జైశ్రీరామ్.
రసజలద్వయ,ఘోషణయుగళ,రమితా,మృదుమానస,నీతివినాద్వయ,రమసా,హృత్కమల,రసత్రిజభా,రసజ్ఞ,రమసజా,రామాశ్రిజ,,. ,రాసినీ,రసోజ్వల,చైతన్య,దోషక,రతిభ్రమ,నీతిపాల ,గర్భ"-కాలధర్మ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"- కాలధర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.జ.ర.భ.ర.స.లగ.గణములు.యతులు.11,19,
ప్రాసనీమముగలదు.
నీతిదూరులు నేతిబీరలు!నేలదోచే నీచాళురు!నేల సంద్రము నెట్టగా!
ప్రీతి హీనులు ప్రేత కర్ములు!పేలవంబౌ వాచాలురు!బేలరై రిల పౌరులే!
పూత ధర్ములు పోతరించిరి!బోలె చేతం పట్టింతురు!పోలి కెంతురు దివ్యులం ఘాతుకుల్భువి,కాతు రెంచగ!కాలధర్మం"తప్పౌ నొకొ?కాలుడే సరిజూచుతన్!
1.గర్భగత"-రజలద్వయ"-వృత్తములు.
పంక్తిఛందము.ర.స.జ.ల.గణములు.యతి.6.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.నీతిదూరులు నేతిబీరలు!
ప్రీతి హీనులు ప్రేత కర్ములు!
పూత ధర్ములు పోతరించిరి!
ఘాతుకుల్భువి కాతు రెంచగ?
2.నేతిబీరలు నీతి దూరులు!
ప్రేత కర్ములు ప్రితి హీనులు!
పోతరంబున భూతి నింపెడి!
కాతు రెంచగ?ఘాతుకుల్భువి!
2.గర్భగత"-ఘోషణయుగళ"-వృత్తములు..
సుప్రతిష్టఛందము.ర.లల.గణములు.వృ.సం.27.ప్రాసగలదు.
1.నీతి దూరులు. 2.నేతిబీరలు
ప్రీతి హీనులు ప్రేత కర్ములు
పూత ధర్ములు పోతరించిరి
ఘాతుకుల్భువి! కాతు రెంచగ?
3.గర్భగత"-రమితా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.మ.లల.గణములు.వృ.సం.195.ప్రాసగలదు.
నేల దోచే!నీచాళురు!
పేలవంబౌ!వాచాలురు!
బోలె చేతం పట్టింతురు!
"కాలధర్మం"తప్పౌనొకొ?
4.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
నేల సంద్రము నెట్టగా!
బేలరైరిల! పౌరులే?
పోలికెంతురు దివ్యులన్!
కాలుడే సరి జూచుతన్!
5.గర్భగత"-నీతివినా ద్వయ వృత్తములు.
ధృతిఛందము.ర.స.జ.జ.మ.భ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.నీతిదూరులు నేతిబీరలు!నేల దోచే నీచాళురు!
ప్రీతి హీనులు ప్రేత కర్ములు!పేలవంబౌ వాచాలత!
పూత ధర్ములు పోతరించిరి!బోలె చేతం పట్టింతురు!
ఘాతుకుల్భువి కాతు రెంచగ?"కాలధర్మం"-తప్పౌనొకొ?
2.నేతిబీరలు నీతి దూరులు!నేల దోచే!నీచాళురు!
ప్రీతి హీనులు ప్రేత కర్ములు!పేలవంబౌ వాచాలత!
పూత ధర్ములు!పోతరించిరి!బోలె చేతం పట్టింతురు!
కాతు రెంచగ?ఘాతుకుల్భువి!"కాలధర్మం"తప్పౌ నొకొ?
6.గర్భగత"-రమసా"-వృత్తము.
అష్టీఛందము.ర.మ.స.జ.జ.గ.గణములు.యతి.9,.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నేల దోచే నీచాళురు!నేల సంద్రము నేట్టగా!
పేలవంబౌ వాచాలత! బేల రైరిల పౌరులే?
బోలె చేతం పట్టింతురు!పోలికెంతురు దివ్యులన్!
"కాలధర్మం"-తప్పౌనొకొ?కాలుడే సరి జూచుతన్!
7.గర్భగత"లఘ్వంత హృత్కమల"-
ఉత్కృతిఛందము.ర.మ.స.జ.జ.త.భ.ర.లల.గణములు.యతులు.9,17
.ప్రాసనీమముగలదు.
నేల దోచే నీచాళురు!నేల సంద్రము నెట్టగా!నీతి దూరులు నేతిబీరలు!
పేలవంబౌ వాచాలత!బేల రైరిల పౌరులే?ప్రేత కర్ములు!ప్రీతి హీనులు!!
బోలె చేతం పట్టింతురు!పోలికెంతురుదివ్యులం!పూత ధర్ములు!పోతరించిరి! కాలధర్మం"-తప్పౌ నొకొ?కాలుడే,సరి జూచుతం!కాతురెంచగ?ఘాతుకుల్భువి
8.గర్భగత"-రసత్రిజభా"-వృత్తము.
ధృతిఛందము.ర.స.జ.జ.జ.భ.గణములు.యతి.9,వ.యక్షరము
.ప్రాసనీమముగలలదు.
నేల సంద్రము నెట్టగా!నీతి దూరులు నేతి బీరలు!
బేల లైరిల పౌరులే?ప్రేత కర్ములు!ప్రీతి హీనులు!
పోలికెంతురు దివ్యులం!పూత ధర్ములు,పోతరించిరి!
