గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జూన్ 2017, గురువారం

పద్య పక్షమ్ ఛందస్సు ( 6 )

జైశ్రీరామ్.
పద్య పక్షమ్ ఛందస్సు  ( 6 )
శ్రీమద్గుణ సంపన్నులారా! వందనములు.
ఇంతవరకు మనము
పద్య పక్షమ్. ఛందస్సు (1) లో శ్రీకారము  కృత్యాదిని కలిగినచో దాని ప్రభావము. / కృతి రచనకుఁ బ్రశస్త వారములు, గురు లఘువుల స్వరూపము,
పద్య పక్షమ్ ఛందస్సు ( 2 ) లో గణ స్వరూప నిరూపణము. గణముల కుదాహరణములు,
సూర్య - ఇంద్ర - చంద్ర గణములు వివరణ.
పద్య పక్షమ్ ఛందస్సు ( 3 ) లో యతులు యతికి పర్యాయపదములు.. స్వర యతులు . 
పద్య పక్షమ్ ఛందస్సు ( 4 ) లో . వ్యంజన యతులు.
పద్య పక్షమ్ ఛందస్సు ( 5 ) లో ఉభయ యతులను మనము తెలుసుకొన్నాం కదా.
ఇప్పుడు
పద్య పక్షమ్ ఛందస్సు ( 6 ) లో ప్రాసలను గూర్చి తెలుసుకొందాం.
పద్య పాదములందు రెండవ అక్షరమునకు ప్రాస అని పేరు.
ప్రాస నియమము చెప్పఁబడిన పద్యములలో నాలుగు పాదములలోను
ప్రాసాక్షరమునకు ముందు పూర్ణ బిందువున్నను, లేదా, విసర్గమున్నను
అన్ని పాదములలో అట్లే ఉండవలయును.
ప్రాసాక్షరమునకు ముందు గురువు ఉన్న గురువే, లేదా లఘువు ఉన్న లఘువే అన్ని పాదములలో ఉండవలయును.
ఈ నియమము ఇతర జాతి పద్యములకు
ఉత్సాహ, అక్కర, మున్నగువాటికిని వర్తించును.
ప్రాసయతికి కూడ ప్రాస నియమము వర్తించును. 
సంస్కృతమునకు చెందిన అర్ధసమ, విషమ వృత్తములందు ఈ ప్రాస పూర్వ నియమములు వర్తించవు.
ఉదా. ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్రలతో కూడిన ఉపజాతి. . పాదములు గగ . పాదములు గగ. ప్రాస రెండవ అక్షరమే కావున గురు పూర్వకముగాను, లఘు పూర్వకముగాను ప్రాసాక్షరముండునని గ్రహింపవలయును.
ప్రాసలు
1) అర్థ బిందు సమప్రాస.
ప్రాసాక్షరమునకు ముందు అరసున్నా (అర్థానుస్వారము) ఉండినను అది అన్ని పాదౌలలోను ఉండ వలెనను నియమము లేదు. ఐనప్పటికి
ప్రాసాక్షరానికి ముందు అర సున్న అన్ని పాదాలలోనుంచినచో అర్థబిందు ప్రాస అనఁబడును. " వీఁక - తాఁకి "
ఉదా.
వీఁడు మనోజ్ఞుఁడున్ జెరకు విల్తుని మిత్రుఁడు కల్వ కన్నెకున్
ఱేఁడును, చల్లనయ్యయును, శ్రేయమహౌషధి కారకుండునున్.
వీఁడికి ప్రేమికుల్ జడుచు, వీనికి సాటి యొకండు లేడు. తా
పోఁడిమి గొల్పు లోకులకు, పూజ్యుఁ డతం డెవఁడయ్య చెప్పరే?
2) పూర్ణ బిందు సమప్రాస.
మొదటి పాదంలో ప్రాసాక్షరం పూర్ణ బిందు పూర్వక మైనట్లైతే ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదములలోను ప్రాసాక్షరము పూర్ణ బిందు పూర్వకమే అవవలెను. " పొందు - బృంద "
ఉదా. .
. సుందరుఁడా రఘూద్వహుఁడు, సుందరమైనది తత్కథాంశమున్.
