జైశ్రీరామ్.
శ్లో. శోకేన వర్ధతే రోగాః పయసా తను వర్ధతే.ఘృతేన వర్ధతే బుద్ధిః, మాంసం మాంసేన వర్ధతే.
గీ. దుఃఖమున రోగ వృద్ధియౌన్. దుష్టమదియు.
పాలు దేహమ్ముఁ బెంచును, భవ్యమదియె.
నేయి బుద్ధిని పెంచును. నేర్పు కలుగు.
మాంసమున మాంస వృద్ధియౌన్ మహితులార!
భావము. దుఃఖము వలన రోగములు, పాల వలన శరీరము, నేయి వలన బుద్ధి, మాంసము వలన మాంసము వృద్ధియగును.
జైహింద్.
1 comments:
నమస్కరములు
చాలా మంచి శ్లోకము . ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.