గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జూన్ 2017, గురువారం

పద్య పక్షమ్ ఛందస్సు ( 8 ) కావ్యాది గ్రాహ్య వర్ణ విచారము.

జైశ్రీరామ్.
పద్య పక్షమ్ ఛందస్సు  ( 8 )
శ్రీ మదాంధ్ర పద్య రచనాభిలాషులారా! వందనములు.
ఇంతవరకు మనము
పద్య పక్షమ్. ఛందస్సు (1) లో శ్రీకారము  కృత్యాదిని కలిగినచో దాని ప్రభావము. - కృతి రచనకుఁ బ్రశస్త వారములు, గురు లఘువుల స్వరూపము,
పద్య పక్షమ్ ఛందస్సు ( 2 ) లో గణ స్వరూప నిరూపణము. గణముల కుదాహరణములు,
సూర్య - ఇంద్ర - చంద్ర గణములు వివరణ.
పద్య పక్షమ్ ఛందస్సు ( 3 ) లో యతులు యతికి పర్యాయపదములు.. స్వర యతులు . 
పద్య పక్షమ్ ఛందస్సు ( 4 ) లో . వ్యంజన యతులు.
పద్య పక్షమ్ ఛందస్సు ( 5 ) లో . ఉభయ యతులు.
పద్య పక్షమ్ ఛందస్సు ( 6 ) లో ప్రాసలు
పద్య పక్షమ్ ఛందస్సు ( 7 ) లో దశ దోషములు
తెలుసుకొన్నాం కదా.

ఇప్పుడు తెలుసుకొనునది
పద్య పక్షమ్ ఛందస్సు ( 8 ) లో కావ్యాదిగ్రాహ్యవర్ణ విచారము
పద్యరచనలో మొట్టమొదటి పద్యము మొట్టమొదటి పాదమున
ఏయే స్థానములలో ఏయే అక్షరములు ప్రశస్తమో, ఏయే అక్షరములు నింద్యమో తెలుసుకొను ప్రయత్నము చేయుదము.
  శ్రీకారము కృత్యాదిని ఉన్నచో దాని ప్రభావము.
శ్రీకారమును పద్యరచన ప్రారంభమున ఉన్నచో ప్రశస్తమని ప్రారంభముననే తెలుసుకొని యున్నాము.   
అటులున్నచో అది సూదంటు రాయి ఇనుమును ఆకర్షించు విధముగా దోషములనాకర్షించి పరిహరించి శుభఫలితములనిచ్చును.
శ్రీకారమైనను, దేవతా వాచకమైనను ఉన్నచో సిరులు వఱలును.
శుభ వాచకములు, దేవతా వాచకములు, మొటి పాదమున ప్రారంభము నుండి ప్రయోగించిన అనింద్యములు.
ఆది పద్యమున మొదటి పాదమున మూడు గణములందలి అక్షరములను మంగళప్రదమగువర్ణములు మాత్రమే  
ప్రయోగింపఁబడునట్లు చూచుకొన్నచో ఆ కృతి మంగళప్రదమగును.
అటుల కాక నిషిద్ధాక్షర ప్రయోగము జరిగినచో  
కృతి కర్తకు కృతి భర్తకు అమంగళకరమగునని ఛందశ్శాస్త్రము వక్కాణించుచున్నది.. .
హ్రస్వములు అమృతాక్షరములు దీర్ఘములు విషాక్షరములు కావున
పద్యము ప్రారంభమున అచ్చులైనా హల్లులైనా హ్రస్వములు ప్రయోగించుట క్షేమకరములని తెలియునది

కృత్యాదిని
గణము సుఖములనిచ్చును.
గణము ద్రవ్యలాభమును కలుఁగఁ జేయును.
గణము శుభఫలితములనిచ్చును.
గణము దివ్య సువర్ణాదిక ఫలములనిచ్చును.
గణము విభూతిని కొలుపును.
కావున వాటినే ప్రయోగించిన శుభకరమని గ్రహింపఁదగును.
గణము రోగము కలుఁగఁ జేయును.
గణము లయము చేయును.
గణము భాధలు కలుఁగఁ జేయును.
కావున వాటిని ప్రయోగించరాదని తెలియ వలయును.
  
మొట్టమొదటి పద్యము నందు మొట్టమొదటి పాదము ప్రయోగ నిషిద్ధాక్షరములు.
1 వ అక్షరముగా. 
-- - ౡ .
-- ఙ .
--  జ -- ఞ .
--- ణ .
-- న .
-  భ - మ .
------ క్ష .
3 వ అక్షరముగా.
----------- హ.
5 వ అక్షరముగా.
--- గ.
6 వ అక్షరముగా.
------------ క్ష.
7 వ అక్షరముగా.
--------- క్ష. .
11 వ అక్షరముగా.
--------- క్ష. .
కావ్యమున కాని; ఖండిక యందు కాని
మొట్ట మొదటి పద్యమున అందున మొట్ట మొదటి పాదమునకే ఈ పై నిబంధనలు వర్తించును.
కావ్యాదిని

సంయుక్త వర్ణము ప్రయుక్తమైనచో సంయుక్తమందున్నవర్ణములు పరస్పర మైత్రి కలిగి యుండిన శుభము.
అటుల కానిచో కృతిపతి పిడుగుపడిన చందమున కూలును.