సుందరి జానకీ సతియు, సుందరమైన వనంబు నొప్పు, సత్
సుందరమైన కావ్య మది, సుందరుడా కపి. సుందరం బహో!
సుందరమైన మంత్రము సుందర మెయ్యది సుందరంబునన్?
ఉదా. . (శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ కృత అనంత భాస్కర శతకము ౧౦౪)
శా. యంత్రంబియ్యది వయు రూపునిగ నీవాడించినట్లాడునే!
యంత్రారాధన చేతునా విపుల మాయాచ్ఛేద తంత్రంబులా
మంత్రమ్మా శుభముల్ సమాశ్రయములై మా యందు పెంపొందగా
హ్రీంత్రైలోక్య వశంకరా! తెలుపరా! శ్రేయస్కరా! శ్రీధరా!
3) ఖండాఖండ ప్రాస.
ర్థ బిందు పూర్వక ప్రాసాక్షరం విషయములో అన్ని పాదములలో ఆ విధముగా ఉండవలెనను నియమము లేదు.
అరసున్న పూర్వక ప్రాసాక్షరముతో అరసున్నా లేని ప్రాసాక్షరాన్ని ఆ పద్యంలో ప్రాసగా ప్రయోగించ వచ్చును."
బోఁ టి - పా "
ఉదా.
. గాఁడిని పడు మన సంస్కృతి
తోడుగ సత్కవులు కృతులతోఁ జేతనమున్
వేఁడకనే నిలిచి కొలుప.
పాడి యిదే పద్యపక్ష వర కవులకిలన్.
4) సంయుక్తాక్షర ప్రాస.
సంయుక్త హల్లు ప్రాస స్థానములో ఉన్నచో అదే సంయుక్త హల్లు ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదములలోను ప్రాస స్థానమున ప్రయోగించ వలెను. " అక్ష - కుక్షి "
శా: తుచ్ఛాధ్వంబుల నేగగా హృదయమెంతో స్వాభిమానైక భా
వచ్ఛన్నంబయి యొప్పదే యితర త్రోవల్ కానగారావు ని
ర్విచ్ఛేదంబవునట్లు కన్పడెడి దారిద్ర్యాంధకారమ్మునన్
త్వచ్ఛీర్షాంచల లగ్న చంద్ర రుచులన్ దండింపవయ్యా! శివా!
ఉదా. . విద్వన్మణి శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు ముఖ పుస్తకములో
శ్రీదువ్వూరి వీ.యన్. సుబ్బారావు (మిస్సన్న) గారిని ప్రశంసిస్తూ వ్రాసిన
. స్సనిపించెడి భావము 
స్వస్సంస్తవనీయభక్తి వాఙ్మధుర సుధాం 
స్సరణియు - మీ కవితను 
మిస్సగుటకు వీలులేదు మిస్సన్నార్యా!
ఉదా౩. శ్రీదువ్వూరి వీ.యన్ .సుబ్బారావు (మిస్సన్న)గారు సీతమ్మను ప్రశంసిస్తూ
ముఖ పుస్తకములో ౪ - - ౨౦౧౭ న వ్రాసినది.
. సృష్టి స్థిత్యన్తమ్ముల
నిష్టామాత్రమున జేయు నీశ్వరి వీవై
ష్టమ్ముల హరియించుచు
శిష్టుల రక్షించు సీత! చిన్మయి! ప్రణతుల్
5) సంయుతాసంయుత ప్రాస.
రేఫ కాని, లకారము కాని ఏదైనా హల్లు క్రింద సంయుక్తమై ప్రాస స్థానమునందున్నచో మిగిలిన ప్రాస స్థానములలో రేఫ లకార సంయుక్తముగా కాని, అవి లేకుండా కాని ప్రాసగా చెల్లును.
" శ్రీకర - ఈ క్రియ "
ఉదా.
. క్రిమి సంహారకములు
భీరములు. హానిఁ గొలుపు. ప్రియ కర్షకుఁడా!
చేకొ, సేంద్రియములతోన్
మీకృషికిని మేలొనరును. పృథ్వికి బలమౌన్!
