జైశ్రీరామ్.
ఆర్యులారా! శరన్నవరాత్రులలో రెండవ రోజైన నేడు ఆ జగన్మాత బ్రహ్మచారిణి రూపంలో మనలను కటాక్షిస్తుంది.
'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
మీ అందరికీ జగ్న్మాత కటాక్షం పూస్ర్తిగా లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
బ్రహ్మచారిణి(
గాయత్రి )
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ |
దేవీ
ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
రుచిర గర్భ సీసము. ( రుచిరము. - జ భ స జ గ .. యతి 9)
శ్రీమాతవు
పరాత్పరీ కను నను బ్రహ్మ - చారిణీ! భక్తితో సంస్తుతింతు.
నిన్నే
గనితరింతునేన్ మది నిను దాల్చి - భక్తితో
నిరతంబు భజన చేతు.
ప్రార్థింతునునిరంతరంబసదృశ
నిశ్చ- లాత్మతో నిన్నెంచి యజ్ఞ రూప.
నీరూపునె
స్మరింతు నిన్ ననుఁగను మాతృ - దేవతా!
వరమీగదే శివాని.
దివ్య
నవరాత్రిలోనిద్వితీయ మూర్తి
బ్రహ్మచారిణివైమమ్ము
బ్రతుకఁ జేయ
మమ్ము
కరుణించి వచ్చితే కమల నయన!
వందనంబులు
చేకొమ్ము పావనాఘ్రి!
సీస
గర్భస్థ
రుచిరవృత్తము.
( రుచిరము. -
జ
భ స జ గ ..
యతి 9)
పరాత్పరీ
కను నను బ్రహ్మచారిణీ!
తరింతునేన్
మది నిను దాల్చి భక్తితో
నిరంతరంబసదృశ
నిశ్చలాత్మతో
స్మరింతు
నిన్ ననుఁ గను మాతృ దేవతా!
నైవేద్యం : పులిహోర
జైహింద్.
1 comments:
నమస్కారములు
జగన్మాతా నమోస్తుతే
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.