పంచభూత బీజాక్షరములు
పద్యాదిని
వాయు బీజాక్షరములైన
- - - - - - - - - లు ప్రయోగించినచో దుఃఖము ప్రాప్తించును.
అగ్ని బీజాక్షరములైన
- - - - - - - - - లు ప్రయోగించినచో మృత్యువు ప్రాప్తించును.
భూ బీజాక్షరములైన
- - - - - - - - లు ప్రయోగించినచో సంపదలు ప్రాప్తించును.
ఉదక బీజాక్షరములైన
- - - - - - - - - లు ప్రయోగించినచో సంతోషము ప్రాప్తించును.
ఆకాశ బీజాక్షరములైన
- - అం - - -- - - క్షలు ప్రయోగించినచో కృతిపతి నత్యంత దరిద్రుఁ జేయును.
కావ్యాది పద్య ప్రథమ పాదమున
3 - 5- 6- 7- 11వ అక్షరములుగా
క చ ట త ప లుప్రయోగింప కూడదని గ్రహింప వలెను.
మొదటి అక్షరముగా  క ఖ చ చ జ డ ద ధ భ య శ క్ష ష స లు ఉండ కూడదు. ఇట్లు కాకుండినచో మేలు చేకూరును. స్వరములన్నియు ఉత్సవ కారులే.
ములు విభవము కూర్చును.
త భ స లు ఒప్పదు.
ర య లు అత్యంత శుభకరము.,
భ య లు హానికరము.

ఛందశ్శాస్త్ర ప్రమాణము.
శ్రీకారము కృత్యాదిని ఉన్నచో దాని ప్రభావము.
క. శ్రీకారము కృత్యాదిని
బ్రాకటముగనున్నఁ జాలు బహుదోషములం
బోకార్చి శుభము లొసఁగును
బ్రాకృతముగ నినుముసోఁకు పరుసము భంగిన్‌.189
తే. ఆదిపద్యాది శ్రీకారమైన దేవ
వాచకంబైన నప్పుడు వఱలు సిరులు
నాది పద్యాది మూఁడు గణాక్షరములు
చూడవలెఁ గాని యన్నియుఁ జూడవలదు.195
క. ఒనరఁగ శుభవాచకములు
ఘనతరమగు దేవవాచకంబులు నై పే
ర్చినగణములు వర్ణంబులు
ననింద్యములు కృతుల మొదల నహిపతిశయనా! 28

గణ ఫలములు
నవ్యసుఖప్రదాయి గణంబు, కారము రుక్ప్రదంబగున్‌,
ద్రవ్యముఁ జేయు నా, లయకరంబు కారము, మా శుభంబు, యా
దివ్యసువర్ణకారి, వెతఁదెచ్చును రేఫ, విభూతినిచ్చుఁ దా,
గావ్యములందు నాదినిడఁ గర్తకు భర్తకు నంబుజోదరా!  23

గణాధిదైవతములు
భగణము నేలుఁజందురుఁడు, భానుఁడు దా జగణంబు నేలుఁ, దా
నగణము నేలు నిర్జరగణంబుఁ, సమీరణుఁ డేలు నెప్పుడున్‌
సగణము, నుర్వియేలు మగణంబు, నొగిన్యగణంబుఁ దోయమున్‌,
రగణముఁ బావకుండుఁ, దగణంబు నభంబును నేలుఁ, గేశవా!    24
తాత్పర్యము. భగణమును చంద్రుఁడు,జగణమును సూర్యుఁడు, నగణమునకు దేవతలుసగణమునకు వాయుదేవుఁడు, మగణమునకు భూమి, యగణమునకు జలము, రగణమునకు అగ్ని, తగణమునకు ఆకాశము, పాలకులు.