6) లఘు ద్విత్వ ప్రాస. (ద్విత్వము = జడ్డసంయుక్తము)
పూర్వాక్షరమునకు గురుత్వము నీయక, లఘుత్వమునిచ్చు ద్విత్వము (సంయుక్తము) ప్రాసలో కూర్చఁబడినప్పుడు అన్ని పాదములలోను ప్రాస అటులనే రావలెను. అనగా
సంయుక్త పూర్వాక్షరము లఘువయినచో మిగిలిన అన్ని పాదాలలోనూ అటులనే రావలెనని తెలియునది.
"విద్రుచు - అద్రువ" (ప్రాస పూర్వాక్షరం గురువైతే గురువే; లఘువైతే లఘువే రావలెను)
ఉదా. ఉత్తర హరివంశము - ౧౦౯.
. ద్రిచిన కాల పాశమున నీగతి నామదిఁ గ్రోధ వల్లికం
ద్రిచినవారు మన్నిశిత బాణ పరంపరనైన మిణ్గుఱుల్
విద్రుపఁగఁ దత్ఫలంబుల చవిం జరితార్థులు గా శరీరపుం
జిద్రుపలు చేరుఁ దత్సతుల చేతులఁ గాక కులంబు నాతులన్.
7) వికల్ప ప్రాస.
క్ చ్ ట్ త్ ప్ లకు అనునాసికములు పరమయినచో క్ చ్ ట్ త్ ప్ లు ఆ వర్గ ఙ్ ఞ్ ణ్ న్ మ్ లుగా కాని, గ్ జ్ డ్ ద్ బ్ లుగా కాని వికల్పముగనగును. రెండు వికల్ప సంధ్యక్షరములకు ప్రాస చెల్లును..
" దిక్ + హిత = దిఙ్ + హిత = దిఙ్మహిత  లేదా దిగ్ + హిత = దిగ్మహిత
ఉదా. అప్పకవీయమున ప్రాసయతి గల గీతముననుదహరించెను.
తే.గీ. ప్రాఙ్నగ సమాన ధృతి సుధా రుఙ్నిభాస్య
స్రఙ్నిచయ సక్త కంఠ దావాగ్నిపాయి
వాఙ్మనోహర నుత యసదృఙ్మహాత్మ,
దిఙ్మహిత కీర్తి యర్జున యుగ్మ భేది.
8) ఉభయ ప్రాస.
" - " లకు,
" - " లకు, ప్రాస చెల్లును. " ప్రా - దా "  వసు- విమ "
ఉదా.
. పద్య పక్ష సేవకు
మును తీర్చంగ లేము కృషితో కృతులన్
ముగ వ్రాయుచు పంపిన
మోచనమగు యనంత కృష్ణా! వినుమా!
ఉదా.
. రిన పిల్లల నపు డది
విమించును. కాన మనము వివరించవలెన్
రక కొట్టక తిట్టక.
వియంబు గ్రహింతురపుడు. వినుమయ కృష్ణా!.
9) అనునాసిక ప్రాస.
ద్విత్వము లైన నకార మకారములు క్రమముగ బిందు పూర్వక నకార మకారములతో ప్రాస చెల్లును.
భ/ క్తిమ్ము< భ/ క్తిన్ + ముర = భ/ క్తిం ము> తో - తమ్ములు. కు ప్రాస.
ఉదా.
. నిన్నేనయ! యాదగిరీ
శం నమయని పలికితినయ  సత్ప్రేరణకై
యున్నావు నీవటంచును
నం నరహరి మంత్రపఠమునన్ దలచితినేన్.
ఉదా.
. మ్మగ పలికితి వందే
హం మధు సూదన యనుచును హరిహర కృపతో
మ్ములఁ గావఁగ నోంకా
రం మంత్రంబయి వినఁబడి రక్షించుమయా!.
10) ప్రాస మైత్రి ప్రాస. మ్మ - ం బలకు ప్రాసమైత్రి కలదు.
 కావున" మ్మ(అంమ)  - (అంబ) ం బ " లకు ప్రాస చెల్లును.