కాలుడే!సరి జూచుతం!కాతు రెంచగ !ఘాతుకుల్భువి!
9.గర్భగత"-లఘ్వంత రసజ్ఞ"-
ఉత్కృతిఛందము.ర.స.య.జ.జ.భ.ర.త.లల.గణములు.యతులు.9,19.
ప్రాసనీమముగలదు.
నేల సంద్రము నెట్టగా!నీతి దూరులు నేతి బీరలు!నేల దోచే!నీచాళురు!
బేల రైరిల పౌరులే?ప్రేత కర్ములు ప్రీతి హీనులు!పేలవంబౌ!వాచాలత!
పోలికెంతురు దివ్యులం!పూతధర్ములు పోతరించిరి!బోలె చేతం! పట్టింతురు!
కాలుడే!సరి జూచుతం?కాతు రెంచగ!ఘాతుకుల్భువి!కాలధర్మం"తప్పౌనొకొ?
10,గర్భగత"-రమసజా"-వృత్తము.
ధృతిఛందము ర.మ.స.జ.జ.భ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నేల దోచే నీచాళురు!నీతి దూరులు నేతి బీరలు!
పేలవంబౌ!వాచాలత!ప్రేత కర్ములు ప్రీతి హీనులు!!
బోలె చేతం పట్టింతురు!పూత ధర్ములు పోతరించిరి!
కాలధర్మం"తప్పౌనొకొ?కాతు రెంచగ?ఘాతుకుల్భువి!
11.గర్భగత"-రామాశ్రిజ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.మ.స.జ.జ.భ.ర.స.లగ.గణములు.యతులు.9,19.
ప్రాసనీమముగలదు.
నేలదోచే!నీచాళురు!నీతి దూరులు!నేతిబీరలు!నేల సంద్రము నెట్టగా!
పేలవంబౌ!వాచాలత!ప్రేత కర్ములుప్రీతిహీనులు!బేలరైరిల!పౌరులే?
బోలె చేతం బట్టింతురు!పూత ధర్ములు పోతరించిరి!పోలికెంతురు దివ్యులన్!
కాలధర్మం"తప్పౌనొకొ?కాతు రెంచగ!ఘాతుకుల్భువి?కాలుడే సరిజూచుతన్!
12.గర్భగత"-రాశినీ"-వృతము.
ధృతిఛందము.ర.స.జ.జ.భ.ర.గణములు.యతి11,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నేతి బీరలు నీతి దూరులు!నేల సంద్రము నెట్టగా!
ప్రేత కర్ములు ప్రీతి హీనులు! బేలరై రిల పౌరులే?
పూతధర్ములు పోతరించిరి!పోలికెంతురు!దివ్యులన్!
కాతు రెంచగ ఘాతుకుల్భువి?కాలుడే!సరి చూచుతన్!
13.గర్భగత లఘ్వంత"-రసోజ్ఞ"-
ఉత్కృతిఛందము,ర.స.జ.జ.భ.ర.ర.మ.లలగుణములు.యతులు.11,19.
ప్రాసనీమముగలదు.
నేతిబీరలు!నీతి దూరులు!నేల సంద్రము నెట్టగా!నేల దోచే నీచాళురు!
ప్రేత కర్ములు!ప్రీతి హీనులు!బేలరైరిల పౌరులే!పేలవంబౌ?వాచాలత!
పూత ధర్ములు పోతరించిరి!పోలికెంతురు దివ్యులం!బోలె చేతం పట్టింతురు!
కాతు రెంచగ!ఘాతుకుల్భువి!కాలుడే!సరి చూచుతం!కాలధర్మం"తప్పౌనొకొ?
14.గర్భగత"-చైతన్య వృత్తము.
బృహతీఛందము.ర.త.భ.గణములు.వృ.సం.419,ప్రాసగలదు.
నేల దోచే!నీచాళురు!
పేలవంబౌ!వాచాలత!
బోలె చేతం పట్టింతురు,
కాలధర్మం" తప్పౌనొకొ?
15.గర్భగత"దోషక"-వృత్తము.
శక్వరీఛందము.ర.త.భ.ర.లల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నేలదోచే!నీతిదూరులు!నేతి బీరలు!
పేలవంబౌ!ప్రీతిహీనులు!ప్రేత కర్ములు!
బోలె చేతం!పోతరించిరి!పూత ధర్ములు!
"కాలధర్మం"-ఘాతుకుల్భువి!కాతు రెంచగ?
16,గర్భగత"-రతిభ్రమ"-వృత్తము.
ధృతిఛందము.ర.త.భ.ర.స.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నేలదోచే!నీతిదూరులు!నేతిబీరలు!నీచాళురు!
పేలవంబౌ!ప్రీతి హీనులు!ప్రేత కర్ములు!వాచాలత!
బోలె చేతం!పోతరించిరి!పూత ధర్ములు!పట్టింతురు!
కాలధర్మం"ఘాతుకుల్భువి!కాతు రెంచగ?తప్పౌనొకొ?
17.గర్భగత"-నీటిపాల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.త.భ.ర.స.భ.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నేలదోచే!నీతిదూరులు!నేతిబీరలు నీచాళురు!నేల సంద్రము నెట్టగా?
పేలవంబౌ!ప్రీతిహీనులు!ప్రేత కర్ములు!వాచాలత! బేలరైరిల!పౌరులే?
బోలెచేతం పోతరించిరి!పూత ధర్ములు!పట్టింతురు!పోలికెంతురు దివ్యులన్
కాలధర్మం"ఘాతుకుల్భువి!కాతు రెంచగ,తప్పౌనొకొ?కాలుడే!సరి జూచుతన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.