కృత్యాది వర్జనీయ గణములు నక్షరములు
క. పుర, శర, రస, గిరి, రుద్రుల
నరయ నకచటతప లిడుట యనుచిత మయ్య
క్షరములును రసభజంబులుఁ
బరిహరణీయంబు లాదిఁ బంకజనాభా!      25
తాత్పర్యము. కావ్యాది పద్య ప్రథమ పాదమున మూడవ - ఐదువ - ఆరువ - ఏడువ - పదకొండువ అక్షరములుగా
క చ ట త ప లుప్రయోగింప కూడదని గ్రహింప వలెను.
క. మొదలును - - లు - - లు
- లును - - - క్ష - - లు తగవు. వర్ణా
స్పదములు గాకుండిన మే
లొదవించును స్వరములెల్ల నుత్సవకారుల్‌. 26
తాత్పర్యము. మొదటి అక్షరముగా  క ఖ చ చ జ డ ద ధ భ య శ క్ష ష స లు ఉండ కూడదు. ఇట్లు కాకుండినచో మేలు చేకూరును. స్వరములన్నియు ఉత్సవ కారులే.
క. మొదల నభంబులు రెండును
గదిసిన విభవంబు - - గణసంగతి యొ
ప్పదు రయముల నధికశుభం
బొదవును భయములను హానినొందు నృసింహా! 27
తాత్పర్యము. ములు విభవము కూర్చును. త భ స లు ఒప్పదు. ర య లు అత్యంత శుభకరము., భ య లు హానికరము.

సంయుక్తాక్షర ప్రయోగవిధి
తే. మొదల సంయుక్త వర్ణంబు గదిసె నేని
మడప కా రెంటికిని గ్రహ మైత్రివలయు
నిది విచారింపఁడేనిఁ గృతీశ్వరుండు
పిడుగు మొత్తిన గతిఁగూలుబిట్ట బిఱ్ఱు. (భీమన ఛందము)194

పంచభూత బీజాక్షరములు
పద్యాది నొందించినచో
వాయు బీజాక్షరములు (మారుత బీజంబులు శోకవార్ధిఁ బడఁగాద్రోయును)
క. పరఁగఁగ అ ఆ ఏ లును
వరుసఁ గ చ ట త ప య ష లు ధ్రు - వంబునఁ బదియున్‌
ధరఁ భవన బీజములు గో
వరవాహన! సకలలోక - వందిత చరణా! (వాదాంగ చూడామణి)174
అగ్ని బీజాక్షరములు (శిఖి బీజంబుల్‌ మృతింజేయు)
క.క్రమమున ఇ ఈ ఐలును
రమణ             లును రాజిలుఁ బదియున్‌
సమముగను దహన బీజము
లమరఁగఁ దలపోయ శంబరాంతక హరణా!(వాదాంగ చూడామణి)175
భూ బీజాక్షరములు (క్షితిబీజంబులు సంపదల్వొదలఁ బోషించున్‌)
క.మున్నుగ - - లును
నెన్నఁగ - - - - - - ” - లు నీ ధరఁ బదియుం
బన్నుగ భూ బీజంబులు
పన్నగ వరశయన బాణ! పన్నగభరణా! (వాదాంగ చూడామణి) 176
ఉదక బీజాక్షరములు (బయోబీజముల్ తతంబున్‌ ప్రమదం బొనర్చు)
క.ధీరత - - లును
సారపు - - - - - - లు సరసన్‌ బదియున్‌
దోరపు జలబీజంబులు
ఘోరాసుర పురవిదార! గోధ్వజ కలితా! (వాదాంగ చూడామణి) 177
ఆకాశ బీజాక్షరములు (న్నభోబీజముల్‌ పతి నత్యంత దరిద్రుఁ జేయు)
క. - - అం - - -- లు
సల్లలితములై వెలుంగు - క్షలు పదియుం
జెల్లు గగన బీజములని
తెల్లముగా వాసవాది దివిజస్తుత్యా! (వాదాంగ చూడామణి)       178
క్రింది పద్యమే ఈ పైని వివరించిన పంచభూత బీజాక్షర ఫలంబులకు ప్రమాణము.

మ. క్షితిబీజంబులు సంపదల్వొదలఁ బోషించున్‌ బయోబీజముల్
తతంబున్‌ ప్రమదం బొనర్చు శిఖి బీజంబుల్‌ మృతింజేయు మా
రుత బీజంబులు శోకవార్ధిఁ బడఁగాద్రోయున్నభోబీజముల్‌
పతి నత్యంత దరిద్రుఁ జేయు మిగులం బద్యాది నొందించినన్‌. 
(భీమన ఛందము) 179

అమృతాక్షర విషమాక్షరములు
క. అమృతాక్షరములు హ్రస్వము
లమరఁగ దీర్ఘములు విషములనఁబడు వీనిన్‌
గ్రమమున అకచటతపయశ
సముదయమును దెలిపి నిలుపఁ జనుఁ బద్యాదిన్‌. (గోకర్ణ చ్ఛందము) 180

క. తెలియక ఘోషాక్షరములు
నెలవుగఁ బద్యాదియందు నిలిపిన చోటన్‌
నలమటఁ బొందియుఁ గృతిపతి
పలుమఱు వెతనొంది దైన్య పాటుం జెందున్‌.       181