మ్మా నినునే విడి నిమి
షంబైనను నిలువలేను. సమ్మతిఁ గనుమో
మ్మా! నీ పాద సరసి
జంబులకేన్ మ్రొక్కుచుంటి. సన్నుత వాణీ!
11) ప్రాస వైరము.
ఉచ్చారణలో ఒకే విధముగా ఉన్నప్పటికీ
" - ఱ " లకు ప్రాస చెల్లదు.
12) స్వవర్గజ ప్రాస.
" - ధ " లకు,ప్రాస చెల్లును.
" - ధ " లకు ప్రాస చెల్లును.
ఉదా..
. బంధిత సీసంబును
సులొల్కఁగ వ్రాసినట్టి సుకవి యనంతా!
కము బాగున్నదయా!
ధువైరీ! మాకు నేర్పు. మానిత కృష్ణా!
ఉదా..
. మావుఁడా! మము కావర!
మోదంబును కూర్చు కవిత ముద్దుగ నిమ్మా!
యీ ధాత్రి చిత్రకవితల
గోదాముగ చేయుమయ్య కూర్మిని కృష్ణా!
13) ఋ ప్రాస.
" - ర " లకు ప్రాస చెల్లును. ఉ: " ఆషి - చీలు "
ఉదా.
. హే షి గణ పటు వర్ధన!
కోరుచు సత్కవిత వ్రాసుకొనఁ జేసిరిగా!
ణ మెన్నడు తీరును?
కారుణ్యము తోడ చూచి కాచెడి కృష్ణా!
14) లఘు యకార ప్రాస. ప్రకృతి సిద్ధ యకారము అలఘువు. వ్యాకరణసూత్ర సాధ్య యకారము లఘువు.
రెంటికీ ప్రాస చెల్లును.
" జు < ఆ + అజు = + య్ + జు > - శాయికి "
ఉదా.
. శ్రీ నుపమ ధన దాయిగ
శ్రేములే కూర్చు మనకు చిత్తము లోనన్
బాని భక్తిని కొలిచిన
నాయీ వర భావన మది నమ్ముము కృష్ణా!.
15) అభేద ప్రాస.
" - ళ " లకు ప్రాస చెల్లును.
" - డ " లకు ప్రాస చెల్లును.
ఉదా.
. కాము పుట్టుటకీ భూ
గోము, రవి కారణమగు. గోపాలకుఁడే
హేగ సృజియించగ మన
కీలాగున సాగుచుండె నింతయు సుకవీ!
ఉదా.
. వేడుక పద్యపు పక్షము
మేగు కవితలను గొలుపు స్మృతిలో నిలువన్.
పాడును గని లోకంబున
శ్రీను గురిపించ కవులు చేతురు కవితల్.
16) సంధిగత ప్రాస.
ప్రాసలో వ్యంజనము ప్రథానము గావున సంధియందు నిలిచిన ఆగమ ఆదేశ వ్యంజనములకే ప్రాస మైత్రి పాటించవలెను. వ/ చ్చెంగుంతి < వ/ చ్చెన్ + కుంతి > - సింగము మొదలగునవి.
ఉదా.
. మ్మా(సత్ + మాన్య = మ్ + మాన్య = మ్మాన్య) న్యము ప్రజ పద్యము.
ముమ్మా(మూడు + మాటికి = ముమ్ + మాటికి = ముమ్మాటికి) టికి కవులతతికి ముచ్చటఁ గొలుపున్
కిమ్మని పలుకని వారలె
కొమ్మను (కొమ్ము + అను) చును పద్యములిడఁ గూర్తురు సుకవుల్.
ఐచ్ఛికముగ ప్రయోగించు శబ్దాలంకార ప్రాసములు.
శబ్ద శోభను కలిగించు అనుప్రాసాదులు.
సుకర ప్రాసము దుష్కర ప్రాసము ద్వంద్వ ప్రాసము త్ర్యక్షర ప్రాసము చతుష్ప్రాసము అంత్య ప్రాసము. అనుప్రాసము అని ఏడు విధములు.
. సుకర ప్రాసము.
సులభముగా ఉండు వర్ణములతో ప్రాస వేసిన సుకర ప్రాస.
ఉదా.
. వితలనల్లుట సులభము.
