జైశ్రీరామ్
శ్రీ గరికపాటి నరసింహారావు గారికి ఒక అవధానంలో ఆశువు అంశం క్రింద ఒక పృచ్ఛకుడు ఇలా అడిగాడు - "అవధానిగారూ! కార్యేషు దాసీ కరణేషు మంత్రీ... అంటు ఆడది ఎలా ఉండాలో ఒక సంస్కృత శ్లోకంలో చెప్పారు గదా. దానికి పారడీగా, ఈ రోజుల్లో, భర్త ఎలా ఉండాలని ఆడవారు కోరుకుంటారో ఆశువుగా చెప్పండి". అప్పుడు అవధానిగారు చెప్పిన ఈ అనేకభాషల శ్లోకం చూడండి:
శ్లో. కార్యేషు మిక్సీ, శయనేషు సెక్సీ - భరణేచ కూలీ, తరుణీషు శూలీ
రూపేచ హీరో, కోపేచ జీరో - షట్కర్మ కర్తా, కలికాల భర్తా.
భావము.
కలికాలంలో భర్తలు ఈ ఆరుపనులు చేయాలి.
పనులు త్వరత్వరగా చేయాలి మిక్సీ లాగా; పడకగదిలో సెక్సీగా ఉండాలి;
సామాన్లు భరిస్తున్నప్పుడు కూలీలాగా ఉండాలి;
ఆడవారి విషయాల్లో భార్యకు సగభాగమిచ్చిన శివుడు లాగా ఉండాలి;
చూడటానికి సినిమా హీరోలాగా ఉండాలి;
కాని జీరో కోపం ఉండాలి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.