.   - - - - - - - లెనిమిది
ప్రకటిత గిరి ఋతులమూఁటఁ బదునొక్కింటన్‌
వికటముగఁ బెట్టి పద్యము
సుకవులు సత్ప్రభువుల కిడ ర శుభకరమగుటన్‌. 
(ఉత్తమగండచ్ఛందము)  182

క. పుర శర రస గిరి రుద్రుల
నరయ - - - - - లిడుట యనుచిత మీ య
క్షరములు - - - - జంబులు
బరిహరణీయంబు లాదిఁ బంకజనాభా!  (అనంతుని ఛందము)    183

చ. రస గిరి రుద్రసంఖ్యలను రాదొనఁగూర్ప స్వరాదివర్ణముల్‌
వసుధ కారమున్‌ క్ష - - వర్ణ వర్ణముల్‌ దలంపఁగా
- - - రంబు లగ్ను లెడ నైదవచోట - లాది వర్ణముల్‌
ససిదగఁ జెప్ప నాఱిట - ల్‌ - ముల్‌ గదియింప వర్జ్యముల్‌.    184

క. ఌలు ఋలు
దలు ములును ర ళలు దగ నక్షలున్‌
నెలకొని పద్యముఖంబున
నిలుపరు సత్కవులు శాస్త్ర నింద్యము లగుటన్‌. 
(అధర్వణుని ఛందము) 185

క. - - - లివి మూఁట వచో
నిజముగ నిందించి చెప్ప నీల్గుటయరుదే
భుజగమునకన్నఁ గీడగు
సుజనామరభూజ! రేచ! సుగుణసమాజా!  
(భీమన ఛందము)186

క. ఘోరతరపద్యముఖమున
వేఱుగ నొకచోట చూచి వెదకఁగనేలా
యాఱవకడ 'తా' నిలిపిన
మాఱమ్మునఁ గ్రుమ్మినట్లు మడియు మనుజుఁడున్‌. 
(భీమన ఛందము)187
ఇట్టి దుష్ట ప్రయోగమున కుదాహరణ చాటువు.

చ. హయమదిసీత పోతవసు ధాధిపుఁ డారయ రావణుండు వి
నిశ్చయముగ నేను రాఘవుఁడ జాహ్నవి వారిధి మారుఁ డంజనా
ప్రియతనయుండు సింగన విభీషణుఁడా గుడిమెట్ట లంక నా
జయమును బోతరక్కసుని చావును నేడవనాఁడు సూడుఁడీ.    
(భీమన చాటువు)188

సంయుక్తాక్షర ప్రయోగవిధి
తే. మొదల సంయుక్త వర్ణంబు గదిసె నేని
మడప కా రెంటికిని గ్రహ మైత్రివలయు
నిది విచారింపఁడేనిఁ గృతీశ్వరుండు
పిడుగు మొత్తిన గతిఁగూలుబిట్ట బిఱ్ఱు. (భీమన ఛందము)194

అక్షరములకు గ్రహాధిపతులు
తే. ఆదులకు రవి, కాదులకవనిజుండు,
చాదులకు బుధుఁడును, గవి డాదులకును,
తాదులకు బృహస్పతి, శని పాదులకును,
యాదులకు నెల్ల శశియు, గ్రహంబు కృష్ణ! 190
తాత్పర్యము. అకారాదులకు సూర్యుఁడుకవర్గమునకు అవనిజుఁడు, చవర్గమునకు బుధుఁడు, టవర్గమునకు కవి, తవర్గమునకు బృహస్పతి, పవర్గమునకు శని, యకారాదులకు చంద్రుఁడు గ్రహములు.
మాతృకా పూజనము
సీ. కాది త్రివర్గ వర్ణాలికి మౌక్తిక, వజ్రభూషలుఁ దెల్పు వస్త్రములును
తపవర్గ రవవర్ణ తతి కబ్జరాగంపుఁ, దొడవులు వలువలుదొవరు చాయ
యలశషసహ బీజములకగుఁ బుష్యరాగాభరణములు పీతాంబరములు
ళక్షఱంబులకు నీలాల సొమ్ములు గారు, కొను నీలి వన్నెల కోక లెల్ల  
తే. వరుస నీనాల్గు తెఱఁగుల వర్ణములకు
ననుభవంబగు ద్రవ్యంబులానవాలు
నాజ్యమును గమ్మఁ దేనియ యాసవంబు
వీనిఁ దెలియక సత్కవి యౌనె జగతి. 
(కవిసర్పగారుడము)193.
స్వస్తి.

#CRKRchandassu . (ముఖ పుస్తకము)
  జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పలు విధములైన ఛందస్సులను సులభ సైలిలో అందిస్తున్న శ్రీ చింతా సోదరులు శ్లాఘ నీయులు . వారి కృషికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.