వి కాననివెన్ని కవులు వ్రాతురు. కవితన్
ప్రవిమల శబ్దాలంకృతు
విరళముగఁ గూర్చు కవి మహాకవి మనలో.
. దుష్కర ప్రాసము.
కష్ట సాధ్యమైన అత్యంత కఠినమైన సంయుక్తాక్షరము ప్రాసగా ఉన్న దుష్కరప్రాసము.
ఉదా.
. దుష్కృతి ఫల సంపన్నులు
నిష్కృతి లేనట్టివారు నిలువ ననర్హుల్.
నిష్క్రమణమొక్కటే కద
నిష్కృతి భూవలయమందు నిర్భాగ్యులకున్.
. ద్వంద్వ ప్రాసము. ప్రాసాక్షరముతో పాటు దాని ననుసరించు తరువాత అక్షరమునకు కూడా ప్రాస నియమము పాటించుట ద్వంద్వ ప్రాసము, లేక ద్విప్రాసము.
ఉదా.
. రారా మా రఘురామా!
మా రామా రావదేర? మముఁ గన రావా?
ధీరా! మా సంసేవల
నేరా మన్నించ లేవ? యీశ్వర! రారా!
. త్ర్యక్షర ప్రాసము.
రెండు, మూడు, నాలుగు అక్షరములకు ప్రాస వేయుట.
ఉదా.
. జ్ఞానమున బుద్ధి యును న
జ్ఞానమున దురిత మతియును కలుగును కానన్
జ్ఞానమును కొల్పు కవి సు
జ్ఞాన మునివరుఁడు తెలియఁగ సత్కవన విధిన్.
. చతుష్ప్రాసము
రెండు, మూడు, నాలుగు, ఐదు అక్షరములకు ప్రాస నియమము పాటించుట.
ఉదా.
. నీవాడినయ నరహరీ!
నే వాడనయ కవితలను నీచ పదములన్.                                                         
నావాడ! నయ నిధానా!
నావాడని యభయమిచ్చి ననుఁ గన రారా!
. అంత్య ప్రాసము.
పాదాంత వర్ణమునకు ప్రాస వేయుట. ఈ అంత్య ప్రాసకు ప్రాస నియమము లన్నియు వర్తించును.
మరియొక ప్రత్యేకతను మనము గుర్తించ వలయును.
యతిలో పాటించిన విధముగా అంత్యప్రాసకు హల్ మైత్రితో పాటు అచ్ మైత్రి కూడా పాటింప వలయును.
ఉదా.
. అగణిత విభవస్ఫూర్తీ!
నిగమాగమ సతత వినుత నిర్మల మూర్తీ!
జగదబిరక్షణ ర్తీ
యగునంత్యప్రాసమిట్లుదంచిత కీర్తీ!
. అనుప్రాసము.
ఒక్క అక్షరము పెక్కుసార్లు మొదటి నుండియు కడ వరకు వెంబది వెంబడి ఆవృత్తి సేయుట.
  ఉదా.
  ద్వ్యక్షర కందము.
  మనమున ననుమానము మా
  ను. నను మనమున మనమను. మనుము మన్ననమున్
  నిను నను మనుమనె ముని. ము
  న్ననుమానము మాని మనుము. నను మన నిమ్మా!

  స్వస్తి.
#CRKRchandassu ..(Face Book)
Print this post

4 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పద్య రచనకు కావలసిన విలువైన సందేశాలను సులభగ్రాహ్యముగా అందిస్తున్న శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మనసు తపించెనమ్మ. గుణ మాన్య భవన్మహనీయ వ్యాఖ్యకై.
ప్రణతులు చేతునమ్మ గుణవర్ధిని మా జగదేక మాతకున్.
నిను మము జేర్చి కాచుటను నిర్భర సంతస సన్నుతాత్మతోన్.
మనుము జగంబునన్,సుజన మాన్య పథంబున సంతసంబుతో.
మీ
తమ్ముఁడు
రామకృష్ణారావు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కృతజ్ఞతలు సోదరా

Unknown చెప్పారు...

గురువుసమానులకు నమస్కారములు విషమయతి నివివరించమని మనవి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.