. మత్తేభంలో పద్యం ..
1 పాదం..1 వ అక్షరం... అ
2 పాదం..2 వ అక్షరం....వ
3 పాదం..3 వ అక్షరం... ధా
4 పాదం..4 వ అక్షరం... నం.

న్యస్తాక్షరి...అవధాని.పూరణ.
అవధుల్ లేని కవిత్వ సంగ్రథన విద్యాపారగుండై సదా
స్తవనీయమ్మగునట్లు భాగవతమున్ ధన్యుండుగా వ్రాసె కే
శవ ధామమ్మును జేరగా దగిన శాస్త్రజ్ఞాన మందించె నా
యవధానమ్మున జేప్పి పోతనకు పద్యంబిట్టు లర్పించెదన్.

దీనికి నా పూరణ.
అవధానంబననాట కాదు. మహనీయారా ధ్య సద్విద్య. సం
భవమౌ చేయుట శారదా కృపఁ గనన్ వర్ధిల్లఁ జేయున్ భువిన్.
సువిధానంబునఁ జేయు సత్కవులిలన్ శోభిల్లి రీ విద్యచే,
శషవణానందకరంపు పద్య రచనన్. సన్మార్గ తేజో నిధీ!

వర్ణన....శ్రీ బండికాడ అంజయ్య అవధాని.
అంశము.....ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వల్ల ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని ఏదైనా వృత్తంలో వర్ణించండి..

వర్ణన.. అవధాని..పూరణ.
గడగడలాడుచుండగ జగంబున నున్న ప్రజల్ వినాశమై
చెడుగుడులాడునట్లు గడు జిత్రముగా జరియించుచున్నదే
యిడుముల బెట్టుచున్నది యిదేమి కరోన యంచు జెప్పిరే
గడబిడ రేగె గుండియలు గట్టిగ గొట్టుకొనెన్ పరాత్పరా!

దీనికి నా పూరణ.
పగలును రాత్రియు ప్రజలను
వగపించెడునీరోన వదులునిదెపుడో?
జగమంతయు భుగభుగమని
రగులుచునుండెను మురారి! రమ్మిటు కావన్.

ఆశువు.... శ్రీ ఐతగోని వేంకటేశ్వర్లు అవధాని.
అంశము.
ప్రకృతి పాడు జేయు పాడుమానవులకు
బుద్దినిడ కరోనపుట్టెననుచు
భావనంబు సేసి పద్యమందీయగ
శంకరావధాని సన్నుతి యిదె.

అవధాని.... పూరణ.
చయ్యన నరుదెంచె చైనాను విడి యిద్ది
నిత్యకార్యములకు నిప్పుఁ బెట్టె
నెచటఁ జూడ కానుపించె నిర్వేదమే
వచ్చినట్టి ముప్పు వదలు నెపుడొ?

దీనికి నా పూరణ.
చేయకూడని పనులను చేయువారు.
నియమబద్ధులు కాకిట నెగడువారు
పెచ్చు పెరుగ కరోన తా వచ్చె మార్చ .
మారకుండిన కొలుపును మరణములను.

చిత్రానికి పద్యరచన....శ్రీ అవుసుల భానుప్రకాశ్ అవధాని.

భారతీయ సంస్కృతీ రక్షణము గోరి
దేవుడంపినాడు ధీమహితుని
కనగ నెటుల జేయు కర్తవ్యపాలనం
బనుచు చూడ రాము డరుగుదెంచె.

దీనికి నా పూరణ.
మోదమునమోది సద్విల న్ బోధఁ గొలుప
వ్రాయుచుండగ ర ముఁడు వచ్చెనటకు
శక్తియుక్తులు కల్పింప సదయనిల చిత్రాన్ని.
భారతావన భ గ్యము వరలునిలను.

చిత్రానికి పద్య రచన.....శ్రీ అవుసుల భానుప్రకాశ్ అవధాని.



సద్యోజ్ఞానముతోడ నీ వెపుడు విశ్వాసమ్ము జూపించుచున్
విద్యారాణిని వాణినిన్ గొలుచుచున్ వేవేల పద్యమ్ములన్
హృద్యంబౌనటు వ్రాసి వాసి గని నీ వెంతో ముదంబందితే
పద్యంబందు నుతింతు భాను! నిను సంభావింతు నెల్లప్పుడున్.

దీనికి నా పూరణ.
అవుశులభాను ప్రకాశుని
నవని సదవధానియనుచు ననురక్తిమెయిన్
భువనేశ్వరి శారదయే
భువికీవిధి వచ్చె దరికి. పుణ్యాత్మీండా!

అప్రస్తుతానికి నా సమాధానములలో ఒకటి.
అవధాని మురళి యొక్కరు.
ప్రవిమల శ్రీ రామకృష్ణ రమ్యులొకరు ప్రా
భవము నొప్పెడి మిత్రుడులు
నవధానిగనన్నుఁజూడనాశించిరయా.

నా ధన్యవాదములు.
ఆర్యా!🏻
అవధానంచేసి అత్యద్భుతంగా ర ణించిన మీకు నా అభినందనలు.

వరలుత కంది వంశజ శుభప్రద శంకర నామధేయు లీ
ధరను మహద్వధానిగ. సుధారసధారల సత్కవిత్వమున్
గురియుత సద్వదాన్యులిల కోకిలయీ కవి యంచు మెచ్చ. సు
స్థిర శుభయోగమున్ గలిగి చిత్రకవీశుల మెప్పులందుతన్..🏻

నాకు పృచ్ఛకున గా సదవకాశము కలుగఁజేసిన మీకు, రాణింపఁ జేసిన శ్రీ మురళి గారికి
నాధన్యవాదములు.
పూచ్ఛకులకు ప్రేక్షకులకు అభినందనవందనములు.
మీ
చింతా రామకృష్ణారావు
 చూచారుకదా! శ్రీ కందిశంకరయ్య అవధానిగారిని అభినందించ మనవి
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.